- Telugu News Photo Gallery Cricket photos IND Playing XI Vs NZ One Change In India Playing XI Vs New Zealand For The ICC ODI Semi Final 1 in telugu news
IND vs NZ, ICC World Cup Semi Final: సెమీ-ఫైనల్‌లో కీలక మార్పుతో బరిలోకి రోహిత్ సేన.. రంగంలోకి కివీస్‌ను మడతపెట్టే ప్లేయర్..
India Playing XI vs New Zealand, ICC ODI World Cup 2023 Semi Final 1: ICC ODI ప్రపంచ కప్ 2023 మొదటి సెమీ-ఫైనల్ మ్యాచ్‌లో భారత్ బుధవారం న్యూజిలాండ్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో టీమ్ ఇండియాలో ఒక మార్పు ఉంటుందని భావిస్తున్నారు. కివీస్‌పై కొత్త ఆటగాడు బరిలోకి దిగవచ్చు. ఎందుకంటే కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో అంతగా ఆకట్టుకోలేకపోతున్నాడు. దీంతో మార్పు చేయాలని చూస్తున్నారు. టీమిండియా ప్లేయింగ్ 11 ఎలా ఉండనుందో ఓసారి చూద్దాం..
Updated on: Nov 14, 2023 | 4:07 PM

ICC ODI ప్రపంచ కప్ 2023 కోసం భారత క్రికెట్ జట్టుకు నిజమైన పరీక్ష ప్రారంభమైంది. ఎందుకంటే ఇప్పటి వరకు గ్రూప్ దశలో 9 మ్యాచ్‌లలో తొమ్మిది విజయాలు సాధించింది. 2023 ప్రపంచకప్ తొలి సెమీఫైనల్‌లో భారత్, న్యూజిలాండ్ బుధవారం తలపడనున్నాయి.

ఇది భారత్‌కు ప్రతీకార మ్యాచ్ అని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే 2019 ప్రపంచకప్ సెమీఫైనల్‌లో కివీస్‌తో భారత్ ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఇప్పుడు మరోసారి సెమీస్‌లో తలపడేందుకు ఇరు జట్లు సిద్ధమయ్యాయి. వాంఖడే స్టేడియంలో రోహిత్ సేన ఎలా రాణిస్తుందో చూడాలి.

ప్రస్తుత ప్రపంచకప్‌లో భారత్ అత్యంత బలమైన జట్టు. గ్రూప్ దశలో మెన్ ఇన్ బ్లూ అజేయంగా నిలిచారు. అన్ని మ్యాచ్‌ల్లోనూ తేలిగ్గా గెలిచింది. జట్టులో కొన్ని మార్పులు చేశారు. అయితే, ఇప్పుడు సెమీస్ పోరులో మార్పు వస్తుందని భావిస్తున్నారు.

రోహిత్ శర్మ, రాహుల్ ద్రవిడ్ ప్లేయింగ్ XIలో మార్పులు చేసే అవకాశం ఉంది. ప్రత్యర్థి జట్టును నిలువరించేందుకు ప్రయోగాలు చేయవచ్చు అని తెలుస్తోంది. ఎందుకంటే ఈ ప్రపంచకప్‌లో భారత్‌తో న్యూజిలాండ్ ఒకసారి తలపడింది. అందుకే బౌలింగ్ విభాగంలో కొత్త ఆటగాడిని చేర్చవచ్చని తెలుస్తోంది.

ప్రపంచకప్ ఆరంభంలో స్పిన్‌తో చావుదెబ్బ కొట్టిన కుల్దీప్ యాదవ్.. ఇప్పుడు డమ్మీలా కనిపిస్తున్నాడు. కాబట్టి రవిచంద్రన్ అశ్విన్‌ను ఆ స్థానంలోకి తీసుకురావడానికి భారత్ ప్లాన్ చేయవచ్చు. అలాగే అశ్విన్ ప్లేయింగ్ ఎలెవన్‌కి వస్తే స్పిన్‌తో బ్యాటింగ్‌లో కూడా రాణించగలడు.

జట్టులో ఇతర మార్పులు జరిగే అవకాశం లేదు. టీ20 ఫార్మాట్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ జట్టుకు అద్భుత ఆరంభాన్ని అందిస్తున్నారు. గిల్ ఇంకా బ్యాట్‌తో సెంచరీ చేయకపోవడం బాధాకరం. కివీస్‌పై ఎవరు భారీ స్కోరు చేస్తారో చూడాలి.

ప్రస్తుతం అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో అగ్రస్థానంలో ఉన్న విరాట్ కోహ్లీపైనే అందరి దృష్టి ఉంది. శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ ఇద్దరూ నెదర్లాండ్స్‌పై సెంచరీలు సాధించి అద్భుత ఫామ్‌లో ఉన్నారు. సూర్యకుమార్‌కు అవకాశం తక్కువ అవకాశాలు వస్తున్నాయి. వీలైనప్పుడల్లా జట్టుకు సహాయం చేస్తున్నాడు.

ఫినిషర్ బాధ్యతలను రవీంద్ర జడేజా తెలివిగా నిర్వహిస్తున్నాడు. రవిచంద్రన్ అశ్విన్ వస్తే బ్యాటింగ్ డెప్త్ పెరుగుతుంది. పేసర్లుగా, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, మహ్మద్ షమీ స్వింగ్, పేస్‌తో దుమ్ము రేపుతున్నాడు.

న్యూజిలాండ్‌తో జరిగే మ్యాచ్‌లో భారత్ ప్లేయింగ్ ఎలెవన్: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, మహ్మద్ షమీ.





























