సెంచరీ కొట్టి… ఆపై అంపైర్‌ని పడగొట్టి…!
ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న ఐసీసీ వరల్డ్ కప్ 2019 టోర్నీలో ఓ కామెడీ సన్నివేశం చోటు చేసుకుంది. బంగ్లాదేశ్‌తో కార్డిఫ్ వేదికగా శనివారం జరుగుతున్న మ్యాచ్‌లో మెరుపు శతకం బాదిన ఇంగ్లాండ్ ఓపెనర్ జేసన్ రాయ్ (153: 121 బంతుల్లో 14×4, 5×6) ఏమరపాటులో ఫీల్డ్ అంపైర్ జోయల్ విల్సన్‌ని ఢీకొట్టేశాడు. దీంతో.. అంపైర్ కిందపడిపోగా.. వెంటనే జేసన్ రాయ్ అతడ్ని పైకిలేపాడు. అంపైర్‌కి ఎలాంటి గాయాలు కాకపోవడంతో.. మ్యాచ్ తిరిగి ప్రారంభమైంది. అసలు ఏం జరిగిందంటే..? […]
ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న ఐసీసీ వరల్డ్ కప్ 2019 టోర్నీలో ఓ కామెడీ సన్నివేశం చోటు చేసుకుంది. బంగ్లాదేశ్‌తో కార్డిఫ్ వేదికగా శనివారం జరుగుతున్న మ్యాచ్‌లో మెరుపు శతకం బాదిన ఇంగ్లాండ్ ఓపెనర్ జేసన్ రాయ్ (153: 121 బంతుల్లో 14×4, 5×6) ఏమరపాటులో ఫీల్డ్ అంపైర్ జోయల్ విల్సన్‌ని ఢీకొట్టేశాడు. దీంతో.. అంపైర్ కిందపడిపోగా.. వెంటనే జేసన్ రాయ్ అతడ్ని పైకిలేపాడు. అంపైర్‌కి ఎలాంటి గాయాలు కాకపోవడంతో.. మ్యాచ్ తిరిగి ప్రారంభమైంది.
అసలు ఏం జరిగిందంటే..? జేసన్ రాయ్ తన వ్యక్తిగత స్కోరు 96 వద్ద ముస్తాఫిజుర్ బౌలింగ్‌లో బంతిని డీప్ స్వేర్ లెగ్ దిశగా హిట్ చేశాడు. అయితే.. అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న బంగ్లాదేశ్ ఫీల్డర్ సైపుద్ధీన్ తత్తరపాటులో మిస్ ఫీల్డింగ్ చేయడంతో.. బంతి నేరుగా వెళ్లి బౌండరీ లైన్‌ని తాకింది. మరోవైపు బంతిని హిట్ చేసిన జేసన్ రాయ్.. దాన్ని చూస్తూ నాన్‌స్ట్రైక్ ఎండ్‌వైపు పరుగెత్తాడు. ఫీల్డ్ అంపైర్ జోయల్ విల్సన్ కూడా ఆ బంతిని చూస్తూ.. వికెట్ల నుంచి పక్కకి జరిగేందుకు ప్రయత్నిస్తుండగా.. జేసన్ రాయ్ అతడ్ని వేగంగా వచ్చి ఢీకొన్నాడు. దీంతో.. జోయల్ విల్సన్ నేలపై పడిపోతుండగా.. ఆఖరి క్షణంలో రాయ్ అతడ్ని పట్టుకునేందుకు ట్రై చేశాడు. కానీ లాభం లేకపోయింది. అంపైర్‌ని పైకి లేవదీసిన తర్వాత.. జేసన్ రాయ్.. తన సెంచరీ సంబరాలు చేసుకున్నాడు.