ట్రావిస్ హెడ్‌కు ఓపెన్ ఛాలెంజ్.. బాక్సింగ్ డే టెస్టుకు ముందే హీట్ పెంచిన టీమిండియా యంగ్ ప్లేయర్..
Akash Deep Open Challenge to Travis Head: మెల్ బోర్న్ టెస్టుకు ముందు టీమిండియా ఫాస్ట్ బౌలర్ మాటలతో రెచ్చిపోయాడు. ఆస్ట్రేలియా ట్రావిస్ హెడ్‌కు బహిరంగంగా సవాలు విసిరాడు. హెడ్‌ని క్రీజులో ఉండనివ్వబోమంటూ వార్నింగ్ ఇచ్చాడు. దీంతో మూడో టెస్ట్‌కు ముందు మెల్బోర్న్ వాతావరణం హీటెక్కింది.
Akash Deep Open Challenge to Travis Head: మెల్బోర్న్ వేదికగా భారత్, ఆస్ట్రేలియా జట్లు ఇప్పుడు బాక్సింగ్ డే టెస్ట్ మ్యాచ్‌లో తలపడనున్నాయి. గబ్బా టెస్టు డ్రా అయిన తర్వాత మెల్‌బోర్న్ టెస్టు ద్వారా ఆధిక్యం సాధించాలనే ఉద్దేశంతో ఇరు జట్లూ రంగంలోకి దిగనున్నాయి. భారత దిగ్గజం జస్ప్రీత్ బుమ్రాతో డీల్ చేయడం మళ్లీ ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్‌కు పెద్ద తలనొప్పిగా మారనుంది. అదే సమయంలో భారత బౌలర్లకు మరోసారి ఆస్ట్రేలియా పవర్‌ఫుల్ బ్యాట్స్‌మెన్ ట్రావిస్ హెడ్ సవాల్ ఎదురుకానుంది. అయితే, మెల్ బోర్న్ టెస్టుకు ముందు టీమిండియా ఫాస్ట్ బౌలర్ ఆకాశ్ దీప్ రెచ్చిపోయాడు. ట్రావిస్ హెడ్‌ని క్రీజులో ఉండనివ్వబోమని అతను స్పష్టంగా చెప్పుకొచ్చాడు.
ఆకాశ్ దీప్ బౌలింగ్ ప్లాన్..
సిరీస్‌లో నాలుగో టెస్టు డిసెంబర్ 26 నుంచి మెల్‌బోర్న్‌లో జరగనుంది. దీనికి ముందు భారత ఫాస్ట్ బౌలర్ ఆకాశ్ దీప్ విలేకరుల సమావేశంలో పాల్గొన్నాడు. టీమిండియా బౌలింగ్ ప్లాన్‌ను బయటపెట్టాడు. ఫాస్ట్ బౌలర్‌గా మేం అవే బంతులకు కట్టుబడి బౌలింగ్‌లో క్రమశిక్షణను పాటిస్తాం’ అంటూ ఆకాష్ చెప్పుకొచ్చాడు. మేం రెండు ఓవర్ల నుంచి రౌండ్ దా వికెట్ బౌలింగ్ చేస్తాం. పిచ్, పరిస్థితులను అంచనా వేసి తదనుగుణంగా ప్రణాళికను తయారు చేస్తాం అంటూ చెప్పుకొచ్చాడు.
ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ఆకాష్ దీప్ ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్‌మెన్ ట్రావిస్ హెడ్‌కి కూడా సవాలు విసిరాడు. ఈ సిరీస్‌లో టీమిండియాకు అతిపెద్ద తలనొప్పిగా మారిన హెడ్ గురించి ఆకాష్ మాట్లాడుతూ.. ‘ట్రావిస్ హెడ్, ముఖ్యంగా షార్ట్ బంతులను ఎదుర్కొంటాడని నేను భావిస్తున్నాను. మేం అతనిని క్రీజులో స్థిరపడనివ్వం. మేం నిర్దిష్ట ప్రాంతాల్లో బౌలింగ్ చేస్తాం. తప్పులు చేయడానికి వారిని బలవంతం చేస్తాం. ఇది మాకు అవకాశాలను సృష్టిస్తుంది’ అంటూ చెప్పుకొచ్చాడు.
గబ్బా టెస్ట్‌లో తలకు గాయం..
ఈ సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడు హెడ్. ఇప్పటి వరకు రెండు సెంచరీల సాయంతో 409 పరుగులు చేశాడు. గబ్బా టెస్టులో రెండో ఇన్నింగ్స్‌లో ట్రావిస్ హెడ్ గాయపడ్డాడు. అతనికి గజ్జల్లో గాయమైంది. గాయం తర్వాత అతను కొద్దిగా వాపు అని చెప్పుకొచ్చాడు. అయితే, ఇప్పటి వరకు అతని గాయం గురించి స్పష్టంగా ఏమీ చెప్పలేదు. మెల్‌బోర్న్ టెస్టులో అతడు ఆడడంపై ఉత్కంఠ నెలకొంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..