ICC World Cup 2023: 45 మ్యాచ్‌లు.. 23 వేల పరుగులు.. 683 వికెట్లు.. లెక్కలు చూస్తే వావ్ అనాల్సిందే..
ICC World Cup 2023: వన్డే ప్రపంచ కప్‌లో ఇంకా మూడు మ్యాచ్‌లు జరగాల్సి ఉంది. ఇందులో 2 సెమీ ఫైనల్స్, ఒక ఫైనల్ మ్యాచ్ ఉన్నాయి. పటిష్టమైన జట్టుగా గుర్తింపు పొందిన టీమ్ ఇండియా, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్లు సెమీఫైనల్ దశలో తలపడేందుకు సిద్ధమయ్యాయి. ఈ నాలుగు జట్ల నుంచి రెండు టీంలు ఫైనల్ మ్యాచ్‌లో పోరాడనున్నాయి.

ICC World Cup 2023: ఈ వన్డే ప్రపంచకప్‌లో పరుగుల ప్రవాహం వెల్లువెత్తింది. లీగ్ లెవల్‌లో 45 మ్యాచ్‌ల్లో మొత్తం స్కోర్లే ఇందుకు నిదర్శనం. అంటే, ఈ ప్రపంచకప్‌లో లీగ్ దశలో మొత్తం 45 మ్యాచ్‌లు జరిగాయి. ఈసారి మొత్తం 10 టీమ్‌లు చేసిన పరుగుల సంఖ్య 23 వేలు దాటింది. ఐతే, ఈ ప్రపంచకప్ లీగ్ స్టేజ్ మ్యాచ్‌ల్లో సాధించిన పరుగులు, తీసిన వికెట్లు, తీసుకున్న క్యాచ్‌ల గురించి పూర్తి సమాచారాన్ని ఓసారి చూద్దాం..
మొత్తం పరుగులు: లీగ్ స్థాయిలో 45 మ్యాచ్‌లు ఆడిన 10 జట్లు 23002 పరుగులు వచ్చాయి.
సిక్సర్ల సంఖ్య: ఈ ప్రపంచకప్‌లో ఇప్పటివరకు 592 సిక్సర్లు కొట్టారు.
మొత్తం క్యాచ్‌లు: లీగ్ స్థాయి మ్యాచ్‌ల్లో మొత్తం క్యాచ్‌లు 429.
సెంచరీల సంఖ్య: ఈ ప్రపంచకప్‌లో ఇప్పటివరకు మొత్తం 35 సెంచరీలు నమోదయ్యాయి.
అర్ధశతకాల సంఖ్య: లీగ్ స్థాయిలో మొత్తం 113 అర్ధసెంచరీలు వచ్చాయి.
మొత్తం వికెట్లు: 45 మ్యాచ్‌ల నుంచి మొత్తం 683 వికెట్లు తీశారు.
జీరో ఔట్: 45 మ్యాచ్‌ల్లో బ్యాట్స్‌మెన్స్ మొత్తం 56 సార్లు జీరోకి అవుట్ అయ్యారు.
మెయిడెన్ ఓవర్: లీగ్ స్థాయిలో మొత్తం 137 మెయిడెన్ ఓవర్లు వేయబడ్డాయి.
ఫోర్ల సంఖ్య: 45 మ్యాచ్‌ల నుండి మొత్తం ఫోర్ల సంఖ్య 2109.
3 మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి..
వన్డే ప్రపంచకప్‌లో ఇంకా మూడు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఇందులో 2 సెమీ ఫైనల్స్, ఒక ఫైనల్ మ్యాచ్ ఉన్నాయి. పటిష్టమైన జట్టుగా గుర్తింపు పొందిన టీమ్ ఇండియా, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్లు సెమీఫైనల్ దశలో తలపడుతున్నాయి. అందువల్ల ప్రపంచ కప్ ముగిసే సమయానికి, ఈ గణాంకాలలో మరింత మార్పు ఉంటుంది.
వన్డే ప్రపంచ కప్ సెమీ ఫైనల్ షెడ్యూల్:
View this post on Instagram
మొదటి సెమీ-ఫైనల్: నవంబర్ 15 (బుధవారం) – భారత్ vs న్యూజిలాండ్ ( వాంఖడే స్టేడియం, ముంబై)
రెండవ సెమీ-ఫైనల్: నవంబర్ 16 (గురువారం) – దక్షిణాఫ్రికా vs ఆస్ట్రేలియా (ఈడెన్ గార్డెన్స్ స్టేడియం, కోల్‌కతా)
ఫైనల్ మ్యాచ్ : నవంబర్ 19 (ఆదివారం) – నరేంద్ర మోడీ స్టేడియం, అహ్మదాబాద్.
View this post on Instagram
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
