IND vs WI, Women’s World Cup 2022: 155 పరుగుల తేడాతో టీమిండియా ఘన విజయం.. తొలిసారి ఓడిన వెస్టిండీస్..!
ఐసీసీ మహిళల ప్రపంచ కప్ 2022లో భారత్ 3 మ్యాచ్‌లు ఆడి రెండో విజయాన్ని నమోదు చేసింది. అదే సమయంలో, వెస్టిండీస్ మూడు మ్యాచ్‌లలో మొదటి ఓటమిని చవిచూసింది.
ఐసీసీ మహిళల ప్రపంచ కప్ 2022(ICC Women World Cup 2022) లో వెస్టిండీస్ విజయాలకు భారత్ బ్రేక్ వేసింది. విండీస్‌పై భారత జట్టు 155 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. 3 మ్యాచ్‌ల్లో భారత్‌కు ఇది రెండో విజయం. అదే సమయంలో, వెస్టిండీస్ కూడా అదే సంఖ్యలో మ్యాచ్‌లలో తమ మొదటి ఓటమిని చవిచూసింది. భారత్ విజయంలో స్మృతి మంధాన(Smriti Mandhana) , హర్మన్‌ప్రీత్ కౌర్(Harmanpreet Kaur)ల సెంచరీలు కీలక పాత్ర పోషించాయి. వీరిద్దరి మధ్య 184 పరుగుల భాగస్వామ్యంతో భారత్‌ను విజయతీరాలకు చేర్చాయి. ప్రపంచకప్‌లో భారత్ భారీ స్కోరును తొలిసారిగా నమోదు చేసింది. ఈ స్కోర్‌ను ఛేదించడంలో వెస్టిండీస్ టీం విఫలమైంది.
తొలుత ఆడిన భారత మహిళలు 50 ఓవర్లలో 8 వికెట్లకు 317 పరుగులు చేశారు. 318 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన వెస్టిండీస్ జట్టు 162 పరుగులకు ఆలౌటైంది. ఓపెనింగ్ జోడీ మధ్య సెంచరీ భాగస్వామ్యం తర్వాత ఒక జట్టు (పురుషులు, మహిళలు) చేసిన రెండో అత్యల్ప స్కోరు ఇదే కావడం గమనార్హం. అంతకుముందు 161 పరుగులకు ఆలౌట్ అయిన రికార్డు పాకిస్థాన్ పేరిట ఉంది.
స్మృతి, హర్మాన్‌ల శతకాల బలంతో భారత్ విజయం..
భారత విజయంలో జట్టు మొత్తం కృషి చేసినప్పటికీ, స్మృతి మంధాన, హర్మన్‌ప్రీత్ కౌర్‌లదే కీలక పాత్రగా నిలిచింది. మంధాన 119 బంతుల్లో 123 పరుగులు చేసింది. కాగా, హర్మన్ 107 బంతుల్లో 109 పరుగులు చేసింది. వీరిద్దరూ కలిసి జట్టు స్కోరు బోర్డుకు 184 పరుగులు జోడించారు. అలాగే జట్టు స్కోరును 317 పరుగులకు తీసుకెళ్లడంలో సహాయపడ్డారు. ప్రపంచకప్‌లో భారత్‌కు ఇదే తొలి 300 ప్లస్ స్కోరు కావడం విశేషం.
ఓపెనర్లు 101 పరుగులు జోడించగా, మిగిలిన 9 మంది 61 పరుగులే..
వెస్టిండీస్ టీం భారీ స్కోరును ఛేదించే క్రమంలో ఓపెనర్లు డాటిన్, మాథ్యూస్ 101 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ క్రమంలో డాటిన్ కూడా హాఫ్ సెంచరీ చేసింది. కానీ, దీని తర్వాత మిగిలిన 9 మంది బ్యాట్స్‌మెన్ కేవలం 61 పరుగులకే ఔటయ్యారు. ఈ మ్యాచ్‌లో భారత్ 155 పరుగుల తేడాతో విజయం సాధించింది.
వెస్టిండీస్‌ను 162 పరుగులకు ఆలౌట్ చేయడంలో భారత బౌలర్లలో స్నేహ రాణా, మేఘనా సింగ్ కీలక పాత్ర పోషించారు. వీరిద్దరూ కలిసి 5 వికెట్లు తీశారు. స్నేహకు 3 వికెట్లు లభించగా, మేఘనకు 2 వికెట్లు దక్కాయి. వీరితోపాటు ఝులన్, రాజేశ్వరి, పూజా తలో వికెట్ తీశారు.
Also Read:
INDW vs WIW: విండీస్ టార్గెట్ 318.. సెంచరీలతో కదం తొక్కిన టీమిండియా బ్యాటర్స్ మంధాన, కౌర్
INDW vs WIW: స్మృతి మంధాన వెరీ వెరీ స్పెషల్ ఇన్నింగ్స్.. సెంచరీతో సత్తా చాటిన బ్యూటీఫుల్ ప్లేయర్