‘ఠాగూర్’ మూవీపై ప్రముఖ డాక్టర్ షాకింగ్ కామెంట్స్
మెగాస్టార్ చిరంజీవి సినిమాల్లో 'ఠాగూర్' ఓ క్లాసిక్. మరీ ముఖ్యంగా ఇందులో హాస్పిటల్ సీన్‌కి అయితే సెపరేట్ ఫ్యాన్స్ ఉన్నారని చెప్పొచ్చు. కానీ ఇదే సన్నివేశం వల్ల డాక్టర్ల బతుకులు సర్వనాశనం అయిపోయాయని ప్రముఖ డాక్టర్ గురవారెడ్డి అంటున్నారు. డాక్టర్లని ఆ సన్నివేశంలో అత్యంత దారుణంగా చూపించారని విమర్శలు చేస్తున్నారు. తాజాగా ఓ పాడ్ కాస్ట్‌లో మాట్లాడుతూ ఇలా తన అభిప్రాయాన్ని చెప్పారు.
ఆ సీన్ ఎవరు రాశారో తెలీదు గానీ వైద్య వృత్తికి చాలా నష్టం చేకూర్చారనీ అదో వరస్ట్ సీన్ అన్నారు. అది చూసిన ఎవరైనా సరే పేషెంట్స్‌ని డబ్బుల కోసమే డాక్టర్లు ఐసీయూలోకి తీసుకెళ్తారని అనుకుంటారనీ పొరపాటున పేషెంట్ చనిపోతే, దానికి తాము కారణం కాదని వైద్యులు నిరూపించుకోవాల్సిన పరిస్థితి అన్నారు. చిరంజీవి తనకు క్లోజ్ ఫ్రెండ్ అనీ ఆయనతో చాలాసార్లు కలిసి భోజనం కూడా చేశామని తెలిపారు. ఓ సందర్భంగా ‘ఠాగూర్’ సీన్ డాక్టర్లకి మనశ్శాంతి లేకుండా చేసిందని చెప్పారట. అయితే అది ఇంకా దారుణంగా ఉందట అన్నారు. చిరంజీవి దాన్ని కాస్త మార్పు చేశారని డాక్టర్ గురవారెడ్డి చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈయన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Sundeep Kishan: అన్నార్తుల ఆకలి తీరుస్తున్న టాలీవుడ్ హీరో..
‘అది నా జీవితాన్నే మార్చేసింది’.. భర్తకు థ్యాంక్స్ చెప్పిన నయన్
కుళ్లిపోయిన తల్లి మృతదేహాన్ని 3 నెలలపాటు ఇంట్లోనే !!
అయ్యబాబోయ్.. ఇంట్లో కి వెళ్లగానే యజమానికి భారీ షాక్
అరకులో హాట్ ఎయిర్ బెలూన్స్.. 300 అడుగుల ఎత్తునుండి అందాలు వీక్షించే అవకాశం
అర్థరాత్రి రైడ్‌తో వణుకు పుట్టించిన మహిళా ఎమ్మెల్యే
గుర్రంపై బ్లింకిట్ డెలివరీ.. ఇదెక్కడి మాస్ రా మావా..
వీడు కన్నేసాడంటే.. గురి తప్పడు.. చిటికెలో పగలకొట్టేస్తాడు
ఫేస్ చూసి అమాయకుడనుకునేరు.. అసలు విషయం తెలిస్తే..
పునర్వికకు క్రౌడ్ ఫండింగ్ ద్వారా పునర్జన్మ
గురుకులంలో క్షుద్రపూజలు.. రోడ్డెక్కిన విద్యార్థినులు..
ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.. తెల్లారే సరికి పోలీస్ స్టేషన్ లో

