AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL Final: మొదలైన ఐపీఎల్‌ ఫైనల్ ఫీవర్‌.. బెట్టింగ్‌లకు అడ్డాగా మారిన ఫాంహౌస్‌లు.

అసలే ఫైనల్‌ మ్యాచ్‌.. అందులోనూ బెట్టింగ్‌ రాయుళ్లకు పండుగే. లక్షలు వెలల్లోనే బెట్టింగ్‌ సాగుతుంది. కాయ్‌ రాజా..కాయ్‌ అన్నట్టుగు బాల్‌ బాల్‌కు ఒక రేటు కట్టేందుకు బెట్టింగ్‌ ముఠా రెడీ అయింది. అది కూడా హైదరాబాద్‌, దాని శివారులోని ప్రత్యేక క్యాంప్‌లు ఏర్పాటు చేసి బెట్టింగ్‌ కాస్తున్నారు. ఐపీఎల్‌ ఫైనల్‌ మ్యాచ్‌పై...

IPL Final: మొదలైన ఐపీఎల్‌ ఫైనల్ ఫీవర్‌.. బెట్టింగ్‌లకు అడ్డాగా మారిన ఫాంహౌస్‌లు.
IPL Final
Narender Vaitla
|

Updated on: May 28, 2023 | 3:21 PM

Share

అసలే ఫైనల్‌ మ్యాచ్‌.. అందులోనూ బెట్టింగ్‌ రాయుళ్లకు పండుగే. లక్షలు వెలల్లోనే బెట్టింగ్‌ సాగుతుంది. కాయ్‌ రాజా..కాయ్‌ అన్నట్టుగు బాల్‌ బాల్‌కు ఒక రేటు కట్టేందుకు బెట్టింగ్‌ ముఠా రెడీ అయింది. అది కూడా హైదరాబాద్‌, దాని శివారులోని ప్రత్యేక క్యాంప్‌లు ఏర్పాటు చేసి బెట్టింగ్‌ కాస్తున్నారు. ఐపీఎల్‌ ఫైనల్‌ మ్యాచ్‌పై జోరుగా బెట్టింగ్‌ నడుస్తోంది. ఎవరు గెలుస్తారు? ఎవరు ఓడి పోతారు? గెలిస్తే ఎంత? ఓడి పోతే ఎంత? రేట్లు కట్టి బెట్టింగ్‌లో డబ్బులు వసూలు చేస్తున్నారు.

ఐపీఎల్‌ బెట్టింగ్‌లకు ముఖ్యంగా హైదరాబాద్‌ శివారులోని ఫామ్‌హౌస్‌లు అడ్డాగా మారాయి. దీంతో హైదరాబాద్‌ శివారులో ఉన్న ఫాంహౌస్‌లపై పోలీసుల ప్రత్యేక నిఘా పెట్టారు. ఇప్పటికే పలు బెట్టింగ్ ముఠాలను పట్టుకున్న పోలీసులు.. కీలక సమాచారాన్ని కూడా రాబట్టారు. సాయంత్రం జరిగే ఫైనల్‌ మ్యాచ్‌లో ఈ బెట్టింగ్‌లు పీక్‌ స్టేజీకి వెళ్లే ఛాన్స్‌ ఉంది. అటు.. దేశంలోనే అతి పద్ద స్టేడియంగా ప్రసిద్దికి ఎక్కిన నరేంద్ర మోదీ స్టేడియంలో మరి కాసేపట్లో ఐపీఎల్‌ ఫైనల్‌ మ్యాచ్‌ జరుగనుంది. గుజరాత్‌ టైటాన్‌- చెన్నై సూపర్‌ కింగ్స్‌ మధ్య ఈ ఫైనల్‌ పోరు సాగుతుంది. ఐపీఎల్‌ కప్‌ విన్నర్‌ ఎవరో తేల్చే మ్యాచ్‌ కావడంతో ఫ్యాన్స్‌లో ఉత్కంఠ నెలకొంది.

దాదాపు 50 రోజులకు పైగా సాగుతున్న ఐపీఎల్‌ మ్యాచ్‌లకు ఫ్యాన్స్ చాలానే ఉంది. సాయంత్ర ఐతే.. టీవీల్లో ఈలలు గోలలుగా సాగి పోతుంది. అలాంటిది నేడు జరిగే ఫైనల్‌ మ్యాచ్‌ మరింత రంజుగా ఉండే ఛాన్స్‌ ఉంది. సీఎస్‌కే జట్టులో ధోనీది కీ రోల్‌ కాగా.. గుజరాత్‌లో మాత్రం సెంచరీల హీరో శుభ్‌మన్‌ గిల్‌దే హవా. వీరిద్దరు కూడా ఆరెంజ్‌ క్యాప్‌ రేసులో ఉన్నారు. గిల్‌ను అడ్డుకోవడంపైనే సీఎస్‌కే విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ క్రమంలో సీఎస్‌కే ప్రధాన కోచ్‌ స్టీఫెన్‌ ఫ్లెమింగ్‌ తమ జట్టు సన్నద్ధతపై కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో కంటే ఇప్పుడు తమ ప్రిపరేషన్‌ మరింత ఉత్తమంగా ఉందని పేర్కొన్నాడు. సాధారణంగా తమ గెలుపు – ఓటముల నిష్పత్తి 50 శాతంగా ఉందని తెలిపాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి..

JEE Main 2026లో టాప్‌ స్కోర్ కావాలా? ఐతే ఈ టాపిక్స్‌ మిస్ కావద్దు
JEE Main 2026లో టాప్‌ స్కోర్ కావాలా? ఐతే ఈ టాపిక్స్‌ మిస్ కావద్దు
ఏందిది ఆది..! ఇదేదో ముందే చేయొచ్చుగా
ఏందిది ఆది..! ఇదేదో ముందే చేయొచ్చుగా
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..? వెదర్ రిపోర్ట్ ఇదిగో
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..? వెదర్ రిపోర్ట్ ఇదిగో
కవలలు ఇంట్లో నిద్రిస్తుండగా భారీ శబ్ధం.. లోపలికి వెళ్లి చూడగా..
కవలలు ఇంట్లో నిద్రిస్తుండగా భారీ శబ్ధం.. లోపలికి వెళ్లి చూడగా..
ఊహించని బాంబు పేల్చిన ధురంధర్ 2.. వాళ్ల పరిస్థితేంటి..?
ఊహించని బాంబు పేల్చిన ధురంధర్ 2.. వాళ్ల పరిస్థితేంటి..?
భారతీయుల బహిష్కరణలో అమెరికా సెకండ్, టాప్‌లో ఏ దేశం ఉందో తెలుసా?
భారతీయుల బహిష్కరణలో అమెరికా సెకండ్, టాప్‌లో ఏ దేశం ఉందో తెలుసా?
గ్లోబల్ బాక్సాఫీస్ ను టార్గెట్ చేస్తున్న సందీప్ వంగా
గ్లోబల్ బాక్సాఫీస్ ను టార్గెట్ చేస్తున్న సందీప్ వంగా
ఇక జీమెయిల్‌ వాడేవారికి పండగలాంటి వార్త.. అదిరిపోయే గుడ్‌న్యూస్‌!
ఇక జీమెయిల్‌ వాడేవారికి పండగలాంటి వార్త.. అదిరిపోయే గుడ్‌న్యూస్‌!
జీమ్‌కు వెళ్లే ముందు ఈ కొన్ని చిట్కాలు పాటించండి..
జీమ్‌కు వెళ్లే ముందు ఈ కొన్ని చిట్కాలు పాటించండి..
పెళ్లైన 24 గంటలకే విడాకులు.. భర్త చెప్పిన సీక్రెట్‌తో షాకైన వధువు
పెళ్లైన 24 గంటలకే విడాకులు.. భర్త చెప్పిన సీక్రెట్‌తో షాకైన వధువు