Video: కోహ్లీ ఫ్యాన్స్‌కు షాకింగ్ న్యూస్.. చివరి వన్డే ఆడేశాడా..? వీడ్కోలు చెప్పేసిన వీడియో ఇదిగో..
Virat Kohli Emotional Video: అడిలైడ్ వన్డేలో సున్నా పరుగులకే ఔటైన తర్వాత విరాట్ కోహ్లీ తన అభిమానులకు వీడ్కోలు పలికాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సిరీస్‌లో వరుసగా రెండో వన్డేలో విరాట్ సున్నా పరుగులకే ఔటయ్యాడు.

Virat Kohli Emotional Video: అడిలైడ్ వన్డేలో విరాట్ కోహ్లీ డకౌట్ అయ్యాడు. కేవలం నాలుగు బంతులు ఆడిన కోహ్లీ.. పరుగులేమీ చేయకుండానే పెవిలియన్ చేరాడు. దీనికి ముందు, పెర్త్‌లో జరిగిన మొదటి వన్డేలోనూ ఎనిమిది బంతులు ఆడి, డకౌట్ అయ్యాడు. అడిలైడ్‌లో, విరాట్ కోహ్లీని జేవియర్ బార్ట్‌లెట్ ఎల్‌బీడబ్ల్యూగా అవుట్ చేశాడు. కోహ్లీ డకౌట్ అయి పెవిలియన్‌కు తిరిగి వస్తున్నప్పుడు షాకింగ్ సీస్ చోటు చేసుకుంది. దీంతో విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ మ్యాచ్ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అభిమానులకు వీడ్కోలు పలికిన విరాట్ కోహ్లీ..
ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, ఆ వీడియోలో ఏముంది? అందులో, విరాట్ అవుట్ అయిన తర్వాత పెవిలియన్‌కు వెళ్తున్నప్పుడు అభిమానులకు వీడ్కోలు పలుకుతూ కనిపిస్తాడు. ఈ వీడియోలో, కోహ్లీ తల వంచి, రెండు గ్లౌవ్‌జులను చేతుల్లో పట్టుకుని, వాటిని ప్రేక్షకుల వైపు చూపిస్తూ అభివాదం చేశాడు. తన రిటైర్మెంట్‌కు ముందు అడిలైడ్‌లో తన చివరి ఇన్నింగ్స్ ముగిసిందని సూచించడానికే ఇలా చూశాడంటూ సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.
అడిలైడ్ వన్డేలో డకౌట్ అయి విరాట్ కోహ్లీ పెవిలియన్‌కు తిరిగి వస్తున్నప్పుడు, స్టేడియంలోని అభిమానులు అతనికి మద్దతుగా నిలబడ్డారు. అప్పుడు విరాట్ స్పందించి వారి శుభాకాంక్షలను స్వీకరించాడు.
End is very-very near guys, cherish each and every moment of Virat kohli in this tour.💔 pic.twitter.com/vgJ3Uy4rxO
— U’ (@toxifyy18) October 23, 2025
విరాట్ కోహ్లీ అడ్డాగా అడిలైడ్..
అడిలైడ్‌ను విరాట్ కోహ్లీ చెడుగుడు ఆడే మైదానంగా పిలుస్తారు. ఈ మైదానంలో అతని గణాంకాలు ఇదే కథను చెబుతాయి. అడిలైడ్‌లో జరిగిన 13 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో విరాట్ కోహ్లీ 60.93 సగటుతో 975 పరుగులు చేశాడు. అతను ఇక్కడ ఐదు సెంచరీలు చేశాడు. అడిలైడ్ ఓవల్‌లో వన్డేల్లో విరాట్ కోహ్లీ సగటు 61. అడిలైడ్ ఓవల్‌లో జరిగిన నాలుగు వన్డేల్లో రెండు సెంచరీలతో 244 పరుగులు చేశాడు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








