KL Rahul: నేను వస్తున్నా.. టీమిండియా అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పిన కేఎల్ రాహుల్…
KL Rahul: టీమిండియా స్టార్ క్రికెట్ కేఎల్ రాహుల్ ఎంట్రీ ఇవ్వనున్నట్లుగా ప్రకటించాడు. కడుపు నొప్పితో ఐపీఎల్ నుంచి అర్ధంతరంగా తప్పుకున్న కేఎల్ రాహుల్ త్వరలో ప్రారంభం కానున్న
టీమిండియా స్టార్ క్రికెట్ కేఎల్ రాహుల్ ఎంట్రీ ఇవ్వనున్నట్లుగా ప్రకటించాడు. కడుపు నొప్పితో ఐపీఎల్ నుంచి అర్ధంతరంగా తప్పుకున్న కేఎల్ రాహుల్ త్వరలో ప్రారంభం కానున్న ఇంగ్లండ్ పర్యటనకు రెడీ అవుతున్నాడు. అపెండిసైటిస్ ఆపరేషన్ చేయించుకుని విశ్రాంతి తీసుకుంటున్న రాహుల్ ప్రస్తుతం పూర్తిగా కోలుకున్నాడని తెలుస్తోంది.
ఇంగ్లండ్ టూర్ కోసం ఎంపిక చేసిన భారత జట్టులో రాహుల్ పేరు ఉన్నప్పటికీ.. అతను వెళ్లేదీ లేనిదీ అనుమానంగానే ఉంది. అయితే రాహుల్ పూర్తి ఫిట్‌నెస్ సాధించాడని తెలుస్తోంది. అతను ఇంగ్లండ్ వెళ్లేందుకు బీసీసీఐ పచ్చ జెండా ఊపిందని తెలుస్తోంది. రాహుల్ చివరిసారిగా 2019 సెప్టెంబర్‌లో వెస్టిండీస్‌తో టెస్టు మ్యాచ్ ఆడాడు. గతేడాది ఆస్ట్రేలియాలో జరిగిన టెస్టు సిరీస్‌కు ఎంపికైనప్పటికీ రాహుల్‌కు తుది జట్టులో చోటు లభించలేదు.