India vs New Zealand 3rd T20: మూడో టీ20లో చెలరేగిన గిల్.. భారీ స్కోర్ సాధించిన టీంఇండియా
అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో న్యూజిలాండ్‌తో జరుగుతున్న టీ20 మ్యాచ్‌లో యంగ్ బ్యాట్‌మెన్ శుభ్‌మన్ గిల్ చెలరేగిపోయాడు. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో మెదటి రెండు మ్యాచ్‌లలో గిల్..
అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో న్యూజిలాండ్‌తో జరుగుతున్న టీ20 మ్యాచ్‌లో యంగ్ బ్యాట్‌మెన్ శుభ్‌మన్ గిల్ చెలరేగిపోయాడు. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో మెదటి రెండు మ్యాచ్‌లలో గిల్ పేలవమైన ప్రదర్శన కనబరిచాడు. ఐతే సిరీస్ చివరి రోజున (బుధవారం) గిల్ పరుగుల వర్షం కురిపించాడు. తొలి 54 బంతుల్లో 10 ఫోర్లు, 7 సిక్సర్లతో గిల్ తొలి సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మొత్తంగా 63 బంతుల్లో 12 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 126 పరుగులు తీసి భారత్ స్కోర్‌ను అమాంతం పైకి తీసుకెళ్లాడు. మరోవైపు.. రాహుల్ త్రిపాఠీ 22 బంతుల్లో 44 రన్స్ బాదాడు. చివర్లో హార్దిక్ పాండ్యా మెరుపులు మెరిపించి 34 పరుగులు చేశాడు. మొత్తంగా 235 పరుగుల టార్గెట్‌ను న్యూజిలాండ్ ముందు భారత్ ఉంచింది.
కాగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న మూడో టీ-20లో టీంఇండియా 20 ఓవర్లలో 4 వికెట్లు కొల్పోయింది. మొత్తంగా 235 పరుగులు సాధించి ప్రత్యర్థి ముందు భారీ లక్ష్యాన్ని ఉంచింది. టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న భారత్‌కు రెండో ఓవర్‌లోనే ఎదురుదెబ్బ తగిలింది. ఇషాన్ కిషన్ కేవలం ఒక్క రన్‌కే ఔటయ్యాడు. అయితే మరో ఓపెనర్ శుభ్‌మన్ గిల్ అద్భుతమైన సెంచరీతో చెలరేగిపోయాడు.
??????? ??? ??????? ???? ??
A brilliant innings from #TeamIndia opener as he brings up a fine ? off 54 deliveries.#INDvNZ pic.twitter.com/4NjIfKg7e1
— BCCI (@BCCI) February 1, 2023
Into the night sky & out of the park ??@ShubmanGill is dealing in sixes ?#TeamIndia | #INDvNZ | @mastercardindia pic.twitter.com/OuMivnJXRw
— BCCI (@BCCI) February 1, 2023
మరిన్ని తాజా క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి.