Watch Video: డీఆర్ఎస్ తీసుకోమంటవా.. బ్యాటర్‌నే సలహా అడిగిన పాక్ ఆటగాళ్లు.. నవ్వులు పూయిస్తోన్న వైరల్ వీడియో

AUS vs PAK: స్మిత్‌పై డీఆర్‌ఎస్‌ను తీసుకోవాలా.. వద్దా.. అనే అయోమయంలో పాకిస్థాన్ జట్టు పడిపోయింది. దీంతో పాక్ వికెట్ కీపర్ రిజ్వాన్ ఆసీస్ ప్లేయర్‌ను సలహా అడిగిన వీడియో..

Watch Video: డీఆర్ఎస్ తీసుకోమంటవా.. బ్యాటర్‌నే సలహా అడిగిన పాక్ ఆటగాళ్లు.. నవ్వులు పూయిస్తోన్న వైరల్ వీడియో
Pak Vs Aus
Follow us

|

Updated on: Mar 13, 2022 | 6:15 PM

AUS vs PAK: ఆస్ట్రేలియా జట్టు 24 ఏళ్ల తర్వాత పాకిస్థాన్‌లో పర్యటించింది. ఈ క్రమంలో కరాచీ(Karachi) వేదికగా ఇరు జట్ల మధ్య రెండో టెస్టు మ్యాచ్ జరుగుతోంది. రావల్పిండిలో జరిగిన మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ మ్యాచ్‌లో గెలిచి మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో సత్తా చాటడమే ఇరు జట్ల ముందున్న లక్ష్యం. ఈ మ్యాచ్‌లో తొలిరోజైన శనివారం ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. నిజానికి రివ్యూ(DRS) తీసుకునే విషయంలో పాకిస్థాన్ జట్టు డైలమాలో పడింది. ఇటువంటి పరిస్థితిలో వికెట్ కీపర్ మహ్మద్ రిజ్వాన్ దీని గురించి ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్‌ను సంప్రదించడానికి ప్రయత్నించాడు. ఈ ఫన్నీ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతోంది. చాలా మంది క్రికెట్ అభిమానులు రిజ్వాన్ హాస్యాన్ని అభినందిస్తున్నారు.

ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 71వ ఓవర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆ సమయంలో 54 పరుగుల వ్యక్తిగత స్కోరుతో బ్యాటింగ్ చేస్తున్న స్మిత్‌పై DRSను ఉపయోగించడంపై ఆతిథ్య జట్టు సందేహం వ్యక్తం చేసింది.

15 సెకన్లు దాటడం చూసిన వికెట్ కీపర్ రిజ్వాన్ బ్యాట్స్‌మెన్ భుజాలపై చేయి వేసి డీఆర్‌ఎస్‌కి వెళ్లాలా వద్దా అని అడిగాడు. ఎట్టకేలకు రివ్యూ తీసుకోకూడదని పాకిస్థాన్ నిర్ణయించుకుంది. 86వ ఓవర్లో 72 పరుగులతో స్మిత్ మంచి ఇన్నింగ్స్ ఆడి పెవిలియన్‌కు చేరుకున్నాడు.

ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. రెండో రోజు ఆటముగిసే సమయానికి ఆస్ట్రేలియా 8 వికెట్ల నష్టానికి 505 పరుగులు చేయగలిగింది. ఓపెనర్లు ఉస్మాన్ ఖవాజా, డేవిడ్ వార్నర్ (36) 82 పరుగుల భాగస్వామ్యంతో ఆస్ట్రేలియాకు శుభారంభం అందించారు.

దీని తర్వాత, వార్నర్, మార్నస్ లాబుస్‌చాగ్నే (0)లను ముందుగానే ఔట్ చేయడంతో ఆస్ట్రేలియా జట్టు కష్టాల్లో పడింది. ఖవాజా, స్మిత్‌లు 159 పరుగుల మెరుపు భాగస్వామ్యాన్ని నెలకొల్పి పాకిస్థాన్ ఆశలను గల్లంతు చేశారు. 160 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడి ఖవాజా ఔటయ్యాడు. అదే స్మిత్ 72 పరుగుల సహకారం అందించాడు.అలెక్స్ కారే 93 పరుగులతో ఆకట్టుకున్నాడు.

Also Read: Faf Du Plessis: నా కెప్టెన్సీ కూడా అతని లాగా కూల్‌గా ఉంటుంది.. ఫాఫ్ డు ప్లెసిస్‌ ఆసక్తికర వ్యాఖ్యలు..

CC Womens World Cup: అగ్రస్థానం కోల్పోయిన టీమిండియా.. పాయింట్ల పట్టికలో ఏటీం ప్లేస్ ఎక్కడ ఉందంటే?

SRH vs RCB: చెల్లుకు చెల్లు.. ప్రతీకారం తీర్చుకున్న బెంగళూరు..
SRH vs RCB: చెల్లుకు చెల్లు.. ప్రతీకారం తీర్చుకున్న బెంగళూరు..
మిచెల్ మార్ష్ స్థానంలో సీమ్ బౌలర్ ఆగయా.. ఢిల్లీ భారీ స్కెచ్..
మిచెల్ మార్ష్ స్థానంలో సీమ్ బౌలర్ ఆగయా.. ఢిల్లీ భారీ స్కెచ్..
అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..
అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..
ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..
ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..