IND vs AUS 2nd ODI: ఇద్దరు రీఎంట్రీ.. ఇద్దరు ఔట్.. విశాఖలో టీమిండియా ప్లేయింగ్-11 ఇదే..
IND vs AUS Possible Playing-11: భారత్-ఆస్ట్రేలియా మధ్య మూడు వన్డేల సిరీస్‌లో రెండో మ్యాచ్ నేడు (మార్చి 19) జరగనుంది. విశాఖపట్నంలోని డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఏసీఏ-వీడీసీఏ క్రికెట్ స్టేడియంలో మధ్యాహ్నం 1.30 గంటలకు ఇరు జట్లు తలపడనున్నాయి.
IND vs AUS: భారత్-ఆస్ట్రేలియా మధ్య మూడు వన్డేల సిరీస్‌లో రెండో మ్యాచ్ నేడు (మార్చి 19) జరగనుంది. విశాఖపట్నంలోని డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఏసీఏ-వీడీసీఏ క్రికెట్ స్టేడియంలో మధ్యాహ్నం 1.30 గంటలకు ఇరు జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్సీ మరోసారి రోహిత్ శర్మ చేతుల్లోకి వెళ్లనుంది. తొలి వన్డేకు అతడు అందుబాటులో లేకపోవడంతో హార్దిక్ పాండ్యా టీమిండియా పగ్గాలు చేపట్టాడు.
టీమిండియాలోకి రోహిత్ శర్మ పునరాగమనంతో బహుశా ఇషాన్ కిషన్ బెంచ్‌లో కూర్రొనే అవకాశం ఉంది. ప్లేయింగ్-11కి దూరంగా ఉండాల్సి రావచ్చు. ఈ ఏడాది జరిగిన నాలుగు వన్డేల్లోనూ అతను పూర్తిగా విఫలమయ్యాడు. శార్దూల్ ఠాకూర్‌ను కూడా బెంచ్‌పై కూర్చోబెట్టవచ్చు. గత మ్యాచ్‌లో అతను కేవలం రెండు ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేశాడు. అతని స్థానంలో స్పిన్ ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్‌కు అవకాశం లభించవచ్చు. ఎందుకంటే విశాఖపట్నంలోని పిచ్ కొంత వరకు స్పిన్‌కు అనుకూలంగా ఉంటుంది.
అలెక్స్ కారీ, వార్నర్‌ల ప్రవేశం ఉండవచ్చు..
ఆస్ట్రేలియా ప్లేయింగ్-11లో రెండు మార్పులు జరగనున్నాయి. గత మ్యాచ్‌లో డేవిడ్ వార్నర్ పూర్తిగా ఫిట్‌గా లేనందున జట్టుకు దూరంగా ఉండగా, అలెక్స్ కారీకి కూడా జ్వరం వచ్చింది. ఇప్పుడు వారిద్దరూ తప్పుకునే ఛాన్స్ ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో లాబుషేన్ స్థానంలో వార్నర్‌కు అవకాశం కల్పించవచ్చు. అదే సమయంలో, జోష్ ఇంగ్లిస్ స్థానంలో అలెక్స్ కారీకి చోటు దక్కవచ్చు.
ఇది రెండు జట్ల ప్రాబబుల్ ప్లేయింగ్-11..
భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, మహ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్, మహ్మద్ షమీ.
ఆస్ట్రేలియా జట్టు: డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, స్టీవ్ స్మిత్ (సి), కామెరాన్ గ్రీన్, ట్రావిస్ హెడ్, గ్లెన్ మాక్స్‌వెల్, మార్కస్ స్టోయినిస్, అలెక్స్ కారీ, ఆడమ్ జంపా, సీన్ అబాట్, మిచెల్ స్టార్క్.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..