- Telugu News Photo Gallery Cricket photos Know Fastest Centuries In ODI Cricket Top 5 List after Glenn Maxwell scored fastest Hundred in ICC World Cup
ICC World Cup 2023: వన్డేల్లో సూపర్ ఫాస్టెస్ట్ సెంచరీలు.. టాప్ 5 లో ఎవరున్నారంటే?
వన్డే ప్రపంచకప్‌లో మ్యాక్స్‌వెల్ మెరుపు సెంచరీతో అదరగొట్టాడు. కేవలం 40 బంతుల్లోనే 8 అద్భుతమైన సిక్సర్లు, 9 ఫోర్లతో సెంచరీ పూర్తి చేశాడు. తద్వారా ప్రపంచకప్ చరిత్రలోనే అత్యంత వేగవంతమైన సెంచరీ నమోదు చేసిన ఆటగాడిగా మ్యాక్స్‌వెల్ రికార్డుల కెక్కాడు. కాగా వన్డేల్లో అత్యంత వేగంగా సెంచరీ కొట్టిన రికార్డు మాత్రం...
Updated on: Oct 26, 2023 | 3:56 PM

వన్డే ప్రపంచకప్‌లో మ్యాక్స్‌వెల్ మెరుపు సెంచరీతో అదరగొట్టాడు. కేవలం 40 బంతుల్లోనే 8 అద్భుతమైన సిక్సర్లు, 9 ఫోర్లతో సెంచరీ పూర్తి చేశాడు. తద్వారా ప్రపంచకప్ చరిత్రలోనే అత్యంత వేగవంతమైన సెంచరీ నమోదు చేసిన ఆటగాడిగా మ్యాక్స్‌వెల్ రికార్డుల కెక్కాడు. కాగా వన్డేల్లో అత్యంత వేగంగా సెంచరీ కొట్టిన రికార్డు మిస్టర్ 360 ప్లేయర్ ఏబీ డివిలియర్స్ పేరిట ఉంది.

2015లో వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా ఆటగాడు ఏబీ డివిలియర్స్ కేవలం 31 బంతుల్లోనే సెంచరీ సాధించాడు. వన్డే క్రికెట్ చరిత్రలో ఇదే అత్యంత వేగవంతమైన సెంచరీ.ఈ మ్యాచ్‌లో ఓవరాల్‌గా 44 బంతుల్లో 149 పరుగులు చేశాడు ఏబీడీ. ఇందులో 16 సిక్సర్లు, 9 ఫోర్లు ఉన్నాయి.

కోరీ అండర్సన్ (న్యూజిలాండ్): 2014లో వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్ లెఫ్ట్ హ్యాండర్ కోరీ అండర్సన్ కేవలం 36 బంతుల్లోనే సెంచరీ సాధించాడు. వన్డే క్రికెట్‌లో ఇది 2వ వేగవంతమైన సెంచరీ. మొత్తం 131 పరుగుల్లో 14 సిక్సర్లు, 6 పోర్లు ఉన్నాయి.

షాహిద్ అఫ్రిది (పాకిస్థాన్): 1996లో శ్రీలంకతో జరిగిన ఓ వన్డే మ్యాచ్‌లో పాకిస్థాన్ హార్డ్ హిట్టర్ షాహిద్ అఫ్రిది కేవలం 37 బంతుల్లోనే మూడంకెల స్కోరును అందుకున్నాడు. చాలా రోజుల వరకు ఈ రికార్డు బద్దలు కాలేదు. ఇతని ఇన్నింగ్స్ లో 11 సిక్సర్లు, 6 ఫోర్లు ఉన్నాయి.

ఇక తాజాగా ఢిల్లీ వేదికగా నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కేవలం 40 బంతుల్లోనే శతకాన్ని అందుకున్నాడు మ్యాక్స్‌వెల్. తద్వారా ప్రపంచకప్‌లో అత్యంత వేగంగా సెంచరీ కొట్టిన ప్లేయర్‌గా, ఓవరాల్‌గా వన్డేల్లో నాలుగో స్థానాన్ని ఆక్రమించుకున్నాడు.

మార్చి 16, 2023న కీర్తిపూర్‌లో నేపాల్‌తో జరిగిన ఉత్కంఠభరితమైన మ్యాచ్‌లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌కు చెందిన ఆసిఫ్ ఖాన్ కేవలం 41 బంతుల్లోనే సెంచరీ సాధించాడు. తద్వారా ఈ జాబితాలో ఆరో స్థానంలో నిలిచాడు. ఈ మెరుపు సెంచరీలో11 సిక్సర్లు, 4 ఫోర్లు ఉన్నాయి.




