AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RCB New Captain: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కొత్త కెప్టెన్‌ ఫిక్స్.. విరాట్ కోహ్లీ వారసుడు ఎవరంటే?

విరాట్ కోహ్లీ గత సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్సీని వదిలేసిన సంగతి తెలిసిందే. 2013 నుంచి జట్టుకు కెప్టెన్‌గా కొనసాగుతున్నాడు.

RCB New Captain: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కొత్త కెప్టెన్‌ ఫిక్స్.. విరాట్ కోహ్లీ వారసుడు ఎవరంటే?
Rcb
Venkata Chari
|

Updated on: Mar 12, 2022 | 5:22 PM

Share

Royal Challengers Bangalore New Captain: ఐపీఎల్ 2022(IPL 2022) కంటే ముందు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్‌ని ప్రకటించింది. ఆర్‌సీబీ కొత్త కెప్టెన్‌గా ఫాఫ్ డు ప్లెసిస్(Faf Du Plessis) నియమితుడయ్యాడు. విరాట్‌ కోహ్లి స్థానంలో ఈ దక్షిణాఫ్రికా ఆటగాడు చేరాడు. ఫాఫ్ డు ప్లెసిస్ ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌లో చాలా కాలంగా సభ్యుడిగా ఉన్నాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్‌గా ఐపీఎల్-2021 తన చివరి సీజన్ అని విరాట్ కోహ్లీ గతేడాది ప్రకటించాడు. 2013 నుంచి విరాట్ కోహ్లీ ఈ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. ఈ సీజన్‌లో ఆర్‌సీబీకి కెప్టెన్‌గా ఎవరు వస్తారోనని అందరూ ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు ఊహాగానాలను నిజం చేస్తూ ఆర్‌సీబీ ఈ సౌతాఫ్రికా ఆటగాడిని తమ సారథిగా ఎంచుకుంది.

Ipl 2022 Royal Challengers Bangalore, Faf Du Plessis

మెగా వేలంలో ఆర్‌సీబీ టీం డు ప్లెసిస్‌ను రూ.7 కోట్లకు దక్కించుకుంది. IPL-2022 కోసం చెన్నై అతన్ని రిటైన్ చేయలేదు. దక్షిణాఫ్రికా టీం కూడా డు ప్లెసిస్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఇలాంటి పరిస్థితుల్లో అతనే కొత్త కెప్టెన్‌ అవుతాడనే ఊహాగానాలు వినిపించాయి. డు ప్లెసిస్‌తోపాటు ఆర్‌సీబీ కొత్త కెప్టెన్ రేసులో గ్లెన్ మాక్స్‌వెల్, దినేష్ కార్తీక్ పేరు కూడా చేరాయి. కానీ, చివరకు ఈ దక్షిణాఫ్రికా ఆటగాడినే ఫైనల్ చేసింది. టైటిల్ గెలవడమే ఫాఫ్ డు ప్లెసిస్ ముందు ఉన్న అతిపెద్ద సవాలు. ఆర్‌సీబీ ఐపీఎల్‌లో మూడుసార్లు ఫైనల్స్‌కు చేరుకుంది. కానీ ఒక్కసారి కూడా టైటిల్ గెలవలేదు. కొత్త కెప్టెన్‌ అయినా టైటిల్ అందిస్తాడేమోనని ఫ్యాన్స్ ఆశపడుతున్నారు.

Also Read: