Watch Video: నో బాల్‌కు పెవిలియన్ చేరిన మయాంక్ అగర్వాల్.. రెండో ఓవర్లో హైడ్రామా.. అసలేం జరిగిందంటే?

Mayank Agarwal: అవుట్, నాటౌట్, నో బాల్ అనే గందరగోళం నెలకొంది. ఈ మొత్తం డ్రామాలో మయాంక్ అగర్వాల్ పెవిలయన్ చేరాడు.

Watch Video: నో బాల్‌కు పెవిలియన్ చేరిన మయాంక్ అగర్వాల్.. రెండో ఓవర్లో హైడ్రామా.. అసలేం జరిగిందంటే?
Ind Vs Sl Mayank Agarwal
Follow us
Venkata Chari

|

Updated on: Mar 12, 2022 | 5:36 PM

India Vs Sri Lanka Pink Ball Test: భారత్ వర్సెస్ శ్రీలంక మధ్య పింక్ బాల్ టెస్టు ప్రారంభమైంది. టాస్ గెలిచిన భారత్(Team India) బ్యాటింగ్ చేస్తోంది. భారత్ ఇన్నింగ్స్‌లో రెండో ఓవర్‌లో నాటకీయపరిణామాలు చోటు చేసుకున్నాయి. దీంతో అంతా ఆశ్చర్యపోయారు. అవుట్, నాటౌట్, నో బాల్ అనే గందరగోళంలో ప్లేయర్లు చిక్కుకపోయారు. ఈ మొత్తం డ్రామా కేవలం ఒకే ఒక బంతిపై నెలకొంది. అది కూడా నోబాల్ కావడంతో భారత బ్యాట్స్‌మెన్స్ ఊపిరిపీల్చుకున్నారు. కానీ, ఈ హై ఓల్టేజీ డ్రామాకు టీమిండియా భారీ మూల్యం చెల్లించాల్సి వచ్చింది. అసలు రెండో ఓవర్లో ఏం జరిగిందో తెలుసుకుందాం. విశ్వ ఫెర్నాండో వేసిన ఈ ఓవర్‌లోని నాలుగో బంతి బ్యాట్స్‌మెన్ మయాంక్ అగర్వాల్(Mayank Agarwal) ప్యాడ్‌కు తగిలింది. ఆపై లంక ఫీల్డర్లు గట్టిగా అప్పీల్ చేశారు. అయితే అంపైర్ మాత్రం ఈ బాల్‌ను నోబాల్‌గా ప్రకటించాడు. ఎల్బీ కోసం లంక రివ్యూ కోరింది. అయితే, ఈ బాల్ నోబాల్ కావడంతో అంపైర్ నాటౌట్‌గా ప్రకటించాడు.

నాటకీయ పరిస్థితులు..

అయితే, ఇదే బాల్‌కు టీమిండియా ఓ వికెట్‌ను కోల్పోయింది. మయాంక్ అగర్వాల్ రనౌట్‌గా పెవిలియన్ చేరాడు. నిజానికి, బంతి అతని ప్యాడ్‌కు తగిలి కొంత దూరం వెళ్లింది. మయాంక్ లెగ్ బై రన్ కోసం పరుగెత్తాడు. అయితే, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న డిక్వెల్లా అతడిని రనౌట్ చేశాడు. ఈ టైంలో పరుగు తీయడం కష్టం. ఎందుకంటే బంతి పిచ్‌కు దగ్గరలోనే ఉంది. అయితే అనవసర పరుగు కోసం సాహసంచేసిన మయాంక్.. సగం దూరం వెళ్లాడు. కానీ, పరిస్థితిని పసిగట్టిన రోహిత్‌ వెనక్కి తగ్గాడు. దీంతో మయాంక్ రనౌట్‌గా వెనుదిరగాల్సి వచ్చింది.

మయాంక్ అగర్వాల్ అవుట్ అయినప్పుడు, అతని ఖాతాలో 4 పరుగులు మాత్రమే ఉన్నాయి. భారత స్కోరు బోర్డులో 10 పరుగులు మాత్రమే చేరాయి. టెస్టు మ్యాచ్‌లో తొలిరోజు రెండో ఓవర్‌లో ఇలా ఔట్ కావడం మయాంక్‌కి నిరాశకు గురిచేసింది.

IND vs WI, WWC 2022: జులన్ గోస్వామి @ 1.. ప్రపంచకప్‌లో చరిత్ర సృష్టించిన భారత బౌలర్..

Also Read: RCB New Captain: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కొత్త కెప్టెన్‌ ఫిక్స్.. విరాట్ కోహ్లీ వారసుడు ఎవరంటే?

IND vs WI, Women’s World Cup 2022: 155 పరుగుల తేడాతో టీమిండియా ఘన విజయం.. తొలిసారి ఓడిన వెస్టిండీస్..!