‘అది నా జీవితాన్నే మార్చేసింది’.. భర్తకు థ్యాంక్స్‌ చెప్పిన నయన్‌

‘అది నా జీవితాన్నే మార్చేసింది’.. భర్తకు థ్యాంక్స్‌ చెప్పిన నయన్‌

|

Updated on: Oct 27, 2024 | 9:20 PM

సినిమా ఇండస్ట్రీకి చెందిన క్యూట్‌ కపుల్స్‌లో నయనతార-విఘ్నేశ్‌ జంట ఒకటి. కొన్నేళ్ల పాటు ప్రేమలో ఉన్న ఈ జంట వివాహ బంధంతో ఒక్కటైంది. 2021లో తాము ప్రేమలో ఉన్నట్లు ప్రపంచానికి తెలిపిన ఈ జంట 2022 జూన్‌ 9న వివాహం చేసుకున్నారు. ఈ జంటకు ఉయిర్‌, ఉలమగ్‌ అనే కవలపిల్లలు ఉన్నారు. పిల్లలు, భర్తతో హ్యాపీగా ఉంది నయన్. సెలెక్టివ్‌గా సినిమాలకు చేస్తున్నా సోషల్‌ మీడియా ద్వారా మాత్రం నిత్యం టచ్‌లోనే ఉంటోంది నయన్‌.

ఎప్పటికప్పుడు తన వ్యక్తిగత విషయాలను ఫ్యాన్స్‌తో షేర్‌ చేసుకుంటోంది. ఇక ఈ క్యూట్ కపుల్‌ మధ్య ప్రేమ చిగురించనడానికి కారణమైన ఓ ప్రత్యేక సందర్భాన్ని తాజాగా ఇన్‌స్టాగ్రామ్ వేదికగా పంచుకుంది నయనతార. విఘ్నేష్‌ దర్శకత్వంలో నయనతార హీరోయిన్‌గా వచ్చిన ‘నేను రౌడినే’ సినిమా విడుదలై 9 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సినిమాకు సంబంధించిన కొన్ని వివరాలను నయనతార వెల్లడించింది. కొన్ని మూవీ స్టిల్స్‌తో కూడిన ఓ వీడియోను పోస్ట్‌ చేస్తూ ఆసక్తికరమైన క్యాప్షన్‌ రాసుకొచ్చింది. ‘ఈ సినిమా నా జీవితాన్నే మార్చేసింది. నా కెరీర్‌ను గొప్పగా మలుపుతిప్పిన సినిమా ‘నేను రౌడినే’. 9ఏళ్ల కిత్రం విడుదలై విజయాన్ని సొంతం చేసుకొని మర్చిపోలేని అనుభూతుల్ని అందించింది. ఈ విషయంలో ప్రేక్షకులకు రుణపడి ఉంటాను. ఇలాంటి గొప్ప సినిమాలో అవకాశం ఇచ్చినందుకు విఘ్నేశ్‌కు కృతజ్ఞతలు. దీని నుంచి నటిగా కొత్త అనుభవాలు నేర్చుకున్నాను. ఈ సినిమా నాకు విఘ్నేశ్‌ను ఇచ్చింది’ అని రాసుకొచ్చిందీ బ్యూటీ.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

కుళ్లిపోయిన తల్లి మృతదేహాన్ని 3 నెలలపాటు ఇంట్లోనే !!

అయ్యబాబోయ్‌.. ఇంట్లో కి వెళ్లగానే యజమానికి భారీ షాక్‌

అరకులో హాట్‌ ఎయిర్‌ బెలూన్స్‌.. 300 అడుగుల ఎత్తునుండి అందాలు వీక్షించే అవకాశం

Follow us