IND vs AUS: ఎన్నాళ్లకెన్నాళ్లకు.. 14 నెలల తర్వాత హాఫ్ సెంచరీతో మెరిసిన విరాట్.. దెబ్బకు ఆ రికార్డులు బద్దలు
టీ20ల్లో మెరిశాడు.. సెంచరీలు చేశాడు.. వన్డేల్లోనూ జోరు కొనసాగిస్తున్నాడు.. కానీ టెస్టుల్లో మాత్రం ఫామ్‌ను అందిపుచ్చుకోలేకపోయాడు కోహ్లీ. సుమారు 14 నెలలగా అతని బ్యాట్ నుంచి కనీసం అర్ధసెంచరీ కూడా జాలువారలేదు. దీంతో తమ రన్ మెషిన్ ఎప్పుడెప్పుడు ఫామ్‌లో కొస్తాడా? అని ఎదురుచూస్తున్నాడు
టీ20ల్లో మెరిశాడు.. సెంచరీలు చేశాడు.. వన్డేల్లోనూ జోరు కొనసాగిస్తున్నాడు.. కానీ టెస్టుల్లో మాత్రం ఫామ్‌ను అందిపుచ్చుకోలేకపోయాడు కోహ్లీ. సుమారు 14 నెలలగా అతని బ్యాట్ నుంచి కనీసం అర్ధసెంచరీ కూడా జాలువారలేదు. దీంతో తమ రన్ మెషిన్ ఎప్పుడెప్పుడు ఫామ్‌లో కొస్తాడా? అని ఎదురుచూస్తున్నాడు. ఇప్పుడీ నిరీక్షణకు తెరపడింది. సుమారు 14 నెలలు.. 15 ఇన్నింగ్స్‌ల తర్వాత అర్ధసెంచరీతో మెరిశాడు విరాట్ కోహ్లీ. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్టు మూడో రోజు హాఫ్ సెంచరీ సాధించాడు కోహ్లీ. టెస్టులో అతనికిది 29వ అర్ధసెంచరీ. అంతేకాదు ఈ మ్యాచ్ ద్వారా స్వదేశంలో టెస్టుల్లో 4వేల పరుగుల మైలురాయిని అధిగమించాడు. కాగా 2022 జనవరిలో దక్షణిఫ్రికా పర్యటనలో భాగంగా కేప్‌టౌన్ చివరి సారిగా కోహ్లి టెస్టుల్లో 50 పరుగుల మార్కు అందుకున్నాడు. ఆ మ్యాచ్‌లో 201 బంతులు ఎదుర్కొని 12 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 79 పరుగులు చేశాడు. ఆతర్వాత 29, 45, 23, 13, 11, 20, 1, 19 నాటౌట్, 24, 1, 12, 44, 20, 22, 13.. ఇలా సాగాయి కోహ్లీ స్కోర్లు.
ఇలా వరుసగా 15 ఇన్నింగ్స్‌ల పాటు ఒక్క ఫిఫ్టీ కూడా కొట్టలేకపోయాడు. ఇక బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా తొలి మూడు టెస్టుల్లోనూ పెద్దగా పరుగులు సాధించలేకపోయాడు. అయితే నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో మాత్రం తన పరుగుల దాహాన్ని తీర్చుకున్నాడు. మొత్తం 128 బంతులు ఎదుర్కొని 5 ఫోర్ల సహాయంతో 59 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. కాగా ఈ మ్యాచ్లో టీమిండియా ఆధిపత్యం కొనసాగాలంటే నాలుగో రోజు కోహ్లీ మరిన్ని పరుగులు సాధించాల్సి ఉంది. కాగా అర్ధసెంచరీ పూర్తయ్యాక కోహ్లీ ముఖంపై చిరునవ్వు స్పష్టంగా కనిపించింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ‘ఎన్నాళ్లకెన్నాళ్లకు.. నీ ముఖంపై ఇలాంటి చిరునవ్వు చూసి.. దటీజ్ కింగ్ కోహ్లీ’ అంటూ ఫ్యాన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక ఆసీస్ 480 పరుగుల భారీ స్కోరుకు దీటుగా బదులిస్తోంది టీమిండియా. కోహ్లీతో పాటు శుభ్‌మన్ గిల్ సెంచరీతో చెలరేగడంతో మూడోరోజు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో 3 వికెట్ల నష్టానికి 289 పరుగులు చేసింది టీమిండియా. ఇంకా ఆసీస్ కంటే 191 పరుగుల వెనకబడి ఉంది. ప్రస్తుతం కోహ్లి 59, రవీంద్ర జడేజా 16 పరుగులతో క్రీజులో ఉన్నారు.
Virat Kohli against the Aussies is always fun ?pic.twitter.com/Fw4CnPz6XS
— Virat Kohli Fan Club (@Trend_VKohli) March 11, 2023
మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..