Asia Cup 2023: ఆసియా కప్ 2023లో ఒకే గ్రూప్‌లో భారత్- పాకిస్తాన్.. క్రికెట్ క్యాలెండర్‌ను షేర్ చేసిన జై షా

బీసీసీఐ అధ్యక్షుడు జై షా క్రికెట్ క్యాలెండర్‌ను షేర్ చేశారు. 2023 ఆసియా కప్‌లో భారత్, పాకిస్థాన్‌లు ఒకే గ్రూప్‌లో ఉండనున్నాయి.

Asia Cup 2023: ఆసియా కప్ 2023లో ఒకే గ్రూప్‌లో భారత్- పాకిస్తాన్.. క్రికెట్ క్యాలెండర్‌ను షేర్ చేసిన జై షా
Odi Asia Cup 2023
Follow us

|

Updated on: Jan 05, 2023 | 1:52 PM

క్రికెట్ ప్రియులకు చేదు వార్త అని చెప్పవచ్చు. బీసీసీఐ అధ్యక్షుడు జై షా క్రికెట్ క్యాలెండర్‌ను షేర్ చేశారు. 2023 ఆసియా కప్‌లో భారత్, పాకిస్థాన్‌లు ఒకే గ్రూప్‌లో ఉన్న విషయాన్ని తెలిపారు. పురుషుల ODI ఆసియా కప్ 2023 సెప్టెంబర్‌లో జరుగుతుంది. క్వాలిఫైయింగ్ జట్టుతో పాటు భారత్-పాకిస్థాన్‌లు ఒకే గ్రూప్‌లో ఉంటాయని ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడు జే షా గురువారం ధృవీకరించారు. మరో గ్రూప్‌లో శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్‌లు ఉంటాయని ట్వీట్ చేశారు. ఆసియా కప్‌ 2023లో ఒకే గ్రూపులో ఇండియా, పాకిస్థాన్‌ ఉన్నాయి.

ఈ ఏడాది జరగనున్న ఆసియా కప్‌లో చిరకాల ప్రత్యర్థులు ఇండియా, పాకిస్థాన్‌ ఒకే గ్రూపులో ఉన్నాయి. 2022లో జరిగిన ఆసియాకప్‌లోనూ ఈ రెండు టీమ్స్‌ ఒకే గ్రూపులో ఉన్న విషయం తెలిసిందే. దీంతో గ్రూప్‌ స్టేజ్‌తోపాటు సూపర్‌ 4లోనూ మరోసారి ఈ రెండు టీమ్స్‌ తలపడ్డాయి. ఇండియా ఫైనల్ చేరకపోవడంతో ఒకే టోర్నీలో మూడోసారి ఇండో – పాక్‌ వార్‌ చూసే అవకాశం ప్రేక్షకులకు దక్కలేదు.

అంతకుముందు దుబాయ్‌లో జరిగిన టీ20 ఆసియా కప్ 2022 ఫైనల్లో శ్రీలంక పాకిస్థాన్‌ను ఓడించింది. పాకిస్థాన్‌తో పాటు శ్రీలంక చేతిలో ఓడిపోవడంతో భారత్ ఫైనల్‌కు చేరుకోలేకపోయింది.

2023 వన్డే ఆసియా కప్‌కు ఏ దేశం ఆతిథ్యం ఇస్తుందో స్పష్టంగా తెలియలేదు. పాకిస్తాన్ అధికారిక హోస్ట్, కానీ పొరుగు దేశానికి వెళ్లడానికి భారతదేశం ఇష్టపడకపోవటంతో ఆసియా క్రికెట్ కౌన్సిల్ టోర్నమెంట్‌ను వేరే చోటికి మార్చవచ్చు. ఏదేమైనా, ఆరుసార్లు ఛాంపియన్‌లు 2023లో ట్రోఫీని భారత్‌కు తిరిగి ఇవ్వడానికి ప్రయత్నిస్తారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం