IND vs AFG: అఫ్గాన్‌తో రెండో టీ20.. విరాట్ భయ్యా వచ్చేశాడు.. టీమిండియా ప్లేయింగ్-XI ఇదే
మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా భారత్, అఫ్గానిస్థాన్ జట్ల మధ్య మరికాసేపట్లో రెండో మ్యాచ్ జరగనుంది. ఇండోర్‌లోని హోల్కర్ క్రికెట్ స్టేడియం ఈ మ్యాచ్ కు ఆతిథ్యమిస్తోంది. ఈ మ్యాచ్‌లో విశేషమేమిటంటే.. టీమిండియా రన్ మెషిన్ చాలా రోజుల తర్వాత అంతర్జాతీయ టీ20 క్రికెట్ మ్యాచ్ ఆడనున్నాడు

మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా భారత్, అఫ్గానిస్థాన్ జట్ల మధ్య మరికాసేపట్లో రెండో మ్యాచ్ జరగనుంది. ఇండోర్‌లోని హోల్కర్ క్రికెట్ స్టేడియం ఈ మ్యాచ్ కు ఆతిథ్యమిస్తోంది. ఈ మ్యాచ్‌లో విశేషమేమిటంటే.. టీమిండియా రన్ మెషిన్ చాలా రోజుల తర్వాత అంతర్జాతీయ టీ20 క్రికెట్ మ్యాచ్ ఆడనున్నాడు. కాబట్టి అందరి కళ్లు కోహ్లీ మీదే ఉంటాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక తొలి మ్యాచ్‌లో గెలిచిన టీమిండియా ఇప్పటికే సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో ఉంది. ఈరోజు కూడా అఫ్గానిస్థాన్‌పై విజయం సాధించగలిగితే భారత్ సిరీస్ కైవసం చేసుకుంటుంది. రెండో టీ20లో టాస్ గెలిచిన టీమిండియా ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. విరాట్ రీ ఎంట్రీ ఇవ్వగా, గాయం కారణంగా గత మ్యాచ్‌కు దూరమైన యశస్వి జైస్వాల్ తిరిగి ఈ మ్యాచ్‌లో ఆడనున్నాడు. ఓపెనర్ శుభ్ మన్ గిల్ కు తుది జట్టులో చోటు దక్కలేదు.
మరోవైపు, ఆఫ్ఘనిస్తాన్ జట్టు కూడా ప్లేయింగ్ ఎలెవెన్‌లో 1 మార్పు చేసింది. నూర్ అహ్మద్ ప్లేయింగ్ ఎలెవన్‌లోకి ప్రవేశించాడు. రహ్మత్ షాకు జట్టులో చోటు దక్కలేదు.
భారత జట్టు..
Two changes for #TeamIndia in the Playing XI.
Virat Kohli and Yashasvi Jaiswal come in for Tilak Varma and Shubman Gill.
Live – https://t.co/YswzeURSuH #INDvAFG@IDFCFIRSTBank pic.twitter.com/J4XjBsaOue
— BCCI (@BCCI) January 14, 2024
రోహిత్ శర్మ (కెప్టెన్), యస్సావి జైస్వాల్, విరాట్ కోహ్లీ, శివమ్ దూబే, జితేష్ శర్మ (వికెట్ కీపర్), రింకూ సింగ్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, అర్షదీప్ సింగ్, ముఖేష్ కుమార్.
అఫ్ఘనిస్తాన్ జట్టు
2nd T20. Afghanistan XI: R Gurbaz (w), I Zadran (c), A Omarzai, M Nabi, N Zadran, K Janat, G Naib, N Ahmad, F Farooqi, Naveen-ul-Haq, M Ur Rahman. https://t.co/YswzeUSqkf #INDvAFG @IDFCFIRSTBank
— BCCI (@BCCI) January 14, 2024
రహ్మానుల్లా గుర్బాజ్, ఇబ్రహీం జద్రాన్ (కెప్టెన్), అజ్మతుల్లా ఉమర్జాయ్, మహ్మద్ నబీ, నజీబుల్లా జద్రాన్, కరీం జనత్, గుల్బాదిన్ నాయబ్, నూర్ అహ్మద్, ఫజల్హాక్ ఫరూకీ, నవీన్-ఉల్-హక్
Milestone 🚨 – @ImRo45 is all set to play his 150th match in the shortest format of the game.
Go well, Skip 🫡#TeamIndia pic.twitter.com/1uWje5YNiq
— BCCI (@BCCI) January 14, 2024
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




