- Telugu News Photo Gallery Cricket photos IND vs PAK, T20 World Cup 2021: Team India Player Suryakumar Yadav was bowling in the nets ahead of the Pakistan match
IND vs PAK, T20 World Cup 2021: పాకిస్తాన్ కోసం కొత్త బౌలర్.. బరిలోకి దించనున్న భారత్.. అతనెవరంటే?
India vs Pakistan: దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో భారత్-పాకిస్తాన్ మ్యాచులో విరాట్ కోహ్లీ ఓ కొత్త బౌలర్‌ను రంగంలోకి దించనున్నారు!
Updated on: Oct 24, 2021 | 6:24 PM

2021 టీ20 ప్రపంచకప్‌లో భారత్-పాకిస్థాన్‌ల మధ్య హై వోల్టేజ్ మ్యాచ్ జరగనుంది. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా జరగనున్న ఈ మ్యాచ్‌కు ముందు టీమిండియా ముందు ఓ ముఖ్యమైన ప్రశ్న తలెత్తింది. ఆ ప్రశ్న ఏమిటంటే, భారత ప్లేయింగ్ XIలో 5 గురు బౌలర్లతో భారత్ బరిలోకి దిగితే, మరి ఆరో బౌలర్ ఎవరు?

టీ20 మ్యాచ్‌లలో తరచుగా ఒక బౌలర్‌కు చెడ్డ రోజు ఉంటుంది. ఆ సమయంలో ఆరో బౌలర్ పాత్ర చాలా కీలకమైనదిగా మారుతుంది. కెప్టెన్ ఆ బౌలర్‌తో మిగిలిన ఓవర్లు పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తాడు. అయితే, భారత జట్టులో ఆరో బౌలర్‌గా ఎవరు కనిపించనున్నారు.

కాగా, ఆస్ట్రేలియాతో జరుగుతున్న వార్మప్ మ్యాచ్‌లో టీమిండియా తరఫున విరాట్ కోహ్లీ 2 ఓవర్లు బౌలింగ్ చేశాడు. అయితే ప్రస్తుతం సూర్యకుమార్ యాదవ్ కూడా పాకిస్థాన్‌తో మ్యాచ్‌కు ముందు బౌలింగ్ ప్రాక్టీస్ చేస్తున్నట్లు కనిపించింది. టీమిండియా ఆరో బౌలర్‌గా విరాట్, సూర్యకుమార్‌లను ఉపయోగించుకోవచ్చని ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో టాస్ తర్వాత రోహిత్ శర్మ వెల్లడించిన విషయం తెలిసిందే. అంతేకాదు రోహిత్ కూడా బౌలింగ్ చేయగలడు.

సూర్యకుమార్ యాదవ్ తన కెరీర్‌లో పెద్దగా బౌలింగ్ చేయలేదు. కోల్‌కతా నైట్ రైడర్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ తరపున ఐపీఎల్‌లో ఆడాడు. ఈ సమయంలో సూర్య కుమార్ కేవలం ఒక ఓవర్ మాత్రమే బౌలింగ్ వేశాడు.

దేశవాళీ క్రికెట్‌లో, సూర్యకుమార్ యాదవ్ కేవలం 10 ఇన్నింగ్స్‌లలో మాత్రమే బౌలింగ్ చేశాడు. అందులో అతను 6 వికెట్లు కూడా సాధించాడు. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో సూర్యకుమార్ యాదవ్‌ను బౌలింగ్ చేయడం ఎంతవరకు సరైనది? అసలు ఆరో బౌలర్‌గా వీరిద్దరిలో ఎవరు కీలక పాత్ర పోషించనున్నారు?




