IND vs AUS: 12 ఇన్నింగ్స్‌లు.. 9 సార్లు పరువుపాయే.. ఆ భయం గుప్పిట్లోనే రోహిత్ శర్మ..
Rohit Sharma: ఈ సిరీస్‌లో నాలుగో మ్యాచ్ డిసెంబర్ 26 నుంచి మెల్‌బోర్న్‌లో జరగనుంది. ఈ మ్యాచ్‌లో, భారత జట్టు అద్భుతంగా పునరాగమనం చేయాలనుకుంటుంది. సిరీస్‌లో 2-1 ఆధిక్యం సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. అయితే, భారత బ్యాట్స్‌మెన్స్ తమ ఫామ్‌ను మెరుగుపరుచుకోవాల్సిన అవసరం ఉంది. లేదంటే, సిరీస్ కోల్పోయే ఛాన్స్ ఉంది.
Rohit Sharma: భారత్, ఆస్ట్రేలియా మధ్య ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ కొనసాగుతోంది. తొలి మ్యాచ్‌లో విజయంతో శుభారంభం చేసిన భారత జట్టు రెండో టెస్టులో వరుస విజయాలను నిలబెట్టుకోవడంలో విఫలమైంది. అడిలైడ్ టెస్టులో ఆతిథ్య జట్టు 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మూడో మ్యాచ్ డ్రా అయింది. దీంతో ఈ సిరీస్ ప్రస్తుతం 1-1తో సమంగా ఉంది. గత రెండు మ్యాచ్‌ల్లో భారత్ టాప్ ఆర్డర్ విఫలమైంది.
అడిలైడ్ టెస్టులో భారత కెప్టెన్ రోహిత్ శర్మ జట్టులోకి వచ్చాడు. రెండో బిడ్డ పుట్టడంతో తొలి మ్యాచ్‌లో పాల్గొనలేకపోయాడు. రీఎంట్రీ తర్వాత, హిట్‌మ్యాన్ బ్యాట్ నుంచి కొన్ని భారీ ఇన్నింగ్స్‌లను చూడాలని అభిమానులు ఆశించారు. కానీ, అది ఇప్పటివరకు జరగలేదు. ఒక పెద్ద ఇన్నింగ్స్‌ను మర్చిపోయి, వికెట్‌పై నిలవడానికి కూడా రోహిత్ చాలా కష్టపడుతున్నాడు. ఈ సిరీస్‌లో ఇప్పటి వరకు నాలుగు ఇన్నింగ్స్‌ల్లో 3, 6, 10 పరుగులు చేశాడు. ఆశ్చర్యకరంగా, అతను మూడు ఇన్నింగ్స్‌ల్లోనూ ఫాస్ట్ బౌలర్లకే చిక్కి పెవిలియన్ చేరాడు.
టెస్టులో రోహిత్ బ్యాటింగ్ యావరేజ్ ఓసారి చూద్దాం..
సంవత్సరం | సగటు |
---|---|
2013 | 66.60 |
2014 | 26.33 |
2015 | 25.07 |
2016 | 57.60 |
2017 | 217.0 |
2018 | 26.28 |
2019 | 92.66 |
2021 | 47.68 |
2022 | 30.00 |
2023 | 41.92 |
2024 | 26.39 |
భారత కెప్టెన్ గత కొంత కాలంగా రైట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్లతో పోరాడుతున్నాడు. గణాంకాల ప్రకారం, గత 12 ఇన్నింగ్స్‌లలో అతను కుడిచేతి ఫాస్ట్ బౌలర్లపై 106 పరుగులు మాత్రమే చేశాడు. అతను తొమ్మిది సార్లు అవుట్ అయ్యాడు. రోహిత్ సగటు 11.8గా ఉంది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. టెస్టు క్రికెట్‌లో అతడి సగటు ఏడాదికేడాది పడిపోతోంది. ఈ ఏడాది అతను 26.39 సగటుతో పరుగులు చేశాడు.
ఈ సిరీస్‌లో నాలుగో మ్యాచ్ డిసెంబర్ 26 నుంచి మెల్‌బోర్న్‌లో జరగనుంది. ఈ మ్యాచ్‌లో, భారత జట్టు అద్భుతంగా పునరాగమనం చేయాలనుకుంటుంది. సిరీస్‌లో 2-1 ఆధిక్యం సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. అయితే, భారత బ్యాట్స్‌మెన్ తమ ఫామ్‌ను మెరుగుపరుచుకోవాల్సిన అవసరం ఉంది. ఈ మైదానంలో ఆస్ట్రేలియా బౌలర్ల రికార్డు అద్భుతంగా ఉంది. నాథన్ లియాన్ 24 ఇన్నింగ్స్‌ల్లో 45 వికెట్లు తీశాడు. అదే సమయంలో పాట్ కమిన్స్ 35 వికెట్లు, మిచెల్ స్టార్క్ 25 వికెట్లు, స్కాట్ బోలాండ్ 10 వికెట్లు తీశారు. వీటిని అధిగమించాలంటే భారత్ టాప్ ఆర్డర్ తీవ్రంగా శ్రమించాల్సి ఉంటుంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..