Sundeep Kishan: అన్నార్తుల ఆకలి తీరుస్తున్న టాలీవుడ్ హీరో..
ఆకలితో ఉన్నవారికి పట్టెడన్నం పెట్టడంలో ఉన్న తృప్తి మరెందులోనూ ఉండదు. అందుకే చాలా మంది పేదలకు అన్నదానం చేస్తుంటారు. తాజాగా టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ అన్నార్తుల ఆకలి తీరుస్తూ అన్నదాతగా మారారు. ఈ హీరో వివాహ భోజనంబు అనే రెస్టారెంట్ చైన్‌ను నడిపిస్తున్నారు. ఇందులో భాగంగా వివిధ ప్రాంతాలలో 7 రెస్టారెంట్‌లు రన్ అవుతున్నాయి.
అయితే, ప్రతి బ్రాంచీ నుంచి రోజూ ఉచితంగా 50 మందికి భోజనం పంపిస్తున్నారు. ఆకలితో ఉన్నవారికి ఇలా తన ఏడు రెస్టారెంట్స్ నుంచి ప్రతిరోజు 350 మందికి ఫ్రీగా భోజనం పెడుతున్నారు. తాజాగా సందీప్ కిషన్ ఈ విషయమై ‘ఎక్స్’ వేదికగా ఒక పోస్టు పెట్టారు. తన టీమ్ పేదలకు భోజనం పంచుతున్న ఫొటోలను ఈ పోస్ట్ ద్వారా హీరో పంచుకున్నారు. “వివాహ భోజనంబు టీమ్ చేస్తున్న పనికి నేను గర్వపడుతున్నాను. మీలో ఎవరైనా భోజనం కోసం కష్టపడితే మీ సమీపంలోని వివాహ భోజనంబు రెస్టారెంట్‌కి నేరుగా వెళ్లి ఫుడ్ ప్యాకెట్‌ను ఉచితంగా తీసుకోండి” అని ట్వీట్ చేశారు. దీంతో ఈ ట్వీట్ వైరల్ కాగా, నెటిజన్లు ఆయనపై ప్రశంసలు కురిపిస్తున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
‘అది నా జీవితాన్నే మార్చేసింది’.. భర్తకు థ్యాంక్స్ చెప్పిన నయన్
కుళ్లిపోయిన తల్లి మృతదేహాన్ని 3 నెలలపాటు ఇంట్లోనే !!
అయ్యబాబోయ్.. ఇంట్లో కి వెళ్లగానే యజమానికి భారీ షాక్
అరకులో హాట్ ఎయిర్ బెలూన్స్.. 300 అడుగుల ఎత్తునుండి అందాలు వీక్షించే అవకాశం
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

