IND vs SL: పాపం కోహ్లీ.. మరోసారి శ్రీలంక దెబ్బకు విలవిల.. 5 ఏళ్ల తర్వాత ఆ చెత్త రికార్డులోకి..
Virat Kohli: బెంగుళూరులోని చిన్నస్వామి స్టేడియంలో విరాట్ కోహ్లీ సెంచరీల కరువును అంతం చేస్తాడని అందరూ ఎదురు చూశారు. కానీ, కోహ్లీ రెండు ఇన్నింగ్స్‌లలో కలిపి 50 పరుగులు కూడా చేయలేకపోయాడు.
విరాట్ కోహ్లీ(Virat Kohli) గత కొన్ని సంవత్సరాలుగా తన కెరీర్‌లో అత్యంత చెడ్డ దశను ఎదుర్కొంటున్నాడు. ప్రతి ఫార్మాట్‌లో ఇదే పేలవ ఫాంతో ఇబ్బంది పడుతున్నాడు. కోహ్లీ బ్యాట్‌తో భారీ స్కోర్లు రావడం లేదు. రెండున్నరేళ్లుగా 71వ శతకం(71st Century) కోసం మరికొన్నాళ్లు ఎదరుచూడక తప్పదు. శ్రీలంక(Ind vs Sl 2nd Test)తో సిరీస్‌లో ఈ రెండేళ్ల నిరీక్షణకు తెరదించుతాడని ఎదరుచూశారు. కానీ, రెండు టెస్టుల్లోనూ పేలవ ఆట తీరుతో పెవిలియన్ చేరడంతో.. 71వ సెంచరీ కోసం నిరీక్షణ అలాగే ఉంది. ఐదేళ్ల తర్వాత శ్రీలంక మరోసారి విరాట్ కోహ్లి లెక్కలను మార్చింది. ఈ సారి మాత్రం విరాట్‌కు భారీ ఎదురుదెబ్బను కొట్టింది. విరాట్ కోహ్లి టెస్టు యావరేజ్ కేవలం 7 పరుగుల తేడాతో దిగజారేలా చేసింది.
బెంగళూరులోని తన ‘సెకండ్ హోమ్ గ్రౌండ్’లో ఆడటం కూడా విరాట్ కోహ్లీకి కలిసి రాలేదు. శ్రీలంకతో జరిగిన డే-నైట్ టెస్ట్ (IND vs SL) రెండు రోజుల్లోనే విరాట్‌కు రెండుసార్లు బ్యాటింగ్ చేసే అవకాశం లభించింది. రెండు సార్లు కూడా సెంచరీ సాధించలేకపోయాడు.
5 ఏళ్ల తర్వాత సగటు 50 కంటే తక్కువ..
ఒక అర్ధ సెంచరీ కూడా చేయలేకపోయాడు. అలాగే రెండు ఇన్నింగ్స్‌లలో కలిపి మొత్తం 50 పరుగులు చేయలేకపోయాడు. దీంతో కోహ్లి టెస్ట్ కెరీర్‌లోని అద్భుతమైన గణాంకాలపై తీవ్ర ప్రభావం పడింది. బెంగళూరు టెస్టులో కోహ్లీకి 43 పరుగులు అత్యంత ముఖ్యమైనవి. కానీ, అతను రెండు ఇన్నింగ్స్‌లలో 36 పరుగులు (23, 13) మాత్రమే చేయగలిగాడు. దీనితో అతని టెస్ట్ బ్యాటింగ్ సగటు 50కి పడిపోయింది. ఒకప్పుడు 55 కంటే ఎక్కువ సగటు సాధించిన కోహ్లి ఐదేళ్ల తర్వాత తొలిసారి 50కి దిగజారాడు.
అంతకుముందు 2017 ఆగస్టులో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో కోహ్లి సగటు 50 నుంచి 49.55కి దిగజారడం కూడా యాదృచ్ఛికమే. ప్రస్తుతం కోహ్లీ సగటు 49.95గా మారింది.
భారీ ఇన్నింగ్స్‌లు ఆశిస్తున్న కోహ్లి.. తన ఇష్టమైన మైదానంలోని రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ ఊరటనివ్వలేదు. తొలి ఇన్నింగ్స్ లాగే మరోసారి అతి తక్కువ బౌన్స్ కారణంగా కోహ్లి వికెట్ కోల్పోయాడు. ధనంజయ డి సిల్వా తొలి ఇన్నింగ్స్‌లో ఎల్‌బీడబ్ల్యూగా ఔట్ చేసిన తీరు, రెండో ఇన్నింగ్స్‌లోనూ ఎడమచేతి వాటం స్పిన్నర్ ప్రవీణ్ జయవిక్రమ వేసిన షార్ట్ బాల్‌ను బ్యాక్‌ఫుట్‌లో ఆడేందుకు ప్రయత్నించి బౌన్స్‌తో ఓడి ఔటయ్యాడు. ప్రస్తుతం కోహ్లి తన సగటు 50 కంటే ఎక్కువ పెంచుకోవడానికి జూలై వరకు వేచి ఉండాలి. భారత జట్టు ఒక టెస్ట్ మ్యాచ్ కోసం ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లనుంది.
Also Read: IND vs SL: కపిల్ 40ఏళ్ల రికార్డును బ్రేక్ చేసిన రిషబ్ పంత్.. ఆ లిస్టులో అగ్రస్థానం..