Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs BAN Playing XI: షాకిచ్చిన రోహిత్.. పంత్‌కు దక్కని చోటు.. ప్లేయింగ్ 11లో కీలక మార్పు..

ICC T20 world cup India vs Bangladesh Playing XI: సెమీస్‌కు దారిచూసే కీలక మ్యాచ్‌లో బంగ్లాదేశ్ టీం టాస్ గెలిచింది. దీంతో తొలుత టీమిండియా బ్యాటింగ్ చేయనుంది.

IND vs BAN Playing XI: షాకిచ్చిన రోహిత్.. పంత్‌కు దక్కని చోటు.. ప్లేయింగ్ 11లో కీలక మార్పు..
Ind Vs Ban Playing 11
Follow us
Venkata Chari

|

Updated on: Nov 02, 2022 | 1:30 PM

టీ20 వరల్డ్‌లో అత్యంత కీలకమైన మ్యాచ్‌లో బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబ్ అల్ హసన్ టాస్ గెలిచి టీమ్ ఇండియాను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. ఈ ప్రపంచకప్‌లో రోహిత్ శర్మ తొలిసారి టాస్ ఓడిపోయాడు. రెండు జట్లూ ప్లేయింగ్ 11లో ఒక మార్పు చేశాయి. టీమిండియాలో దీపక్ హుడా స్థానంలో అక్షర్ పటేల్‌ చేరగా, ఇక బంగ్ల జట్టులో సౌమ్య సర్కార్ స్థానంలో  షరీఫుల్ ఇస్లాంను ఎంపిక చేశాయి. అయితే, అంతా ఊహించినట్లు దీనేష్ కార్తీక్ ప్లేస్‌లో రిషబ్ పంత్ జట్టులోకి వస్తాడనుకున్నా.. టీమిండియా మాత్రం.. కార్తీక్ పైనే నమ్మకం ఉంచింది. దీంతో పంత్‌కు మరోసారి మొండిచేయే మిగిలింది.

ప్రస్తుతం భారత జట్టు గ్రూప్-2లో 3 మ్యాచ్‌ల్లో రెండు విజయాలు, ఒక ఓటమితో 4 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. అదే సమయంలో బంగ్లాదేశ్ జట్టు కూడా అదే సంఖ్యలో మ్యాచ్‌లు ఆడి 4 పాయింట్లతో మూడవ స్థానంలో ఉంది. మెరుగైన నెట్ రేట్ కారణంగా భారత్ ప్రస్తుతం బంగ్లాదేశ్ కంటే ముందుంది.

ఈ మ్యాచ్‌లో విజయం సాధిస్తే భారత్‌ సెమీఫైనల్‌కు చేరుకోవడం సులువవుతుంది. అదే సమయంలో బంగ్లాదేశ్ ఓడిపోతే ఈ టోర్నీ నుంచి దాదాపు ఔట్ అవుతుంది. ఈ మ్యాచ్ తర్వాత బంగ్లాదేశ్ చివరి మ్యాచ్ పాకిస్థాన్‌తో జరగనుండగా, భారత్ జింబాబ్వేతో ఆడాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి

ఒకవేళ బంగ్లాదేశ్‌తో భారత జట్టు ఓడిపోతే.. దాని సెమీస్ దారి కష్టమే. ఈ పరిస్థితిలో చివరి మ్యాచ్‌లో జింబాబ్వేపై గెలిచినప్పటికీ, భారత్ గరిష్టంగా 6 పాయింట్లను మాత్రమే కలిగి ఉంటుంది. అటువంటి పరిస్థితిలో, పాకిస్తాన్ తన చివరి రెండు మ్యాచ్‌లు గెలిస్తే, అది కూడా 6 పాయింట్లను పొందుతుంది. అప్పుడు మెరుగైన నెట్ రన్ రేట్ ఉన్న జట్టు లాభపడుతుంది.

ఒకవేళ భారత్ ఓడిపోతే బంగ్లాదేశ్‌కు కూడా అవకాశాలు గణనీయంగా పెరుగుతాయి. భారత్ తర్వాత పాకిస్థాన్‌ను ఓడిస్తే పాయింట్ల పట్టికలో 8 పాయింట్లతో ఉంటుంది. ఈ సమీకరణాలను చూస్తుంటే భారత్‌కు బంగ్లాదేశ్‌తో మ్యాచ్ ఒక విధంగా నాకౌట్ అని చెప్పవచ్చు. ఒకవేళ ఓటమి ఎదురైతే, భారత్‌కు మార్గం చాలా పరిమితం కావచ్చు.

భారత ప్లేయింగ్ XI:

కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ(కెప్టెన్), విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, దినేష్ కార్తీక్(కీపర్), అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, భువనేశ్వర్ కుమార్, మహమ్మద్ షమీ, అర్ష్దీప్ సింగ్

బంగ్లాదేశ్ ప్లేయింగ్ XI:

నజ్ముల్ హొస్సేన్ శాంటో, లిట్టన్ దాస్, షకీబ్ అల్ హసన్(కెప్టెన్), అఫీఫ్ హుస్సేన్, యాసిర్ అలీ, మొసద్దెక్ హొస్సేన్, షోరిఫుల్ ఇస్లాం, నూరుల్ హసన్(కీపర్), ముస్తాఫిజుర్ రెహ్మాన్, హసన్ మహమూద్, తస్కిన్ అహ్మద్