IND vs ENG: భారత్‌తో నాలుగు టెస్ట్.. తుది జట్టును ప్రకటించిన ఇంగ్లండ్.. డేంజరస్ ప్లేయర్ వచ్చేశాడుగా..
భారత్‌తో ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను విజయంతో ప్రారంభించిన ఇంగ్లండ్ క్రికెట్ జట్టు.. ఇప్పుడు సిరీస్‌ను కాపాడుకునే స్థితికి చేరుకుంది. వరుసగా 2 టెస్టు మ్యాచ్‌ల్లో ఇంగ్లండ్ జట్టు ఓటమిని చవిచూసింది. దీంతో బెన్ స్టోక్స్ సారథ్యంలోని ఇంగ్లిష్ జట్టు సిరీస్‌లో నిలవాలంటే రాంచీలో జరిగే నాలుగో టెస్టులో తప్పక గెలవాలి.

భారత్‌తో ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను విజయంతో ప్రారంభించిన ఇంగ్లండ్ క్రికెట్ జట్టు.. ఇప్పుడు సిరీస్‌ను కాపాడుకునే స్థితికి చేరుకుంది. వరుసగా 2 టెస్టు మ్యాచ్‌ల్లో ఓటమిని చవిచూసింది. దీంతో బెన్ స్టోక్స్ సారథ్యంలోని ఇంగ్లిష్ జట్టు సిరీస్‌లో నిలవాలంటే రాంచీలో జరిగే నాలుగో టెస్టులో తప్పక గెలవాలి. ఫిబ్రవరి 23 శుక్రవారం నుంచి ప్రారంభమయ్యే ఈ టెస్ట్ మ్యాచ్ కోసం ఇంగ్లండ్ ప్లేయింగ్ ఎలెవన్‌ని ప్రకటించింది. తుది జట్టులో రెండు ప్రధాన మార్పులు చేసింది. భారత్‌తో ఆడిన 4 మ్యాచ్‌ల్లో 21 వికెట్లు తీసిన ఓలీ రాబిన్ సన్ ను బరిలోకి దింపింది. వరుసగా నాలుగో టెస్టు మ్యాచ్‌కి, ఇంగ్లండ్ తన బ్యాటింగ్‌లో ఎలాంటి మార్పులు చేయలేదు కానీ బౌలింగ్‌లో రొటేషన్‌ను కొనసాగించింది. ఈ సిరీస్‌లో తొలి మ్యాచ్‌కు దూరమైన 41 ఏళ్ల వెటరన్ ఫాస్ట్ బౌలర్ జేమ్స్ ఆండర్సన్ వరుసగా మూడో మ్యాచ్‌కు రంగంలోకి దిగనున్నాడు. ఈసారి అతనికి విశ్రాంతి ఇవ్వబడుతుందని భావించారు. అయితే జట్టులోని ఇతర ఫాస్ట్ బౌలర్లు కూడా అంతంత మాత్రమే రాణిస్తుండడంతో అండర్సన్‌ను తప్పక కొనసాగించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఇప్పుడు, పేస్ బౌలింగ్ విభాగంలో అండర్సన్‌కు అండగా నిలిచేందుకు ఇంగ్లాండ్ చివరి ప్రయత్నంగా మీడియం పేసర్ ఆలీ రాబిన్సన్‌ను ప్లేయింగ్ ఎలెవన్‌లో చేర్చుకుంది. రైట్ ఆర్మ్ పేసర్ రాబిన్సన్ ఈ సిరీస్‌లో ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు.అయితే నాలుగో టెస్టులో అతను బరిలోకి దిగనున్నాడు. ఫాస్ట్ బౌలర్ మార్క్ వుడ్ స్థానంలో అతడిని చేర్చారు. 30 ఏళ్ల రాబిన్సన్ గత 7 నెలలుగా ఎలాంటి టెస్టు ఆడలేదు. జూలై 2023లో ఆస్ట్రేలియాతో జరిగిన యాషెస్ సిరీస్‌లో ఆఖరి టెస్ట్ ఆడాడు. అయితే ఈ బౌలర్ భారత్‌తో ఆడిన 4 టెస్టుల్లో 21 వికెట్లు పడగొట్టాడు. దీంతో చివరి అస్త్రంగా భారత్ ను దెబ్బ కొట్టేందుకు రాబిన్ సన్ ను బరిలోకి దింపింది ఇంగ్లండ్. అయితే రాబిన్ సన్ తీసిన వికెట్లన్నీ ఇంగ్లండ్ గడ్డమీద వచ్చినవే. మరి భారత్ పిచ్ లపై రాబిన్ సన్ ఏ మేర రాణిస్తాడో చూడాలి.
రాబిన్సన్ మాత్రమే కాదు, ప్లేయింగ్ ఎలెవన్ లో మరో ఆటగాడు చోటు దక్కించుకున్నాడు. లెగ్ స్పిన్నర్ రెహాన్ అహ్మద్ స్థానంలో ఆఫ్ స్పిన్నర్ షోయబ్ బషీర్ మరోసారి అవకాశం దక్కించుకున్నాడు. బషీర్ విశాఖపట్నం టెస్టులో అరంగేట్రం చేసినప్పటికీ రాజ్‌కోట్ మ్యాచ్ కు దూరమయ్యాడు. ఇప్పుడు మళ్లీ తిరిగొచ్చాడు. బషీర్ తన అరంగేట్రం టెస్టులోనే కెప్టెన్ రోహిత్ శర్మతో సహా 4 వికెట్లు పడగొట్టాడు. కాగా, సిరీస్‌లోని మూడు టెస్టులు ఆడిన యువ స్పిన్నర్ రెహాన్ 6 ఇన్నింగ్స్‌లలో 11 వికెట్లు మాత్రమే తీసుకున్నాడు.
We have named our XI for the fourth Test in Ranchi! 🏏 👇
🇮🇳 #INDvENG 🏴 #EnglandCricket
— England Cricket (@englandcricket) February 22, 2024
ఇంగ్లండ్ ప్లేయింగ్ -XI ఇదే..
బెన్ స్టోక్స్ (కెప్టెన్), జాక్ క్రాలీ, బెన్ డకెట్, ఆలీ పోప్, జో రూట్, జానీ బెయిర్‌స్టో, బెన్ ఫోక్స్ (వికెట్ కీపర్), టామ్ హార్ట్లీ, ఆలీ రాబిన్సన్, జేమ్స్ ఆండర్సన్, షోయబ్ బషీర్.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








