IND vs ENG: వరుణుడు వెంటాడుతోన్నా తగ్గేదేలే అంటోన్న టీమిండియా.. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ స్కోరెంతంటే..
India Vs England: ఎడ్జ్‌బాస్టన్ వేదికగా భారత్, ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న ఐదో రీషెడ్యూల్ టెస్ట్‌ను వరుణుడు వెంటాడుతున్నాడు. దీంతో రెండో రోజూ కూడా ఆటపూర్తిగా సాగలేదు. అయితే వరుణుడు వెంటాడుతోన్నా టీమిండియా అదరగొడుతోంది

India Vs England: ఎడ్జ్‌బాస్టన్ వేదికగా భారత్, ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న ఐదో రీషెడ్యూల్ టెస్ట్‌ను వరుణుడు వెంటాడుతున్నాడు. దీంతో రెండో రోజూ కూడా ఆటపూర్తిగా సాగలేదు. అయితే వరుణుడు వెంటాడుతోన్నా టీమిండియా అదరగొడుతోంది. తొలి రోజు ఆటలో కేవలం 98 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన భారత జట్టు.. ఘనంగా పునరాగమనం చేసింది. రిషభ్ పంత్, జడేజాల సెంచరీలకు తోడు బుమ్రా బూమ్ బూమ్ ఇన్నింగ్స్ చలవతో మొదటి ఇన్నింగ్స్ లో 416 పరుగులకు ఆలౌటైంది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ శనివారం ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో 84/5తో నిలిచింది. క్రీజులో బెన్ స్టోక్స్ (0), జానీ బెయిర్‌స్టో (12) ఉన్నారు. ఇంగ్లాండ్ ఇంకా 332 పరుగులు వెనకబడి ఉంది. మొదట కెప్టెన్ బుమ్రా ఓపెనర్లు అలెక్స్ లీస్ (6), జాక్ క్రాలే (9)తో పాటు వన్‌డౌన్ బ్యాట్స్‌మన్ ఓలీపోప్ (10)ను ఔట్ చేసి ఇంగ్లండ్ నడ్డి విరిచాడు. ఆ తర్వాత జోరూట్ (31)ను మహ్మద్ సిరాజ్ బోల్తాకొట్టించగా.. జాక్‌లీచ్(0)ను మహ్మద్ షమి ఔట్ చేశాడు.
అంతకుముందు 338/7 ఓవర్‌నైట్ స్కోర్‌తో శనివారం రెండోరోజు ఆరంభించిన జడేజా, షమి ఎనిమిదో వికెట్‌కు 48 పరుగులు జోడించాడు. ఈ క్రమంలోనే జడేజా (104; 194 బంతుల్లో 13 ఫోర్లు) టెస్టుల్లో మూడో శతకం సాధించాడు. చివర్లో బుమ్రా (31 నాటౌట్; 16 బంతుల్లో 4×4, 2×6) మెరుపు బ్యాటింగ్ చేయడంతో టీమిండియా భారీస్కోరు సాధించింది.




That’s Stumps on Day 2 of the #ENGvIND Edgbaston Test! #TeamIndia put on a fantastic show with the ball, scalping 5 England wickets, after posting 416 on the board. ? ?
We will be back for Day 3 action tomorrow.
Scorecard ▶️ https://t.co/xOyMtKrYxM pic.twitter.com/Q2kLIFR7O0
— BCCI (@BCCI) July 2, 2022
మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి..