Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs AUS: డేవిడ్ వార్నర్ ఖాతాలో చేరిన స్పెషల్ రికార్డ్.. రెండవ ఆస్ట్రేలియా ప్లేయర్‌గా..

David Warner: భారత్‌తో జరిగిన ఈ వన్డే సిరీస్‌లో మొత్తం మూడు మ్యాచ్‌ల్లో 50కి పైగా పరుగులు చేసి డేవిడ్ వార్నర్ సరికొత్త రికార్డు సృష్టించాడు. ఈ ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ ఇండోర్‌లో జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో 53 పరుగులు, మొహాలీలో జరిగిన మొదటి వన్డే మ్యాచ్‌లో 52 పరుగులు చేశాడు. ఈ విధంగా, భారత్‌తో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో ప్రతి మ్యాచ్‌లో 50 లేదా అంతకంటే ఎక్కువ పరుగులు చేసిన రెండో ఆటగాడిగా డేవిడ్ వార్నర్ నిలిచాడు.

IND vs AUS: డేవిడ్ వార్నర్ ఖాతాలో చేరిన స్పెషల్ రికార్డ్.. రెండవ ఆస్ట్రేలియా ప్లేయర్‌గా..
మిచెల్, శ్రేయాస్ అయ్యర్, డేవిడ్ వార్నర్, డుసెన్, మార్ష్, మాక్సెవల్ ఖాతాలో 2 సెంచరీలు ఉన్నాయి.
Follow us
Venkata Chari

|

Updated on: Sep 28, 2023 | 6:10 AM

David Warner: ప్రపంచ కప్ (ICC Cricket World Cup 2023)కి ముందు, భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా (IND vs AUS) మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లో చివరి ODI మ్యాచ్ రాజ్‌కోట్‌లో జరిగింది. ప్రపంచకప్‌నకు ముందు భారత్‌ ఘోర పరాజయాన్ని చవిచూడాల్సి ఉంది. రాజ్‌కోట్‌లో ఆస్ట్రేలియా జట్టును 66 పరుగుల తేడాతో ఓడించింది. అయితే, 3 వన్డేల సిరీస్‌ను 2-1తో టీమిండియా కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 352 పరుగుల భారీ స్కోరు చేసింది. ఆస్ట్రేలియా తరపున, ఓపెనర్ డేవిడ్ వార్నర్ 34 బంతుల్లో 164.71 స్ట్రైక్ రేట్‌తో 56 పరుగులు చేసి వేగంగా ప్రారంభించాడు. ఈ ఇన్నింగ్స్‌లో వార్నర్ 4 సిక్సర్లు, 6 ఫోర్లు బాదాడు.

భారత్‌తో జరిగిన ఈ వన్డే సిరీస్‌లో మొత్తం మూడు మ్యాచ్‌ల్లో 50కి పైగా పరుగులు చేసి డేవిడ్ వార్నర్ సరికొత్త రికార్డు సృష్టించాడు. ఈ ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ ఇండోర్‌లో జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో 53 పరుగులు, మొహాలీలో జరిగిన మొదటి వన్డే మ్యాచ్‌లో 52 పరుగులు చేశాడు. ఈ విధంగా, భారత్‌తో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో ప్రతి మ్యాచ్‌లో 50 లేదా అంతకంటే ఎక్కువ పరుగులు చేసిన రెండో ఆటగాడిగా డేవిడ్ వార్నర్ నిలిచాడు.

ఇవి కూడా చదవండి

ఆరోన్ ఫించ్ కూడా ..

వార్నర్ కంటే ముందు ఆరోన్ ఫించ్ ఈ పని చేశాడు. ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ ఆరోన్ ఫించ్ 2020-21లో తన స్వదేశంలో జరిగిన వన్డే సిరీస్‌లోని మూడు మ్యాచ్‌లలో వరుసగా 114, 60, 75 పరుగుల ఇన్నింగ్స్‌లు ఆడాడు. ఈ లిస్టులో ఆరోన్ ఫించ్ మొదటి బ్యాట్స్‌మన్ అయ్యాడు. ఆ తర్వాత భారతదేశంతో జరిగిన 3-మ్యాచ్‌ల ODI సిరీస్‌లోని అన్ని మ్యాచ్‌లలో 50 లేదా అంతకంటే ఎక్కువ పరుగులు చేసిన రెండవ బ్యాట్స్‌మెన్‌గా డేవిడ్ వార్నర్ నిలిచాడు.

కాగా, భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య జరిగిన ఈ మ్యాచ్‌లో, నలుగురు ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ – డేవిడ్ వార్నర్ (56), మిచెల్ మార్ష్ (96), స్టీవ్ స్మిత్ (74), మార్నర్ లాబుస్‌చాగ్నే (72) అర్ధ సెంచరీలు చేశారు.

భారత జట్టు: రోహిత్ శర్మ(కెప్టెన్), విరాట్ కోహ్లి, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (కీపర్), సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్‌ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ

ఆస్ట్రేలియా జట్టు: మిచెల్ మార్ష్, డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్, మార్నస్ లబుషేన్, అలెక్స్ క్యారీ (కీపర్), గ్లెన్ మ్యాక్స్‌వెల్‌, కామెరూన్ గ్రీన్, ప్యాట్ కమిన్స్(కెప్టెన్), మిచెల్ స్టార్క్, తన్వీర్ సంగా, జోష్ హేజిల్‌వుడ్‌.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..