Ravi Bishnoi: ‘సూర్యుడు తప్పకుండా ఉదయిస్తాడు.. మేం మళ్ళీ ప్రయత్నిస్తాం’.. సరికొత్త చర్చకు దారితీసిన ఇన్‌స్టా స్టోరీ..

Team India: ఆసియాకప్‌లో పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో రవి బిష్ణోయ్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. భారత్ తరపున మ్యాచ్‌లు గెలవలేకపోయినా.. ప్రధాన జట్టులో తన స్థానాన్ని నిలబెట్టుకుంటానని ఆశాభావం వ్యక్తం చేశాడు. కానీ..

Ravi Bishnoi: 'సూర్యుడు తప్పకుండా ఉదయిస్తాడు.. మేం మళ్ళీ ప్రయత్నిస్తాం'.. సరికొత్త చర్చకు దారితీసిన ఇన్‌స్టా స్టోరీ..
Ravi Bishnoi
Follow us
Venkata Chari

|

Updated on: Sep 21, 2022 | 10:02 AM

Ravi Bishnoi: టీ20 ప్రపంచకప్‌ 2022లో ఆడే భారత జట్టును ప్రకటించారు. టీమిండియా ముగ్గురు స్పిన్ బౌలర్లను స్వ్కాడ్‌లో చేర్చింది. అక్షర్ పటేల్, యుజ్వేంద్ర చాహల్‌తో పాటు రవి బిష్ణోయ్ కూడా టీమ్ ఇండియాలో భాగంగా ఉన్నాడు. అయితే ఆసియా కప్‌లో మంచి ప్రదర్శన చేసిన రవి బిష్ణోయ్‌ను ప్రధాన జట్టులో ఉంచకపోవడం గమనార్హం. బిష్ణోయ్ భారత రిజర్వ్ ఆటగాళ్లలో ఒకడిగా ఆస్ట్రేలియా వెళ్లనున్నాడు. అతను ఆసియా కప్‌లో ప్రధాన జట్టులో భాగంగా ఉన్నాడు. పాకిస్తాన్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో బాగా రాణించాడు.

T20 ప్రపంచ కప్ కోసం భారత ప్రధాన జట్టు నుంచి తొలగించిన తర్వాత రవి బిష్ణోయ్ తన బాధను సోషల్ మీడియాలో చూపించాడు. ఈ మేరకు ఇన్‌స్టా స్టోరీలో తన కోపాన్ని వెళ్లగక్కాడు. ” సూర్యుడు తప్పకుండా ఉదయిస్తాడు. మేం మళ్ళీ ప్రయత్నిస్తాం” అంటూ ఆ స్టోరీలో రాసుకొచ్చాడు. బిష్ణోయ్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఎక్కడా టీమ్ ఇండియా లేదా టీ20 ప్రపంచకప్ గురించి ప్రస్తావించలేదు. కానీ, తాజాగా జరిగిన పరిణామాలే ఇందుకు కారణమంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

బ్యాటింగ్‌లో పాకిస్థాన్‌పై బిష్ణోయ్ తొలి రెండు బంతుల్లో ఎనిమిది పరుగులు చేశాడు. ఆ తర్వాత నాలుగు ఓవర్లలో కేవలం 26 పరుగులిచ్చి ఒక వికెట్ తీశాడు. అతని చివరి ఓవర్‌లో ఆసిఫ్ అలీ వేసిన సులభమైన క్యాచ్ పట్టుకోవడంలో ఫీల్డర్లు మిస్ అయ్యారు. ఈ క్యాచ్‌ని మిస్ చేయకుంటే భారత్‌కు మ్యాచ్‌ గెలిచే అవకాశాలు మెండుగా ఉండేవి. బిష్ణోయ్ బ్యాట్ నుంచి ఎనిమిది పరుగులు అతని అదృష్టానికి దోహదపడి ఉండవచ్చు. కానీ, అదే అదృష్టం అతనికి బౌలింగ్‌లో మద్దతు ఇవ్వలేదు.

ఇవి కూడా చదవండి

Ravi Bishnoi (1)

ఆస్ట్రేలియా సిరీస్‌లోనూ ఆడడంలేదు..

ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాతో స్వదేశంలో జరిగే టీ20 సిరీస్‌లలో కూడా ఆడడు. ఈ ఏడాది ఆరంభంలో భారత్ తరపున తొలి మ్యాచ్‌ ఆడిన అతను 10 మ్యాచ్‌ల్లో 16 వికెట్లు పడగొట్టాడు. ఈ సమయంలో అతని ఎకానమీ రేటు 7.08, స్ట్రైక్ రేట్ 14.5గా నిలిచింది. అతనితో పాటు, జట్టు నుంచి యువ బౌలర్ అవేష్ ఖాన్ స్థానంలో మహ్మద్ షమీని రిజర్వ్ ప్లేయర్‌లలో సెలెక్టర్లు చేర్చారు.

టీ20 ప్రపంచకప్‌ స్వ్కాడ్..

రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, రిషబ్ పంత్ (కీపర్), దినేష్ కార్తీక్ (WK), హార్దిక్ పాండ్యా, రవిచంద్రన్ అశ్విన్, యుజువేంద్ర చాహల్, అక్షర్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, అర్ష్దీప్ సింగ్.

రిజర్వ్ ఆటగాళ్లు: మహ్మద్ షమీ, దీపక్ చాహర్, శ్రేయాస్ అయ్యర్, రవి బిష్ణోయ్.