AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

INDW vs WIW: విండీస్ టార్గెట్ 318.. సెంచరీలతో కదం తొక్కిన టీమిండియా బ్యాటర్స్ మంధాన, కౌర్

ICC Womens World Cup 2022: వెస్టిండీస్‌తో జరుగుతోన్న కీలక మ్యాచులో టీమిండియా 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 317 పరుగులు సాధిచింది. దీంతో విండీస్ ముందు భారీ టార్గెట్‌ను ఉంచింది.

INDW vs WIW: విండీస్ టార్గెట్ 318.. సెంచరీలతో కదం తొక్కిన టీమిండియా బ్యాటర్స్ మంధాన, కౌర్
Indw Vs Wiw Smriti Mandhana And Harmanpreet Kaur
Venkata Chari
|

Updated on: Mar 12, 2022 | 10:14 AM

Share

ఉమెన్స్ వరల్డ్ కప్ 2022లో టీమిండియా(Team India) ప్రయాణం కష్టమనుకున్న తరుణంలో ఘనంగా తిరిగి పుంజుకుంది. తప్పక గెలవాల్సిన మ్యాచులో భారీస్కోర్‌ సాధించింది. దీంతో వెస్టిండీస్‌ ముందు భారీ లక్ష్యాన్ని ఉంచింది. టీమిండియా ఉమెన్స్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 317 పరుగులు సాధించింది. దీంతో విండీస్ ముందు 318 పరుగుల టార్గెట్‌ను ఉంచింది. స్మృతి మంధాన(Smriti Mandhana) 123, హర్మన్ ప్రీత్ కౌర్(Harmanpreet Kaur) 150 పరుగులతో సత్తా చాటారు. దీంతో టీమిండియా భారీ స్కోర్ సాధించింది. యాస్తిక భాటియా 31, కెస్టెన్ మిథాలీ రాజ్ 5, దీప్తి శర్మ 15, రిచా ఘోష్ 5, పూజా 10, గోస్వామి 2 పరుగులు చేసి మరోసారి నిరాశపరిచాడు. వెస్టిండీస్ బౌలర్లలో అనిసా మహమ్మద్ 2, షామిలియా కన్నెల్, హేలీ మాథ్యూస్, షకేరా సెల్మాన్, డియాండ్రా డాటిన్ తలో వికెట్ పడగొట్టారు.

Also Read: INDW vs WIW: స్మృతి మంధాన వెరీ వెరీ స్పెషల్ ఇన్నింగ్స్.. సెంచరీతో సత్తా చాటిన బ్యూటీఫుల్ ప్లేయర్

IND vs WI: ముందుకు సాగాలంటే గెలవాల్సిందే.. వెస్టిండీస్‌తో కీలక పోరుకు సిద్ధమైన టీమిండియా..