- Telugu News Photo Gallery Cricket photos Cricket Australia Announced Team Of Tournament Virat Kohli Selected As Captain in ICC World Cup 2023
CWC 2023: వన్డే ప్రపంచకప్‌లో ‘టీమ్ ఆఫ్ ద టోర్నీ’ ఇదే.. రోహిత్ శర్మకు షాకిచ్చిన క్రికెట్ ఆస్ట్రేలియా.. ఎందుకంటే?
ICC World Cup 2023 Team Of Tournament: ప్రపంచకప్‌లో అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా నిలిచిన రోహిత్ శర్మకు మాత్రం జట్టులో అవకాశం దక్కలేకపోవడం గమనార్హం. క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించిన జట్టులో ఏ దేశానికి చెందిన ఆటగాడు చోటు దక్కించుకున్నాడో ఇప్పుడు చూద్దాం.. ఎంపిక చేసిన 12 మంది సభ్యుల జట్టుకు కెప్టెన్సీని విరాట్ కోహ్లికి అందించింది. టీమ్ ఇండియా నుంచి కోహ్లితో పాటు మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా కూడా జట్టులో ఉన్నారు.
Updated on: Nov 13, 2023 | 4:59 PM

వన్డే ప్రపంచకప్‌లో లీగ్ దశ ముగిసింది. బుధవారం నుంచి సెమీఫైనల్ రౌండ్ ప్రారంభం కానుంది. కాగా, క్రికెట్ ఆస్ట్రేలియా 'టీమ్ ఆఫ్ ద టోర్నీ'ని ఎంపిక చేసింది. 12 మంది ఆటగాళ్లతో కూడిన ఈ జట్టులో భారతీయులే ఎక్కువ ఆధిపత్యం చెలాయించారు.

ఎంపిక చేసిన 12 మంది సభ్యుల జట్టుకు కెప్టెన్సీ విరాట్ కోహ్లికి అందించింది. టీమ్ ఇండియా నుంచి కోహ్లితో పాటు మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా కూడా జట్టులో ఉన్నారు.

కానీ, ఈ ప్రపంచకప్‌లో అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా నిలిచిన రోహిత్ శర్మకు మాత్రం జట్టులో అవకాశం దక్కలేకపోవడం గమనార్హం. క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించిన జట్టులో ఏ దేశానికి చెందిన ఆటగాడు చోటు దక్కించుకున్నాడో ఇప్పుడు చూద్దాం..

క్వింటన్ డి కాక్ (దక్షిణాఫ్రికా): ఆఫ్రికా ఓపెనర్ ఆడిన 9 మ్యాచ్‌ల్లో 65.67 సగటుతో 591 పరుగులు చేశాడు. టోర్నీలో 4 సెంచరీలు చేసిన డి కాక్‌కు తొలి స్థానం లభించింది.

డేవిడ్ వార్నర్ (ఆస్ట్రేలియా): మరో ఓపెనర్, ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ డేవిడ్ వార్నర్ ఆడిన 9 మ్యాచ్‌ల్లో 55.44 సగటుతో 499 పరుగులు చేశాడు. ఇందులో 2 సెంచరీలు, 2 అర్ధసెంచరీలు ఉన్నాయి.

రచిన్ రవీంద్ర (న్యూజిలాండ్): యువ బ్యాట్స్‌మెన్ రచిన్ రవీంద్ర మూడో నంబర్‌లో బ్యాటింగ్ చేయడానికి చోటు దక్కించుకున్నాడు. కివీ స్టార్ 9 మ్యాచ్‌ల్లో 3 సెంచరీలు, 2 అర్ధసెంచరీలతో 565 పరుగులు చేశాడు. బౌలింగ్‌లోనూ 5 వికెట్లు తీశాడు.

విరాట్ కోహ్లీ (భారత్): కింగ్ కోహ్లీని కెప్టెన్‌గా ఎంచుకంది. ఈ టోర్నీలో విరాట్ కోహ్లీ 99.00 సగటుతో 594 పరుగులు చేశాడు. ఇందులో 2 సెంచరీలు, 5 అర్ధసెంచరీలు ఉన్నాయి.

ఐడెన్ మార్క్రామ్ (దక్షిణాఫ్రికా): మిడిలార్డర్‌లో ఓపెనర్‌గా బరిలోకి దిగిన ఈ ఆఫ్రికన్ స్టార్ ఒక సెంచరీ, 3 అర్ధసెంచరీలతో 49.50 సగటుతో 396 పరుగులు చేశాడు.

గ్లెన్ మాక్స్‌వెల్ (ఆస్ట్రేలియా): బ్యాటింగ్ ఆల్‌రౌండర్ కోటాలో ఉన్న మ్యాక్స్‌వెల్ 7 మ్యాచ్‌ల్లో 1 డబుల్ సెంచరీతో సహా 397 పరుగులు చేశాడు. బౌలింగ్‌లోనూ 5 వికెట్లు తీశాడు.

మార్కో జాన్సెన్ (దక్షిణాఫ్రికా): బౌలింగ్ ఆల్ రౌండర్ 8 మ్యాచ్‌ల్లో హాఫ్ సెంచరీతో సహా 157 పరుగులు చేశాడు. బౌలింగ్‌లో 6.40 ఎకానమీ రేటుతో 17 వికెట్లు పడగొట్టాడు.

రవీంద్ర జడేజా (భారత్): భారత స్టార్ ఆల్ రౌండర్ 9 మ్యాచ్‌ల్లో 111 పరుగులు చేసి 3.96 ఎకానమీ రేటుతో 16 వికెట్లు పడగొట్టాడు.

మహ్మద్ షమీ (భారత్): ఈ ప్రపంచకప్‌లో షమీ కేవలం 5 మ్యాచ్‌ల్లో 4.78 ఎకానమీ రేటుతో 16 వికెట్లు పడగొట్టాడు. అలాగే ఈ టోర్నీలో రెండు సార్లు 5 వికెట్లు తీశాడు.

ఆడమ్ జంపా (ఆస్ట్రేలియా): ఆసీస్ స్పిన్నర్ జంపా ఆడిన 9 మ్యాచ్‌ల్లో 22 వికెట్లు పడగొట్టాడు.

జస్ప్రీత్ బుమ్రా (భారత్): యార్కర్ కింగ్ బుమ్రా 17 వికెట్లు పడగొట్టాడు. ఈ టోర్నీలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లలో ఒకడిగా నిలిచాడు.

దిల్షాన్ మధుశంక (శ్రీలంక): 12వ మ్యాన్ ఆఫ్ ద టోర్నీగా ఎంపికైన దిల్షాన్.. ఆడిన 9 మ్యాచ్‌ల్లో 21 వికెట్లు పడగొట్టాడు.




