ICC World Cup 2023: అసలు స్టోక్స్‌కు ఏమైంది? ప్రాక్టీస్‌లో ఇన్ హేలర్‌తో స్టార్ ఆల్‌రౌండర్.. ఫ్యాన్స్‌లో ఆందోళన
ప్రపంచ కప్ కోసమే రిటైర్మెంట్‌ను వెనక్కు తీసుకుని మళ్లీ ఇండియా వచ్చాడు ఇంగ్లిష్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ . అయితే అనారోగ్య కారణాలతో మొదటి మూడు మ్యాచ్‌లకు దూరంగా ఉన్నాడు. నాలుగో మ్యాచ్‌లో బరిలోకి దిగినప్పటికీ పెద్దగా పరుగులేమీ చేయకుండానే పెవిలియన్ చేరుకున్నాడు. అయితే ఈ స్టార్ ఆల్‌రౌండర్ ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన చెందుతున్నారు. దీనికి కారణం నెట్ ప్రాక్టీస్‌లో అతను ఇన్‌హేలర్ తీసుకుంటూ కనిపించడమే

వన్డే ప్రపంచకప్‌లో డిపెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన ఇంగ్లండ్ అందుకు తగ్గ ఆటతీరును ప్రదర్శించడం లేదు. ఇప్పటివరకు ఆడిన నాలుగు మ్యాచుల్లో ఆ జట్టు కేవలం ఒకదాంట్లో మాత్రమే విజయం సాధించింది. దీంతో ఆ జట్టు సెమీఫైనల్ అవకాశాలు సంక్లిష్టంగా మారాయి. ఇప్పుడు ఐదో మ్యాచ్‌లో భాగంగా బెంగళూరు వేదికగా శ్రీలంక జట్టుతో ఇంగ్లిష్ టీమ్ తలపడుతోంది. ఇందులో ఓడిపతే ఇంగ్లండ్ జట్టు ఇంటి బాట పట్టక తప్పదు. ఇదిలా ఉంటే -. ప్రస్తుతం ఈ ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది? అసలు బెన్ స్టోక్స్‌కు ఏమైంది? అతని ఆరోగ్య పరిస్థితిపై అప్‌డేట్ ఇవ్వండంటూ క్రికెట్ ఫ్యాన్స్ పోస్టులు పెడుతున్నారు. అయితే వైద్య నిపుణులు సూచించిన ప్రకారమే ప్రాక్టీసులో స్టోక్స్ ఇన్ హేలర్ తీసుకుంటున్నాడని, అతని ఆరోగ్యం బాగానే ఉందంటోంది ఇంగ్లండ్ క్రికెట్ టీమ్ మేనేజ్ మెంట్.
కాగా గాయం నుంచి కోలుకోవడంతో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో బరిలోకి దిగాడు స్టోక్స్. అయితే కేవలం 5 పరుగులకే వెనుదిరగాల్సి వచ్చింది. ఇక శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లోనూ ఇంగ్లండ్ జట్టు ఆటతీరులోనూ మార్పు రాలేదు. శ్రీలంక బౌలర్ల ధాటికి కేవలం 33. 2 ఓవర్లలో 156 పరుగులకే కుప్ప కూలింది. ఈ మ్యాచ్‌లో బెన్ స్టోక్స్ (73 బంతుల్లో 43, 6 ఫోర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. జానీ బెయిర్ స్టో (30), డేవిడ్ మలాన్ (28) మాత్రమే ఓ మోస్తరుగా రాణించారు. రూట్ (3), జోస్ బట్లర్ ( 8), లియామ్ లివింగ్ స్టోన్ (1), మొయిన్ అలీ (15) తీవ్రంగా నిరాశపర్చారు. శ్రీలంక బౌలర్లలో లహిరు కుమార 3 వికెట్లు తీసుకోగా, ఏంజెలో మాథ్యూస్, రజిత తలా రెండు వికెట్లు పడగొట్టారు.
ఇంగ్లాండ్ ప్లేయింగ్ XI
జోస్ బట్లర్ (కెప్టెన్ & వికెట్ కీపర్), జానీ బెయిర్‌స్టో, డేవిడ్ మలన్, జో రూట్, బెన్ స్టోక్స్, లియామ్ లివింగ్‌స్టోన్, మొయిన్ అలీ, క్రిస్ వోక్స్, డేవిడ్ వీలీ, ఆదిల్ రషీద్ మరియు మార్క్ వుడ్.
శ్రీలంక ప్లేయింగ్ XI
కుసాల్ మెండిస్ (కెప్టెన్ మరియు వికెట్ కీపర్), పాతుమ్ నిసంక, కుసల్ పెరీరా, సదీర సమరవిక్రమ, చరిత్ అస్లంక, ధనంజయ డి సిల్వా, ఏంజెలో మాథ్యూస్, మహిష్ తిక్షణ, కసున్ రజిత, లహిరు కుమార మరియు దిల్షాన్ మధుశంక.
మారని ఇంగ్లండ్ .. బెన్ స్టోక్స్ టాప్ స్కోరర్..
View this post on Instagram
కుప్పకూలిన ఇంగ్లండ్..
View this post on Instagram
మరిన్నిక్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




