Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rohit Sharma: రోహిత్ శర్మ నువ్వు ఇంత చెత్తగా ఆడుతావనుకోలేదు.. మండిపడుతున్న నెటిజన్స్

టీ20 వరల్డ్ కప్‌లో భాగంగా పాక్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా ఓపనర్ రోహిత్ శర్మ డకౌట్ కావడం భారత క్రికెట్ అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది.

Rohit Sharma: రోహిత్ శర్మ నువ్వు ఇంత చెత్తగా ఆడుతావనుకోలేదు.. మండిపడుతున్న నెటిజన్స్
Rohit Sharma
Follow us
Janardhan Veluru

|

Updated on: Oct 24, 2021 | 8:37 PM

టీ20 వరల్డ్ కప్‌లో భాగంగా దుబాయ్ వేదికగా దాయాది దేశం పాక్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా ఓపనర్ రోహిత్ శర్మ గోల్డన్ డకౌట్ కావడం భారత క్రికెట్ అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది. షాహిన్ అఫ్రిది బౌలింగ్‌లో రోహిత్ శర్మ వికెట్ల ముందు దొరికిపోయాడు. దీంతో టీమిండియా ఒక పరుగు స్కోరు వద్ద ఒక వికెట్ కోల్పోయింది.  ఆ తర్వాత కేఎల్ రాహుల్, సూర్య కుమార్ యాదవ్ ఔట్ అవుట్ కావడంతో టీమిండియా పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే బాధ్యతలను కెప్టెన్ విరాట్ కోహ్లీ తన భుజాలపై వేసుకున్నారు. కీలకమైన మ్యాచ్‌లో రోహిత్ శర్మ డకౌట్ కావడం పట్ల సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్నారు. పాక్‌తో కీలకమైన మ్యాచ్‌లో ఇలా సిల్లీ గేమ్ ఆడుతావని అనుకోలేదని ఓ నెటిజన్  కామెంట్స్ చేస్తున్నారు.

మరిన్ని మీమ్స్‌దో రోహిత్ శర్మ ఆటతీరును ఏకిపారేస్తున్నారు. కీలకమైన మ్యాచ్‌లో డకౌట్ అయిన రోహిత్ శర్మ… కోహ్లీ స్థానంలో టీమిండియాకు సారథి కావాలని కోరుకోవడం సరికాదని కొందరు మండిపడుతున్నారు.

Also Read..

North Korea: ఉత్తర కొరియాలో ఆకలితో ప్రజలు చచ్చిపోతుంటే.. కోట్లాది రూపాయల వ్యయంతో బాలిస్టిక్ క్షిపణుల ప్రయోగంలో కిమ్!

Sarkaru Vaari Paata: మహేష్ ఫ్యాన్స్‏కు మళ్లీ నిరాశేనా.. సర్కారు వారి పాట రిలీజ్ డేట్ మారిపోయిందా ?