AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

World Record: ఆ ఇద్దరు టీమిండియా బ్యాట్స్‌మెన్లు ఇంగ్లాండ్ నడ్డి విరిచారు.. ప్రపంచ రికార్డు నెలకొల్పారు!

ఒకప్పుడు టెస్టులకు ఉన్న క్రేజ్ వేరు. ఎంతోమంది దిగ్గజాలను ఈ లాంగెస్ట్ ఫార్మాట్ ప్రపంచానికి పరిచయం చేసింది. ఇదిలా ఉంటే భారత్..

World Record: ఆ ఇద్దరు టీమిండియా బ్యాట్స్‌మెన్లు ఇంగ్లాండ్ నడ్డి విరిచారు.. ప్రపంచ రికార్డు నెలకొల్పారు!
Test Cricket
Ravi Kiran
|

Updated on: Jul 28, 2021 | 5:13 PM

Share

ఒకప్పుడు టెస్టులకు ఉన్న క్రేజ్ వేరు. ఎంతోమంది దిగ్గజాలను ఈ లాంగెస్ట్ ఫార్మాట్ ప్రపంచానికి పరిచయం చేసింది. ఇదిలా ఉంటే భారత్, ఇంగ్లాండ్ మధ్య ఎప్పుడు టెస్ట్ సిరీస్ జరిగినా.. బోలెడంత మజా ఉంటుంది. వచ్చే నెల 4వ తేదీ నుంచి కోహ్లిసేన ఇంగ్లాండ్‌తో ఐదు టెస్టుల సిరీస్ ఆడనున్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలో మనం కాస్త త్రోబ్యాక్ మెమోరీస్‌ను గుర్తు చేసుకుంది. ఇంతకీ ఆ మ్యాచ్ ఎప్పుడు జరిగిందో.. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు చూద్దాం..

జూలై 27వ తేదీ 1936లో ఇంగ్లాండ్, భారత్ మధ్య టెస్ట్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో ప్రపంచ రికార్డు నమోదైంది. ఒక్క రోజులో అత్యధిక పరుగులు నమోదయ్యాయి. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ తొలి రోజు 203 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ బౌలర్లలో తరఫున హెడ్లీ వెరైటీ నాలుగు వికెట్లు తీయగా, గాబీ అలెన్, వాల్టర్ రాబిన్స్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. ఇక ఈ టెస్ట్ మ్యాచ్‌లో రెండో రోజు ప్రపంచ రికార్డు నమోదైంది. మొత్తం 588 పరుగులు నమోదయ్యాయి. ఇందులో 398 పరుగులు ఇంగ్లాండ్ స్కోర్. మొత్తంగా ఇంగ్లీష్ టీమ్ తోలి ఇన్నింగ్స్‌లో 8 వికెట్ల నష్టానికి 571 పరుగులు చేసింది.

అదరగొట్టిన భారత ఓపెనర్లు..

రెండో ఇన్నింగ్స్‌లో భారత్ అద్భుతంగా ఆడింది. ఓపెనర్లు విజయ్ మర్చంట్(114), ముష్తాక్ అహ్మద్(112) మొదటి వికెట్‌కు 203 పరుగుల గొప్ప భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఒక రోజులో వచ్చిన 588 పరుగుల రికార్డులో, ఈ ఓపెనర్లు 190 పరుగులు అందించారు. మొత్తానికి రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా 5 వికెట్ల నష్టానికి 390 పరుగులు చేసింది. ఓపెనర్ల వీరోచిత పోరాటానికి ప్రపంచ రికార్డు నమోదైనప్పటికీ ఈ మ్యాచ్ చివరికి డ్రాగా ముగిసింది.

Also Read:

దేశంలోని ఈ ఐదు ప్రదేశాల్లో లెక్కలేనన్ని నిధులు.. ఇప్పటికీ అంతుచిక్కని రహస్యాలు..

ఈ వైరల్ ఫోటోలో పాము ఉంది.? అదెక్కడో గుర్తించండి చూద్దాం..!

రెండేళ్లుగా ఒక్క టెస్టూ ఆడలేదు.. ఇంగ్లాండ్‌లో సెంచరీ బాదేశాడు.. ఆ టీమిండియా ప్లేయర్ ఎవరంటే!