IPL 2023 Final, CSK vs GT: PSL మార్గంలో IPL.. చరిత్ర పునరావృతమైతే.. ధోనీ సేనకు షాకే.. ఎందుకంటే?

IPL 2023 మార్చి 31న ప్రారంభమైంది. టోర్నమెంట్‌లోని మొదటి లీగ్ మ్యాచ్ చెన్నై వర్సెస్ గుజరాత్ మధ్య జరిగింది. ఇప్పుడు ఫైనల్ మ్యాచ్‌లోనూ ఇరు జట్లే పోటీపడనున్నాయి.

IPL 2023 Final, CSK vs GT: PSL మార్గంలో IPL.. చరిత్ర పునరావృతమైతే.. ధోనీ సేనకు షాకే.. ఎందుకంటే?
Gt Vs Csk
Follow us
Venkata Chari

|

Updated on: May 28, 2023 | 2:59 PM

IPL 16వ సీజన్‌లో ఫైనల్ మ్యాచ్ ఈరోజు, ఆదివారం, మే 28, అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనుంది . ఈ మ్యాచ్‌కు ముందు, పాకిస్తాన్ సూపర్ లీగ్ 2023 (PSL) మార్గంలో IPL 2023 నడుస్తోందని తెలుస్తోంది. దీంతో ఇరు లీగ్‌లోనూ సేమ్ సీన్ రిపీట్ అవుతుందా అనిపిస్తోంది. అదేంటో ఇప్పుడు చూద్దాం.. IPL 16 మొదటి మ్యాచ్ గుజరాత్ వర్సెస్ చెన్నై మధ్య జరిగింది. ఫైనల్‌లో కూడా ఇరు జట్లు తలపడుతున్నాయి.పీఎస్‌ఎల్‌లో కూడా అదే జరిగింది.

PSL 2023 మొదటి లీగ్ మ్యాచ్ ముల్తాన్ సుల్తాన్స్ వర్సెస్ లాహోర్ ఖలందర్స్ మధ్య జరిగింది. టోర్నమెంట్ చివరి మ్యాచ్‌లో ముల్తాన్ సుల్తాన్స్ వర్సెస్ లాహోర్ ఖలందర్స్ మధ్యనే జరిగింది. టోర్నమెంట్‌లోని మొదటి మ్యాచ్‌లో లాహోర్ ఖలందర్స్ విజయం సాధించగా, షాహీన్ ఆఫ్రిది నేతృత్వంలోని లాహోర్ ఖలందర్స్ టైటిల్ మ్యాచ్‌ను కూడా గెలుచుకుంది. ఫైనల్లో కూడా లాహోర్ 1 పరుగు తేడాతో గెలుపొందగా, లీగ్ తొలి మ్యాచ్‌లో లాహోర్ ఒక పరుగుతో విజయం సాధించింది.

గుజరాత్ టైటాన్స్ గెలుస్తుందా?

అదే సమయంలో IPL 2023లో, గుజరాత్ వర్సెస్ చెన్నై జట్లు ముఖాముఖిగా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో పీఎస్‌ఎల్‌ గణాంకాలను పరిశీలిస్తే.. చరిత్రను పునరావృతం చేస్తూ గుజరాత్‌ టైటాన్స్‌ కూడా ఈసారి పీఎస్‌ఎల్‌ బాటలోనే ఐపీఎల్‌ విజేతగా నిలుస్తుందని అంచనా వేస్తున్నారు. ఎందుకంటే తొలి లీగ్‌లో గుజరాత్‌ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. టోర్నీ మ్యాచ్.. PSL ప్రకారం చూస్తే, ఫైనల్ మ్యాచ్‌లో కూడా గుజరాత్ 5 వికెట్ల తేడాతో గెలవగలదని అంటున్నారు.

ఇవి కూడా చదవండి

అయితే పీఎస్‌ఎల్‌, ఐపీఎల్‌ టోర్నీల్లో లీగ్‌ మ్యాచ్‌లు ఆడిన జట్లు ఫైనల్‌ ఆడడం యాదృచ్ఛికం. ఐపీఎల్ 2023 ఫైనల్‌లో ఏ జట్టు గెలుస్తుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

చెన్నై 10వసారి, గుజరాత్ రెండోసారి ఫైనల్ ఆడనున్నాయి..

ఐపీఎల్‌లో అత్యధిక ఫైనల్ మ్యాచ్‌లు ఆడిన జట్టుగా చెన్నై సూపర్ కింగ్స్ నిలిచింది. నేడు చెన్నై జట్టు ఐపీఎల్‌లో 10వ ఫైనల్‌ ఆడనుంది. కాగా, గుజరాత్ తన రెండో సీజన్‌లో వరుసగా రెండో ఫైనల్‌కు రంగంలోకి దిగనుంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..