AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

30 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్సులు.. 230పైగా స్ట్రైక్‌రేట్‌.. హ్యాట్రిక్‌తో హాప్ సెంచరీ ఇన్నింగ్స్.. ఫలితం శూన్యమాయే..

Ind vs Aus: హార్దిక్ పాండ్యా ఆస్ట్రేలియాపై హాఫ్ సెంచరీ చేశాడు. ఇది T20 ఇంటర్నేషనల్స్‌లో అతని రెండవ అర్ధ సెంచరీ మాత్రమే. రెండు నెలల క్రితం ఇంగ్లండ్‌పై తొలి అర్ధశతకం సాధించాడు.

30 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్సులు.. 230పైగా స్ట్రైక్‌రేట్‌.. హ్యాట్రిక్‌తో హాప్ సెంచరీ ఇన్నింగ్స్.. ఫలితం శూన్యమాయే..
Hardik Pandya
Venkata Chari
|

Updated on: Sep 21, 2022 | 9:10 AM

Share

Hardik Pandya: మొహాలీలోని పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ ఐఎస్ బింద్రా స్టేడియం వేదికగా జరిగిన మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 4 వికెట్ల తేడాతో భారత్‌పై విజయం సాధించింది. మొహాలీ వేదికగా జరిగిన ఈ ఉత్కంఠ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 209 పరుగుల భారీ లక్ష్యాన్ని 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఆస్ట్రేలియా తరపున క్యామ్‌రూమ్ గ్రీన్ తుఫాను ఇన్నింగ్స్ ఆడాడు. 30 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్సర్ల సహాయంతో 61 పరుగులతో హాఫ్ సెంచరీ చేశాడు. అదే సమయంలో మ్యాచ్ ముగిసే సమయానికి మాథ్యూ వేడ్ 21 బంతుల్లో 6 ఫోర్లు, 2 ఫోర్ల సాయంతో 45 పరుగులతో తుఫాను ఇన్నింగ్స్ ఆడి ఈ లక్ష్యాన్ని చేధించారు. అయితే, ఈ మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యా తన మార్క్ చూపించి, ఆకట్టుకున్నాడు.

వచ్చే నెలలో ఆస్ట్రేలియాలో జరగనున్న T20 ప్రపంచకప్‌లో భారత జట్టు తరపున ఎవరైనా అత్యంత ముఖ్యమైన ఆటగాడిగా నిరూపించుకోగలిగితే, అది కేవలం స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా అయ్యే అవకాశం ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు. వెటరన్ ఆల్ రౌండర్ గత కొన్ని నెలల్లో కోల్పోయిన ఫిట్‌నెస్, ఫామ్‌ను తిరిగి పొందాడు. అది అతని ప్రదర్శనలో నిత్యం కనిపిస్తూనే ఉంది. అతను ఆసియా కప్‌లో పూర్తి ఫాంలో లేకపోయినా.. ఆస్ట్రేలియాపై మాత్రం హార్దిక్ తుఫాను బ్యాటింగ్ చేసి టీమ్ ఇండియాను 200 పరుగులు దాటించాడు.

మొహాలీలో జరుగుతున్న టీ20 సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్‌లో టీమిండియా ముందుగా బ్యాటింగ్ చేయాల్సి వచ్చింది. టీమ్ కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ ప్రత్యేకంగా ఏమీ చేయలేకపోయారు. కానీ కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి టీమ్ ఇండియాకు భారీ స్కోరుకు మంచి పునాది వేశారు.

ఇవి కూడా చదవండి

హార్దిక్‌ తుఫాన్స్ ఇన్నింగ్స్..

12వ ఓవర్లో రాహుల్ ఔటయ్యాక.. క్రీజులోకి వచ్చిన హార్దిక్ ఏమాత్రం సమయం తీసుకోకుండా పరుగులు చేయడం ప్రారంభించాడు. సూర్యకుమార్, అక్షర్ పటేల్, దినేష్ కార్తీక్ కూడా త్వరగానే పెవిలియన్ చేరారు. ఓ ఎండ్ నుంచి వరుసగా వికెట్లు పడుతున్నా.. మరో ఎండ్ నుంచి హార్దిక్‌ మాత్రం తన తుఫాన్ బ్యాటింగ్‌ను కొనసాగించి కేవలం 25 బంతుల్లోనే తన యాభైని పూర్తి చేశాడు.

హార్దిక్ టీ20 అంతర్జాతీయ కెరీర్‌లో ఇది రెండో అర్ధ సెంచరీ మాత్రమే. ఈ ఏడాది జులైలో ఇంగ్లండ్‌పై తొలి అర్ధశతకం సాధించాడు. దీనితో పాటు హార్దిక్ తన కెరీర్‌లో బిగ్గెస్ట్ స్కోర్ కూడా చేశాడు.

హ్యాట్రిక్ సిక్సర్లతో ఇన్నింగ్స్ ముగించిన హార్దిక్..

ముఖ్యంగా చివరి ఓవర్‌లో భారత ఆల్ రౌండర్ మరింత దూకుడును ప్రదర్శించాడు. ఆస్ట్రేలియన్ మీడియం పేసర్ కామెరూన్ గ్రీన్ విభిన్నమైన ట్రిక్స్ అవలంబించాడు. మొదటి మూడు బంతుల్లో హార్దిక్ మౌనంగా ఉన్నాడు. కానీ, చివరి 3 బంతుల్లో, హార్దిక్ మిడ్ వికెట్, లాంగ్ ఆఫ్, డీప్ బ్యాక్‌వర్డ్ పాయింట్ వద్ద వరుసగా ఆరు సిక్సర్లు కొట్టాడు. హార్దిక్ తన ఇన్నింగ్స్‌లో 58 పరుగులు తీసుకున్నాడు. కేవలం 12 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్సర్లు అందుకున్నాడు. హార్దిక్ కేవలం 30 బంతుల్లో అజేయంగా 71 పరుగులు చేసి భారత్‌ను 6 వికెట్లకు 208 పరుగుల స్కోరుకు తీసుకెళ్లాడు. కానీ, బౌలర్లతోపాటు ఫీల్డర్లు చేసిన తప్పిదాలతో టీమిండియా ఈ స్కోర్‌ను కాపాడుకోలేక, ఓడిపోయింది.