AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ind Vs Pak: భారత్, పాక్ మ్యాచ్‎కు ముందు షోయబ్ అక్తర్‌ ట్వీట్.. తమ జట్టు కెప్టెన్‎కు ఏం చెప్పాడంటే..

భారత్, పాక్ మ్యాచ్ దగ్గర పడుతున్నకొద్ది అభిమానుల్లో ఉత్కంఠ పెరుగుతోంది. ఈ మ్యాచ్‎పై ఇరు దేశాల మాజీ ఆటగాళ్లు తమ జట్లకు సలహాలు, సూచనలు చేశారు. తాజాగా పాక్ మాజీ బౌలర్, రాల్పిండి ఎక్స్‎ప్రెస్ షోయబ్‌ అక్తర్‌ తమ జట్టుకు ఒక ముఖ్యమైన సలహా ఇచ్చాడు...

Ind Vs Pak: భారత్, పాక్ మ్యాచ్‎కు ముందు షోయబ్ అక్తర్‌ ట్వీట్.. తమ జట్టు కెప్టెన్‎కు ఏం చెప్పాడంటే..
Shoaib
Srinivas Chekkilla
|

Updated on: Oct 24, 2021 | 6:08 PM

Share

భారత్, పాక్ మ్యాచ్ దగ్గర పడుతున్నకొద్ది అభిమానుల్లో ఉత్కంఠ పెరుగుతోంది. ఈ మ్యాచ్‎పై ఇరు దేశాల మాజీ ఆటగాళ్లు తమ జట్లకు సలహాలు, సూచనలు చేశారు. తాజాగా పాక్ మాజీ బౌలర్, రాల్పిండి ఎక్స్‎ప్రెస్ షోయబ్‌ అక్తర్‌ తమ జట్టుకు ఒక ముఖ్యమైన సలహా ఇచ్చాడు. జట్టు సారథి బాబర్‌ అజామ్‌కు ఓ విలువైన సూచన చేశాడు. ‘‘బాబర్‌ నీకో ముఖ్య విషయం చెప్పాలి. కోహ్లీసేనతో బరిలోకి దిగినప్పుడు నువ్వు అస్సలు భయపడకూడదు, ధైర్యంగా ఆడు’’ అని ట్వీట్ చేశాడు. ధైర్యంగా అడాలని సూచించాడు. భారత్‌ -పాక్‌ మధ్య జరిగిన ప్రపంచకప్‌ మ్యాచుల్లో టీమిండియా 12-0తో ఆధిక్యంలో ఉంది.

పాకిస్తాన్ మాజీ కెప్టెన్ యూనిస్ ఖాన్ కూడా పాకిస్తాన్‎కు పలు సూచనలు చేశాడు. ఓపెనర్లు రోహిత్ శర్మ భారత్‎కు, మహ్మద్ రిజ్వాన్ పాక్‎కు “మ్యాచ్ విన్నర్లు” కాగలరని అన్నారు. “విరాట్ కోహ్లీ, బాబర్ ఆజం ఇరుజట్లకు ముఖ్యమని యూనిస్ యూట్యూబ్ ఛానెల్‌లో” అన్నారు. ఇరువైపుల పేస్ సమానంగా ఉందన్నారు. జస్ప్రిత్ బుమ్రా ‘మెన్ ఇన్ గ్రీన్’ కి కీలక ముప్పు అని పేర్కొన్నారు. “పాకిస్తాన్ ఫాస్ట్ బౌలర్లు మంచి స్థితిలో ఉన్నారు. ఇండియా పేస్ విభాగం ఇటివల కాలంలో కూడా గణనీయంగా మెరుగుపడిందని అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా బుమ్రా గత కొన్ని నెలలుగా అద్భుతంగా రాణిస్తున్నాడని చెప్పాడు. కోహ్లీ, బాబర్‎కు పోలికే లేదన్నాడు. పాకిస్తాన్ కెప్టెన్ తన అంతర్జాతీయ కెరీర్‌ను ఇంకా ప్రారంభించలేదు. బాబర్ ఇంకా చిన్నవాడని అభిప్రాయపడ్డాడు. “కోహ్లీ 2008 లో నేను ఆడుతున్నప్పుడు అరంగేట్రం చేశాడు” అని పాకిస్థాన్ మాజీ కెప్టెన్ అన్నాడు. రోహిత్ శర్మ, బుమ్రాతో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించాడు.

ఇదే మ్యాచ్‎పై భారత మాజీ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్ కూడా స్పందించారు. ఈ మ్యాచ్‎లో పాక్‎పై ఒత్తిడి ఉంటుందని చెప్పాడు. టీ20 ఫార్మట్‎లో పాక్ రాణించే అవకాశం ఉందన్నారు. టీం ఇండియా ప్రస్తుత ఫామ్ పరిగణలోకి తీసుకుంటే పాకిస్తాన్ ఇండియాకు సవాల్ విసురుతుందని నేను అనుకోను” అని మాజీ బౌలర్ అజిత్ అగర్కర్ అన్నారు. విరాట్ కోహ్లీ నేతృత్వంలోని జట్టు పాకిస్తాన్‎ను తేలికగా తీసుకొవద్దని చెప్పారు. ఈ పొట్టి ఫార్మాట్‌లో ఏదైనా జరగొచ్చని తెలిపాడు. భారత్ తప్పులు ఎక్కువ చేస్తే పాకిస్తాన్ గెలుస్తుందని ఆ జట్టు మాజీ కెప్టెన్ లతీఫ్ అన్నాడు. తాను పాకిస్థాన్‌ కెప్టెన్‌గా ఉన్నప్పుడు ప్రత్యర్థులు తప్పులు చేసేలా ప్రయత్నించేవాడినని చెప్పాడు.

Read Also.. Ind Vs Pak: భారత్, పాక్ మ్యాచ్‎పై జోమాటో, కరీమ్ పాకిస్తాన్ ట్విట్టర్ యుద్ధం.. గెలుపు ఎవరిది అంటే..