IND vs NZ: మిచెల్ శాంట్నర్ స్పిన్ మ్యాజిక్.. రెండో టెస్టులోనూ టీమిండియా ఓటమి.. సిరీస్ కివీస్ వశం

అంతర్జాతీయ టెస్ట్ క్రికెట్ ర్యాకింగ్స్ లో అగ్రస్థానంలో కొనసాగుతోన్న టీమిండియాకు న్యూజిలాండ్ వరుసగా రెండో షాక్ ఇచ్చింది. ఏ మాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగిన ఆ జట్టు వరుసగా రెండు మ్యాచుల్లోనూ రోహిత్ సేనను చిత్తు చేసింది. మరో మ్యాచ్ మిగిలి ఉండగానే మూడు టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ ను 2-0తో కైవసం చేసుకుంది

IND vs NZ: మిచెల్ శాంట్నర్ స్పిన్ మ్యాజిక్.. రెండో టెస్టులోనూ టీమిండియా ఓటమి.. సిరీస్ కివీస్ వశం
India Vs New Zealand
Follow us

|

Updated on: Oct 26, 2024 | 4:28 PM

టీమిండియాకు వరుసగా రెండో ఓటమి ఎదురైంది. పుణే వేదికగా న్యూజిలాండ్ తో జరుగుతోన్న రెండో టెస్ట్ మ్యాచ్ లోనూ భారత జట్టు 113 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో మరో టెస్టు మిగిలి ఉండగానే న్యూజిలాండ్ 2-0తో సిరీస్‌ కైవసం చేసుకుంది. ఓవర్ నైట్ స్కోరు 198/5తో మూడో రోజు ఆట ప్రారంభించిన న్యూజిలాండ్‌ రెండో ఇన్నింగ్స్ లో 255 పరుగులకు ఆలౌట్‌ అయింది. తద్వారా భారత్ కు 359 పరుగుల విజయ లక్ష్యాన్ని ముందుంచింది. అయితే రెండో ఇన్నింగ్స్ లోనూ భారత్ కుప్ప కూలింది. యశస్వి జైస్వాల్ (77), రవీంద్ర జడేజా (38) మినహా బ్యాటర్లెవరూ పెద్దగా పరుగులు చేయలేదు. మిచెల్ శాంట్నర్‌ మరోసారి గట్టి దెబ్బ కొట్టాడు. ఆరు వికెట్లు తీసి టీమిండియా పతనాన్ని శాసించారు. పటేల్‌ 2, గ్లెన్‌ ఫిలిప్స్‌ 1 వికెట్‌ తీశారు. అంతకు ముందు తొలి ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్‌ 259 పరుగులు చేయగా, భారత్ కేవలం‌ 156 పరుగులకు ఆలౌట్ అయ్యింది.

ఇవి కూడా చదవండి

పుణె టెస్టు ఓటమికి టీమ్ ఇండియా పేలవ బ్యాటింగ్ ప్రధాన కారణమనడంలో సందేహం లేదు. ఎందుకంటే టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 259 పరుగులకు ఆలౌటైంది. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన టీమిండియా కేవలం 156 పరుగులకే ఆలౌటైంది. తద్వారా 103 పరుగుల ఆధిక్యంతో 2వ ఇన్నింగ్స్ ప్రారంభించిన న్యూజిలాండ్ జట్టు 255 పరుగులకే ఆలౌట్ అయి భారత్‌కు 359 పరుగుల లక్ష్యాన్ని అందించింది.

బ్యాటింగ్ వైఫల్యమే ఓటమికి కారణం

అయితే లక్ష్యాన్ని ఛేదించిన టీమిండియా బ్యాటింగ్ రెండో ఇన్నింగ్స్‌లోనూ విఫలమైంది. తద్వారా రెండో ఇన్నింగ్స్‌లో జట్టు మొత్తం 245 పరుగులు మాత్రమే చేయగలిగింది. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కేవలం 8 పరుగుల వద్ద అవుట్ కాగా, విరాట్ కోహ్లీ కేవలం 17 పరుగుల వద్ద ఔటయ్యాడు. వాషింగ్టన్ సుందర్ 21 పరుగుల సహకారం అందించగా, పరుగులు తీయడానికి వెళ్లిన రిషబ్ పంత్ ఖాతా తెరవలేకపోయాడు.  రవీంద్ర జడేజా 42 పరుగులు చేసినా జట్టు ఓటమిని అడ్డుకోలేకపోయాడు.

తొలి ఇన్నింగ్స్‌లో 7 ముఖ్యమైన వికెట్లు తీసిన సాంట్నర్ రెండో ఇన్నింగ్స్‌లోనూ 6 వికెట్లు పడగొట్టాడు. ఈ విజయంతో సిరీస్‌లో 2-0 ఆధిక్యంలోకి వెళ్లిన కివీస్ భారత్‌లో తొలి టెస్టు సిరీస్‌ను కైవసం చేసుకుంది.

12 ఏళ్ల తర్వాత స్వదేశంలో సిరీస్ ఓటమి..

టీమ్ ఇండియా ప్లేయింగ్ ఎలెవన్:

రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), సర్ఫరాజ్ ఖాన్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, రవిచంద్రన్ అశ్విన్, ఆకాష్ దీప్, జస్ప్రీత్ బుమ్రా

న్యూజిలాండ్ ప్లేయింగ్ XI:

టామ్ లాథమ్ (కెప్టెన్), డెవాన్ కాన్వే, విల్ యంగ్, రచిన్ రవీంద్ర, డారిల్ మిచెల్, టామ్ బ్లండెల్ (వికెట్ కీపర్), గ్లెన్ ఫిలిప్స్, మిచెల్ సాంట్నర్, టిమ్ సౌథీ, ఐజాజ్ పటేల్, విలియం ఓ’రూర్క్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..