GT vs CSK, IPL 2023 Final: సరికొత్త చరిత్ర సృష్టించిన చెన్నై సూపర్ కింగ్స్.. ఫైనల్ మ్యాచ్‌లో 13 ఆసక్తికర విషయాలు..

GT vs CSK: నెలన్నర రోజులుగా క్రికెట్‌ అభిమానులను అలరిస్తూ వస్తోన్న ఐపీఎల్‌ ఇప్పుడు ఫైనల్‌కు చేరుకుంది. ధనాధన్‌ లీగ్‌ ఫైనల్‌ మ్యాచ్‌కు కౌంట్‌ డౌన్‌ ప్రారంభమైంది. ఆదివారం జరిగే టైటిల్‌ పోరులో మాజీ ఛాంపియన్లు చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ తలపడనున్నాయి.

GT vs CSK, IPL 2023 Final: సరికొత్త చరిత్ర సృష్టించిన చెన్నై సూపర్ కింగ్స్.. ఫైనల్ మ్యాచ్‌లో 13 ఆసక్తికర విషయాలు..
Ipl 2023 Final, Gt Vs Csk
Follow us
Venkata Chari

|

Updated on: May 28, 2023 | 3:31 PM

నెలన్నర రోజులుగా క్రికెట్‌ అభిమానులను అలరిస్తూ వస్తోన్న ఐపీఎల్‌ ఇప్పుడు ఫైనల్‌కు చేరుకుంది. ధనాధన్‌ లీగ్‌ ఫైనల్‌ మ్యాచ్‌కు కౌంట్‌ డౌన్‌ ప్రారంభమైంది. ఆదివారం జరిగే టైటిల్‌ పోరులో మాజీ ఛాంపియన్లు చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ తలపడనున్నాయి. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. అయితే, ఈ మ్యాచ్‌కు చాలా ప్రత్యేకత నిలిచింది. అవేంటో ఇప్పుడు చూద్దాం..

1. మాజీ చాంపియన్‌ చెన్నై సూపర్‌ కింగ్స్‌తో.. డిఫెండింగ్‌ చాంపియన్‌ గుజరాత్‌ టైటాన్స్‌ అమీతుమీ తేల్చుకోనుంది.

2. అయితే, సీజన్‌ ఆరంభ మ్యాచ్‌లో తలపడిన ఈ రెండు జట్లే.. ఐపీఎల్ లీగ్‌ ముగింపు మ్యాచ్‌లోనూ తలపడనున్నాయి.

ఇవి కూడా చదవండి

3. కాగా, తొలి క్వాలిఫయర్ మ్యాచ్‌లోనూ ఈ రెండు జట్లే తలపడ్డాయి. మొత్తంగా ఆ లీగ్‌లో మూడో సారి ఇరుజట్లు పోటీ పడనున్నాయి.

4. తొలి మ్యాచ్‌లోనూ గుజరాత్, క్వాలిఫయర్ మ్యాచ్‌లో చెన్నైగెలిచాయి. ఇక మూడో మ్యాచ్‌లో ఎవరు గెలుస్తారో అనే ఆసక్తి నెలకొంది.

5. 10వ సారి ఐపీఎల్ ఫైనల్ చేరిన చెన్నై సూపర్ కింగ్స్ సరికొత్త రికార్డ్ నెలకొల్పింది.

6. ధోనీ సారథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ టీం ఇప్పటివరకు నాలుగు ఐపీఎల్ టైటిళ్లు గెలుచుకుంది.

7. ఐపీఎల్‌లో అడుగుపెట్టిన తొలి ఏడాదే కప్‌ కొట్టిన గుజరాత్ టీం కూడా రికార్డుల్లో నిలిచింది.

8. సాయంత్రం అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది.

9. నరేంద్ర మోడీ స్టేడియం పిచ్ బ్యాటర్లకు అనుకూలంగా ఉండనుంది.

10. ఈ స్టేడియంలో 5 సార్లు మొదట బ్యాటింగ్ చేసిన టీమ్స్ విజయం సాధించాయి.

11. శుభ్ మన్ గిల్ పై గుజరాత్ భారీ ఆశలు పెట్టుకుంది. ఇదే స్టేడియంలో రెండు వరుస సెంచరీలు చేసిన గిల్.. ఇంకో మ్యాచ్ లో 94 రన్స్ చేశాడు.

12. ఇప్పటివరకు లీగ్‌లో 4 సార్లు తలపడిన గుజరాత్, చెన్నై జట్లు. కాగా, 3 సార్లు గుజరాత్, ఒకసారి చెన్నై విజయం సాధించాయి.

13. అహ్మదాబాద్ స్టేడియం వేదికగా గుజరాత్ ఆడిన 9 మ్యాచుల్లో.. 6 మ్యాచుల్లో గుజరాత్ విజయం సాధించాయి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..