AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs AFG : ఫ్యాన్స్‌కు పూనకాలే.. కింగ్ కోహ్లీ, హిట్ మ్యాన్ ఎంట్రీ డేట్ ఫిక్స్.. అప్పుడే ప్రాక్టీస్ షురూ

IND vs AFG : భారత్, అఫ్గానిస్థాన్ జట్ల మధ్య జూన్ 6 నుంచి ఒకే ఒక్క టెస్ట్ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ ముగియగానే వన్డే సిరీస్ మొదలవుతుంది. తాజా సమాచారం ప్రకారం.. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ జూన్ 9న ముల్లాన్‌పూర్‌లో అడుగుపెడతారు.

IND vs AFG :  ఫ్యాన్స్‌కు పూనకాలే.. కింగ్ కోహ్లీ, హిట్ మ్యాన్ ఎంట్రీ డేట్ ఫిక్స్.. అప్పుడే ప్రాక్టీస్ షురూ
Team India
Rakesh
|

Updated on: Jun 03, 2026 | 3:48 PM

Share

IND vs AFG : ఐపీఎల్ 2026 హంగామా ముగియగానే టీమిండియా మళ్లీ ఇంటర్నేషనల్ క్రికెట్ మూడ్‌లోకి వచ్చేసింది. అఫ్గానిస్థాన్‌తో జరగనున్న కీలకమైన వన్డే సిరీస్ కోసం సీనియర్ స్టార్స్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఎప్పుడు జట్టుతో కలుస్తారనే దానిపై క్లారిటీ వచ్చేసింది. జూన్ 9 నుంచి ముల్లాన్‌పూర్ వేదికగా వీరిద్దరూ కఠినమైన నెట్ ప్రాక్టీస్ మొదలుపెట్టనున్నారు. భారత్, అఫ్గానిస్థాన్ జట్ల మధ్య జూన్ 6 నుంచి ఒకే ఒక్క టెస్ట్ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ ముగియగానే వన్డే సిరీస్ మొదలవుతుంది. తాజా సమాచారం ప్రకారం.. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ జూన్ 9న ముల్లాన్‌పూర్‌లో అడుగుపెడతారు. జూన్ 9 నుంచి 11 వరకు మూడు రోజుల పాటు వీరు నెట్స్‌లో చెమటోడ్చనున్నారు. ఆ తర్వాత, జూన్ 13న ధర్మశాలలో జరిగే మొదటి వన్డే కోసం టీమిండియాతో కలిసి అక్కడికి చేరుకుంటారు.

మిషన్ 2027 వరల్డ్ కప్ లక్ష్యంగా..

ఈ వన్డే సిరీస్ కేవలం ఒక ద్వైపాక్షిక సిరీస్ మాత్రమే కాదు, 2027 వన్డే వరల్డ్ కప్‌కు సన్నాహకంగా జట్టు భావిస్తోంది. 2023 వరల్డ్ కప్ ఫైనల్లో తృటిలో చేజారిన టైటిల్‌ను ఈసారి ఎలాగైనా ముద్దాడాలని రోహిత్, కోహ్లీ కసితో ఉన్నారు. తమ కెరీర్ చివరి దశలో ఉన్న ఈ ఇద్దరు దిగ్గజాలు, తమ ఫిట్‌నెస్, ఫామ్‌ను కాపాడుకోవడానికి ఈ సిరీస్‌ను కీలకంగా భావిస్తున్నారు.

నెట్ బౌలర్ల సందడి.. మయాంక్ యాదవ్ ఎంట్రీ

ఈ ప్రాక్టీస్ సెషన్స్ కోసం బీసీసీఐ ప్రత్యేకంగా ఆరుగురు నెట్ బౌలర్లను ఎంపిక చేసింది. ఇందులో ఐపీఎల్ 2026లో తన వేగంతో అదరగొట్టిన మయాంక్ యాదవ్ కూడా ఉన్నాడు. అఫ్గాన్ బ్యాటర్లను ఎదుర్కోవడానికి టీమిండియా సిద్ధమవుతుంటే, మన బ్యాటర్లకు పదును పెట్టడానికి మయాంక్ వంటి స్పీడ్‌స్టర్లు సాయపడనున్నారు. ఇప్పటికే వన్డే జట్టులోకి ఎంపికైన ప్రిన్స్ యాదవ్ కూడా రోహిత్, కోహ్లీలతో కలిసి ధర్మశాల వెళ్లనున్నాడు.

కోహ్లీ జోష్.. రోహిత్ కసి

విరాట్ కోహ్లీ ప్రస్తుతం ఫుల్ ఫామ్‌లో ఉన్నాడు. ఐపీఎల్ 2026లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వరుసగా రెండోసారి టైటిల్ గెలవడంలో కోహ్లీ కీలక పాత్ర పోషించాడు. టోర్నీలో 675 పరుగులు చేసి సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. మరోవైపు ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మకు ఐపీఎల్ ఈసారి ఆశించిన స్థాయిలో సాగలేదు. మరోవైపు రోహిత్ శర్మకు ఐపీఎల్ 2026 అంతగా కలిసిరాలేదు. ముంబై ఇండియన్స్ జట్టు హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో ఘోరంగా విఫలమై పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో నిలిచింది. రోహిత్ కేవలం 9 ఇన్నింగ్స్‌లలో 283 పరుగులు మాత్రమే చేయగలిగాడు. కేకేఆర్, లక్నోలపై ఆడిన రెండు ఇన్నింగ్స్‌లు మినహా మిగతా మ్యాచ్‌ల్లో నిరాశపరిచాడు. ఈ ఐపీఎల్ పరాజయాల కసిని ఆఫ్ఘనిస్తాన్ వన్డే సిరీస్‌లో చూపించాలని హిట్మ్యాన్ పట్టుదలతో ఉన్నాడు.

మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!