IND vs AUS 2nd Test: ఫ్యాన్స్‌కు షాకిచ్చిన బీసీసీఐ.. ప్రేక్షకులు లేకుండానే బరిలోకి.. వెలుగులోకి షాకింగ్ రీజన్

డిసెంబర్ 6 నుంచి భారత్, ఆస్ట్రేలియా మధ్య డే-నైట్ టెస్టు మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌కు ముందు, బీసీసీఐ పెద్ద నిర్ణయం తీసుకుంది. భారత జట్టు ప్రాక్టీస్ సెషన్‌కు అభిమానులను రాకుండా నిషేధించింది. మొత్తానికి బీసీసీఐ ఈ నిర్ణయం ఎందుకు తీసుకుందనే విషయంపై షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది.

IND vs AUS 2nd Test: ఫ్యాన్స్‌కు షాకిచ్చిన బీసీసీఐ.. ప్రేక్షకులు లేకుండానే బరిలోకి.. వెలుగులోకి షాకింగ్ రీజన్
Ind Vs Aus Team India
Follow us
Venkata Chari

|

Updated on: Dec 04, 2024 | 6:29 PM

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్-ఆస్ట్రేలియా మధ్య అడిలైడ్ వేదికగా రెండో మ్యాచ్ జరగనుంది. డిసెంబర్ 6 నుంచి జరగనున్న ఈ మ్యాచ్‌కు టీమిండియా ఆటగాళ్లు జోరుగా సిద్ధమవుతున్నారు. ఈ మ్యాచ్ గులాబీ బంతితో ఆడాల్సి ఉంది. ఇటీవల అడిలైడ్‌లో టీమిండియా ఓపెన్ ప్రాక్టీస్ సెషన్‌ను నిర్వహించింది. అయితే, ఇప్పుడు భారత జట్టు ప్రాక్టీస్ సెషన్‌కు అభిమానులు రాకుండా నిషేధం విధించారు. అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తూ భారత క్రికెట్ బోర్డు ఈ నిర్ణయం ఎందుకు తీసుకుందనే విషయంపై ఓ షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది.

అడిలైడ్‌లో టీమిండియాతో దురుసుగా ప్రవర్తించిన ఫ్యాన్స్..

మిగిలిన ఆస్ట్రేలియా పర్యటన కోసం క్లోజ్డ్ ఏరియాలో ప్రాక్టీస్ సెషన్‌లను నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించింది. నిజానికి ఓపెన్ ప్రాక్టీస్ సెషన్‌లో భారత ఆటగాళ్లు చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చింది. పలువురు ఆటగాళ్లపై అసభ్యకర వ్యాఖ్యలు వచ్చినట్లు తెలుస్తోంది. అదే సమయంలో కొందరు ఆటగాళ్లను కూడా అభిమానులు చుట్టుముట్టారు. దీంతో అభిమానుల ప్రవేశంపై బీసీసీఐ నిషేధం విధించింది. ఆస్ట్రేలియా జట్టు మంగళవారం కూడా ఓపెన్ ప్రాక్టీస్ సెషన్‌ను కలిగి ఉందనే సంగతి తెలిసిందే. కానీ, వారి ఓపెన్ ప్రాక్టీస్ సెషన్‌లో 70 మంది కంటే ఎక్కువ మంది రాలేదు. మరోవైపు, టీమ్ ఇండియా ప్రాక్టీస్ సెషన్‌లో దాదాపు 3000 మంది హాజరయ్యారు. ఇది ఎవరూ ఊహించలేదు.

ఆటగాళ్లను వేధించిన జనాలు..

ఆస్ట్రేలియన్ సెషన్‌లో 70 మంది కంటే ఎక్కువ మంది లేరు. కానీ దాదాపు 3000 మంది భారతీయ ప్రాక్టీస్ సెషన్‌కు చేరుకున్నారు, ఎవరూ ఊహించలేదు. సిడ్నీ టెస్టు మ్యాచ్‌కి ముందు ఓపెన్ ప్రాక్టీస్ సెషన్ జరగాల్సి ఉండగా, ఆ సిరీస్‌లో ఆఖరి మ్యాచ్‌ జరగనుంది. కానీ, ఇప్పుడు దానిని రద్దు చేశారు. ఎందుకంటే ఇక్కడ చేసిన అసభ్యకరమైన, అనుచిత వ్యాఖ్యలతో ఆటగాళ్లు చాలా బాధపడ్డారంట.

ఇవి కూడా చదవండి

మరోవైపు, రోహిత్ శర్మ, రిషబ్ పంత్ వంటి ఆటగాళ్లను సిక్సర్లు కొట్టడానికి అభిమానులు ప్రేరేపించారని గ్రౌండ్‌లో ఉన్న ఒక వ్యక్తి చెప్పుకొచ్చాడు. కొంతమంది అభిమానులు రోహిత్-పంత్ ఫిట్‌నెస్‌పై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశారు. బాడీ షేమింగ్ చేశారంట. మరోవైపు, విరాట్ కోహ్లి, శుభ్‌మన్ గిల్‌లను దాదాపు ప్రేక్షకులు చుట్టుముట్టారు. బ్యాట్స్‌మెన్ ఆడుతున్నప్పుడు కొంతమంది తమ స్నేహితులతో ఫేస్‌బుక్ లైవ్ చేస్తూ బిగ్గరగా మాట్లాడుతున్నారు. అదే సమయంలో, ఒక అభిమాని గుజరాతీలో హాయ్ చెప్పమని ఆటగాడి, పదేపదే అభ్యర్థిస్తున్నట్లు తెలిపారు. ఈ ఘటనలన్నింటిని దృష్టిలో ఉంచుకుని బీసీసీఐ అభిమానుల ప్రవేశంపై నిషేధం విధించింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..