- Telugu News Photo Gallery Cricket photos IPL 2022 Know all 10 teams Captains consisting of 4 Wicketkeepers and 2 foreign players of CSK, RCB, SRH, MI
IPL 2022: ఐపీఎల్ 2022లో సారథులుగా వీరే.. ఇద్దరు విదేశీయులకు దక్కిన ఛాన్స్.. 10 టీంల పూర్తి జాబితా ఇదే..
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తమ కొత్త కెప్టెన్‌ను ప్రకటించింది. విరాట్ కోహ్లీ స్థానంలో ఫాఫ్ డు ప్లెసిస్ బాధ్యతలు చేపట్టనున్నాడు. దీంతో అన్ని జట్ల సారథుల జాబితా సిద్ధమైంది.
Updated on: Mar 12, 2022 | 6:57 PM

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2022 ప్రారంభం కావడానికి కొద్ది రోజులు మాత్రమే మిగిలి ఉంది. మార్చి 26 నుంచి ఐపీఎల్ 2022 సీజన్ మొదలుకానుంది. తొలి మ్యాచులో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ టీంల మధ్య జరగనుంది. ఈసారి ఐపీఎల్‌లో పది జట్లు పాల్గొంటున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే 9 జట్లు తమ కెప్టెన్ల పేర్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా రాయల్స్ ఛాలెంజర్స్ బెంగళూరు టీం కూడా తన సారథిని ఎంచుకుంది. దీంతో ఐపీఎల్ సీజన్ 2022లో అన్ని జట్లు కెప్టెన్లు ఎవరో ఓసారి చూద్దాం.

కాగా, మొత్తం 10 టీంలలో 8 టీంలకు భారత్‌కు చెందిన ప్లేయర్లు సారథులుగా వ్యవహరించనుండగా, 2 జట్లకు మాత్రం విదేశీయులు కెప్టెన్లుగా నియమితులయ్యారు. అలాగే, ఈసారి నాలుగు జట్ల కమాండ్ వికెట్ కీపర్ల చేతుల్లో ఉంది.

ముంబై ఇండియన్స్ - రోహిత్ శర్మ

చెన్నై సూపర్ కింగ్స్ - మహేంద్ర సింగ్ ధోని (వికెట్ కీపర్)

కోల్‌కతా నైట్ రైడర్స్- శ్రేయాస్ అయ్యర్

సన్‌రైజర్స్ హైదరాబాద్- కేన్ విలియమ్సన్ (న్యూజిలాండ్)

ఢిల్లీ క్యాపిటల్స్- రిషబ్ పంత్ (వికెట్ కీపర్)

రాజస్థాన్ రాయల్స్- సంజు శాంసన్ (వికెట్ కీపర్)

గుజరాత్ టైటాన్స్- హార్దిక్ పాండ్యా

లక్నో జెయింట్స్ - కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్)

Mayank Agarwal

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు - ఫాఫ్ డు ప్లెసిస్ (దక్షిణాఫ్రికా)




