IND vs WI, WWC 2022: జులన్ గోస్వామి @ 1.. ప్రపంచకప్‌లో చరిత్ర సృష్టించిన భారత బౌలర్..
Jhulan Goswami: భారతదేశంలోని అత్యంత సీనియర్ క్రీడాకారిణుల్లో ఝులన్ గోస్వామి ఒకరు. దీంతో పాటు మహిళా క్రికెట్‌లో అత్యధిక వికెట్లు తీసిన క్రీడాకారిణిగా స్పెషల్ రికార్డు సృష్టించింది.
భారత మహిళ ఫాస్ట్ బౌలర్ ఝులన్ గోస్వామి(Jhulan Goswami) చరిత్ర సృష్టించింది. మహిళల క్రికెట్ ప్రపంచకప్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్(Highest wicket-taker in women world cup) గా రికార్డు నెలకొల్పింది. భారత్ వర్సెస్ వెస్టిండీస్ మధ్య జరిగిన మ్యాచ్‌లో అనిస్సా మొహమ్మద్‌ను అవుట్ చేయడం ద్వారా మహిళల ప్రపంచకప్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా ఝులన్ గోస్వామి నిలిచింది. ప్రపంచకప్(Icc Women World Cup 2022)లో ఆమె 40 వికెట్లు పడగొట్టింది. వెస్టిండీస్‌పై జులన్‌కి కేవలం ఒక వికెట్ మాత్రమే లభించింది. అయితే ఇది ఆమె పేరు మీద రికార్డు సృష్టించేందుకు సహాయపడింది. 39 వికెట్లు తీసిన ఆస్ట్రేలియాకు చెందిన లిన్ ఫుల్‌స్టన్‌ను అధిగమించి మహిళల ప్రపంచకప్‌లో అత్యధిక వికెట్లు తీసిన భారత దిగ్గజంగా నిలిచింది. ఫుల్‌స్టన్ 20 మ్యాచ్‌ల్లో 39 వికెట్లు పడగొట్టింది. 31వ ప్రపంచకప్ మ్యాచ్‌లో ఝులన్ తన రికార్డును బద్దలు కొట్టింది.
మహిళల ప్రపంచకప్‌లో అత్యధిక వికెట్లు తీసిన లిస్టులో ఇంగ్లండ్‌కు చెందిన కరోల్ హాడ్జెస్ 37 వికెట్లతో మూడో స్థానంలో నిలిచింది. ఇంగ్లండ్‌కు చెందిన క్లేర్ టేలర్ 36 వికెట్లతో నాలుగో స్థానంలో, ఆస్ట్రేలియా కేథరిన్ ఫిట్జ్‌ప్యాట్రిక్ 33 వికెట్లతో ఐదో స్థానంలో ఉన్నారు. ఝులన్ గోస్వామికి 50కి చేరువలో వికెట్లు పడగొట్టే సువర్ణావకాశం వచ్చింది. ప్రస్తుతం 2022 ప్రపంచకప్‌లో భారత్ కనీసం నాలుగు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది.
39 ఏళ్ల ఝులన్ గోస్వామి మహిళల క్రికెట్‌లో అత్యంత విజయవంతమైన బౌలర్. వన్డే ఫార్మాట్‌లో 198 మ్యాచ్‌లు ఆడి 249 వికెట్లు తీసింది. ఈ ప్రపంచకప్‌లో ఆమె బౌలింగ్ అద్భుతంగా ఉంది. మూడు మ్యాచ్‌ల్లో నాలుగు వికెట్లు తీసింది.
ఝులన్ గోస్వామి తన చివరి ప్రపంచకప్ ఆడుతోంది. ఈ టోర్నీ తర్వాత రిటైర్ అయ్యే అవకాశం ఉంది. ఝులన్ 2002లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టింది. ప్రస్తుతం ఆమె భారత బౌలింగ్‌కు నాయకత్వం వహిస్తు్ంది.
? RECORD ALERT ?
Wicket No. 4⃣0⃣ in the WODI World Cups for @JhulanG10! ? ?
What a champion cricketer she has been for #TeamIndia ! ? ? #CWC22 | #WIvIND
Follow the match ▶️ https://t.co/ZOIa3L288d pic.twitter.com/VIfnD8CnVR
— BCCI Women (@BCCIWomen) March 12, 2022
INDW vs WIW: విండీస్ టార్గెట్ 318.. సెంచరీలతో కదం తొక్కిన టీమిండియా బ్యాటర్స్ మంధాన, కౌర్