AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video: ధోనిలా నో లుక్ రనౌట్‌ చేశాడు.. కట్‌చేస్తే.. ఊహించని షాక్.. ఏమైందంటే?

Harvasnsh Singh Run Out in Asia Cup Like MS Dhoni: దుబాయ్‌లో జరుగుతున్న అండర్-19 ఆసియా కప్ చివరి దశకు చేరుకుంది. టోర్నీ 12వ మ్యాచ్‌లో టీమిండియా దుబాయ్‌తో తలపడింది. ఈ మ్యాచ్‌లో భారత జట్టు 10 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మ్యాచ్ సమయంలో, భారత వికెట్ కీపర్ హర్వాన్ష్ సింగ్ ఎంఎస్ ధోనీని గుర్తు చేశాడు.

Video: ధోనిలా నో లుక్ రనౌట్‌ చేశాడు.. కట్‌చేస్తే.. ఊహించని షాక్.. ఏమైందంటే?
Ind U19 Vs Uae U19 Video
Venkata Chari
|

Updated on: Dec 04, 2024 | 7:06 PM

Share

Harvasnsh Singh Run Out in Asia Cup Like MS Dhoni: దుబాయ్‌లో జరుగుతున్న అండర్-19 ఆసియా కప్ చివరి దశకు చేరుకుంది. టోర్నీ 12వ మ్యాచ్‌లో టీమిండియా దుబాయ్‌తో తలపడింది. ఈ మ్యాచ్‌లో భారత జట్టు 10 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మ్యాచ్ సమయంలో, భారత వికెట్ కీపర్ హర్వాన్ష్ సింగ్ ఎంఎస్ ధోనీని గుర్తు చేశాడు. భారత జట్టు బౌలింగ్ సమయంలో, హర్వాన్ష్ సింగ్ తన అద్భుతమైన వికెట్ కీపింగ్ నైపుణ్యాన్ని ప్రదర్శించాడు. UAE బ్యాట్స్‌మెన్ అక్షత్ రాయ్ డీప్‌లో షాట్ ఆడాడు. దానిని ఆపడానికి ఇద్దరు భారత ఆటగాళ్లు పరిగెత్తారు. బంతి బౌండరీ లైన్‌కు చేరుకోకముందే ఓ ఆటగాడు డైవ్ చేసి క్యాచ్ పట్టడంతో అతని సహచరుడు బంతిని వికెట్ కీపర్ వైపు విసిరాడు. ఆ తర్వాత, హర్వాన్ష్ బంతిని క్యాచ్ చేసిన వెంటనే వెనుదిరిగి చూడకుండా నో లుక్ రనౌట్‌కు ప్రయత్నించాడు.

యుఎఇ బ్యాట్స్‌మెన్ అప్పటికే క్రీజులోకి చేరుకున్నాడు. అందుకే అతను రనౌట్ కాలేదు. కానీ, హర్వాన్ష్ చురుకుదనం, తెలివితేటలను చూసి, వ్యాఖ్యాతలకు భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ గుర్తుకు వచ్చారంటూ చెప్పుకొచ్చారు. కెరీర్‌లో ధోని మాత్రమే ఇలాంటి ట్రిక్స్ చూపించాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది.

ఇవి కూడా చదవండి

ఈ వీడియోను ఇక్కడ చూడండి..

సెమీఫైనల్‌కు చేరిన భారత జట్టు..

ఈ మ్యాచ్‌లో, యుఎఇ టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకుంది. ఇది వారికి పూర్తిగా తప్పు అని నిరూపితమైంది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 44 ఓవర్లలో 137 పరుగులకు ఆలౌటైంది. యూఏఈ తరపున ర్యాన్ ఖాన్ (35) అత్యధిక పరుగులు చేశాడు. కాగా, భారత్ తరపున యుధాజిత్ గోధా అత్యధికంగా 3 వికెట్లు పడగొట్టాడు. అతను తన 7 ఓవర్ స్పెల్‌లో 15 పరుగులు మాత్రమే ఇచ్చాడు.

ఈ సులభమైన లక్ష్యాన్ని మహ్మద్ అమన్ అండ్ కంపెనీ 16.1 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా సాధించింది. ఆయుష్ మ్హత్రే (67*), వైభవ్ సూర్యవంశీ (76*) అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. ఈ విజయంతో టీమిండియా సెమీస్‌లోకి ప్రవేశించింది. డిసెంబర్ 6న జరిగే సెమీ-ఫైనల్ మ్యాచ్‌లో మెన్ ఇన్ బ్లూ శ్రీలంకతో తలపడనుంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..