AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs SL: శ్రీలంకను చిత్తు చేసిన రోహిత్ సేన.. వరుసగా 15వ సిరీస్‌ గెలిచిన టీమిండియా..

వన్డే, టీ20 తర్వాత టెస్టు క్రికెట్‌లోనూ రోహిత్ శర్మ కెప్టెన్సీ అద్భుతంగా ప్రారంభమైంది. రోహిత్ సారథ్యంలోని భారత జట్టు తొలి టెస్టు సిరీస్‌లోనే శ్రీలంకను వైట్ వాష్ చేసింది.

IND vs SL: శ్రీలంకను చిత్తు చేసిన రోహిత్ సేన.. వరుసగా 15వ సిరీస్‌ గెలిచిన టీమిండియా..
Ind Vs Sl
Venkata Chari
|

Updated on: Mar 14, 2022 | 8:11 PM

Share

వన్డే, టీ20 తర్వాత టెస్టు క్రికెట్‌లోనూ రోహిత్ శర్మ(Rohit Sharma) కెప్టెన్సీ అద్భుతంగా ప్రారంభమైంది. రోహిత్ సారథ్యంలోని భారత జట్టు(Indian Cricket Team) తొలి టెస్టు సిరీస్‌లోనే శ్రీలంక(IND vs SL)ను వైట్ వాష్ చేసింది. బెంగుళూరు టెస్ట్ మూడో రోజున, భారత్ 238 పరుగుల భారీ తేడాతో శ్రీలంకను ఓడించి 2-0తో సిరీస్‌ని కైవసం చేసుకుంది. డే-నైట్ టెస్టు మ్యాచ్‌లో రోహిత్ సేన ఘన విజయం సాధించింది. శ్రీలంక ముందు 447 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించిన భారత్.. మూడో రోజు 208 పరుగులకే ఆలౌట్ చేసింది. దీంతో టీమిండియా శ్రీలంకతో టెస్ట్ సిరీస్‌ను 2-0 తేడాతో వైట్ వాష్ చేసింది. అలాగే స్వదేశంలో వరుసగా 15వ సిరీస్‌ను భారత్ గెలుచుకుంది. అలాగే కెప్టెన్‌గా రోహిత్ శర్మ అరంగేట్రంలోనే తొలి టెస్ట్ సిరీస్‌ను గెలుచుకుంది. ఇప్పటికే తొలి వన్డే, టీ20 సిరీస్‌లను సాధించిన రోహిత్, టెస్ట్ సిరీస్‌ను గెలిచిన సారథిగా నిలిచాడు. ఇక శ్రీలంక టీంలో కెప్టెన్ దిముత్ కరుణరత్నే 107, కుసాల్ మెండిస్ 54 పరుగులతో టాప్ స్కోరర్లుగా నిలిచారు. భారత బౌలర్లలో అశ్విన్ 4, బుమ్రా 3, అక్షర్ పటేల్ 2, జడేజా 1 వికెట్ పడగొట్టారు.

రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ యాభై పరుగులకుపైగా చేసిన శ్రేయాస్ అయ్యర్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’, సిరీస్‌లో 185 పరుగులు చేసిన రిషబ్ పంత్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డు లభించింది. భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 9 వికెట్ల నష్టానికి 303 పరుగులు చేసింది. శ్రేయాస్ అయ్యర్ (67) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అదే సమయంలో రిషబ్ పంత్ 50 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. శ్రీలంక తరపున ప్రవీణ్ జయవిక్రమ 4 వికెట్లు, లసిత్ ఎంబుల్దేనియా 3 వికెట్లు తీశారు.

అంతకుముందు శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 109 పరుగులకు ఆలౌటైంది. ఏంజెలో మాథ్యూస్ (43) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. భారత్ తరపున జస్ప్రీత్ బుమ్రా 5 వికెట్లు పడగొట్టాడు. అదే సమయంలో ఆర్‌ అశ్విన్‌, మహ్మద్‌ షమీ చెరో 2 వికెట్లు తీశారు. అక్షర్ పటేల్ ఖాతాలో ఓ వికెట్ చేరింది. తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 252 పరుగులకు ఆలౌటైంది.

రెండు జట్లు-

భారత్: మయాంక్ అగర్వాల్, రోహిత్ శర్మ (కెప్టెన్), హనుమ విహారి, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్ (కీపర్), శ్రేయాస్ అయ్యర్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా

శ్రీలంక: దిముత్ కరుణరత్నే (కెప్టెన్), లహిరు తిరిమన్నె, కుసల్ మెండిస్, ఏంజెలో మాథ్యూస్, ధనంజయ డి సిల్వా, చరిత్ అస్లాంక, నిరోషన్ డిక్వెల్లా (కీపర్), సురంగ లక్మల్, లసిత్ ఎంబుల్దేనియా, విశ్వ ఫెర్నాండో, ప్రవీణ్ జయవిక్రమ.

Also Read: ICC Player of the Month: ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్‌గా భారత యంగ్ ప్లేయర్.. ప్రకటించిన ఐసీసీ

Watch Video: కోహ్లీతో సెల్ఫీ అంటే అట్లుంటది.. నలుగురిపై కేసు నమోదు.. చాలా ఖరీదైంది బ్రో అంటూ నెటిజన్ల కామెంట్లు..