Faf Du Plessis: నా కెప్టెన్సీ కూడా అతని లాగా కూల్‌గా ఉంటుంది.. ఫాఫ్ డు ప్లెసిస్‌ ఆసక్తికర వ్యాఖ్యలు..

సుదీర్ఘ నిరీక్షణ, ఊహాగానాల తర్వాత.. మార్చి 12 శనివారం RCB వారి కొత్త కెప్టెన్‌గా ఫాఫ్ డు ప్లెసిస్‌( faf du plessis)ను నియమించిన విషయం తెలిసిందే...

Faf Du Plessis: నా కెప్టెన్సీ కూడా అతని లాగా కూల్‌గా ఉంటుంది.. ఫాఫ్ డు ప్లెసిస్‌ ఆసక్తికర వ్యాఖ్యలు..
Ipl 2022 Royal Challengers Bangalore, Faf Du Plessis
Follow us
Srinivas Chekkilla

|

Updated on: Mar 13, 2022 | 5:52 PM

సుదీర్ఘ నిరీక్షణ, ఊహాగానాల తర్వాత.. మార్చి 12 శనివారం RCB వారి కొత్త కెప్టెన్‌గా ఫాఫ్ డు ప్లెసిస్‌( faf du plessis)ను నియమించిన విషయం తెలిసిందే. వరుసగా ఎనిమిది సీజన్లలో జట్టుకు అధిపతిగా ఉన్న విరాట్ కోహ్లీ(Virat Kohli) స్థానంలో డు ప్లెసిస్ జట్టులోకి వచ్చాడు. కోహ్లీ గత సీజన్‌లో కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. దక్షిణాఫ్రికాకు నాయకత్వం వహించిన ఫాఫ్ డు ప్లెసిస్.. ఆర్సీబీ టైటిల్ నిరీక్షణకు తెర దించుతాడని ఆ జట్టు అభిమానులు చాలా ఆశలు పెట్టుకున్నారు. అలాగే అతని కెప్టెన్సీ స్టైల్ ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది. కాగా 10 ఏళ్ల పాటు ఐపీఎల్‌లో ఎంఎస్ ధోని కెప్టెన్సీలో ఆడిన డుప్లెసి, తన కెప్టెన్సీ పద్ధతి కూడా ధోనీలాగే ఉంటుందని చెప్పాడు.

వరుసగా 8 ఏళ్ల పాటు విరాట్ కోహ్లీ రూపంలో దూకుడు, ఉద్వేగభరితమైన కెప్టెన్ నాయకత్వాన్ని చూసిన RCB ఇప్పుడు భిన్నమైన కెప్టెన్సీని చూడనుంది. ఇందుకు డుప్లెసిస్ సిద్ధమయ్యాడు. గత నెలలో జరిగిన మెగా వేలంలో డు ప్లెసిస్‌ను 7 కోట్ల రూపాయల భారీ ధరకు RCB కొనుగోలు చేసింది. 37 ఏళ్ల దక్షిణాఫ్రికా మాజీ బ్యాట్స్‌మెన్ ఫాఫ్ డు ప్లెసిస్ తన నియామకం తర్వాత RCBకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కెప్టెన్సీ గురించి మాట్లాడాడు.

“క్రికెట్‌లో నా ప్రయాణంలో కొంతమంది గొప్ప కెప్టెన్‌లతో ఆడడం నా అదృష్టం. నేను సౌతాఫ్రికా అత్యుత్తమ కెప్టెన్ గ్రేమ్ స్మిత్‌తో ఆడుతూ పెరిగాను. ఆ తర్వాత MS (ధోని), స్టీఫెన్ ఫ్లెమింగ్‌లతో కలిసి 10 సంవత్సరాలు ఆడాను, ఇద్దరూ గొప్ప కెప్టెన్లు. మా ఇద్దరికీ చాలా ప్రశాంతమైన వ్యక్తిత్వం ఉన్నందున MSతో నాకు కెప్టెన్సీలో సారూప్యత ఉందని నేను భావిస్తున్నాను.” అని డు ప్లెసిస్ చెప్పాడు.

ధోనీ కెప్టెన్సీలో ఆడిన తర్వాత కెప్టెన్సీలో విభిన్న పద్ధతులు ఉంటాయని తెలిసిందని డు ప్లెసిస్ చెప్పాడు. “నాకు ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, నేను చెన్నై జట్టులో చేరినప్పుడు.. దక్షిణాఫ్రికాలో కెప్టెన్సీ సంస్కృతిని బట్టి, నేను MS ను కెప్టెన్సీ నాకు కొంచెం ఇబ్బందిగా అనిపిచింది. ఎందుకంటే అలాంటి వాతావరణం నుంచి నేను ఇక్కడకు వచ్చినప్పుడు ధోనీ భిన్నంగా కనిపించాడు. కెప్టెన్సీకి భిన్నమైన మార్గాలు ఉండవచ్చని, కానీ మీ సొంత మార్గంలో ఉండటం ముఖ్యం అని నేను మళ్లీ తెలుసుకున్నాను. ఎందుకంటే ఒత్తిడి వచ్చినప్పుడు, సొంత పద్ధతి సహాయపడుతుంది.” అని పేర్కొన్నాడు.

Read Also.. Virat Kohli: ఆర్సీబీ కెప్టెన్‌గా ఫాఫ్ డు ప్లెసిస్‌ని నియమించడంపై స్పందించిన కోహ్లీ.. సంతోషంగా ఉందంటూ వీడియో విడుదల..