లోగోలు, గ్లోవ్స్ కాదు..ఆటను క్లీన్‌గా నడిపించండి

ఢిల్లీ: ప్రపంచకప్‌లో ఐసీసీ ఆటగాళ్ల వ్యక్తిగత విషయాలపై కాకుండా ఆటపై పూర్తిస్థాయిలో దృష్టి సారించాలని ఇండియా మాజీ క్రికెటర్‌, బీజేపీ నేత గౌతం గంభీర్‌ సూచించాడు. దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌లో భారత వికెట్‌కీపర్‌ ధోనీ తన గ్లోవ్స్‌పై సైనిక అధికారిక చిహ్నాం ‘బలిదాన్‌’ ధరించడం పట్ల ఐసీసీ అభ్యంతరం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ధోనీకి మద్దతుగా బీసీసీఐని నిలిచినా.. నిబంధనల ప్రకారం ఇది విరుద్దమని రానున్న మ్యాచ్‌ల్లో ధోనీ బలిదాన్‌ గుర్తును వినియోగించరాదంటూ ఐసీసీ తేల్చి చెప్పింది. […]

లోగోలు, గ్లోవ్స్ కాదు..ఆటను క్లీన్‌గా నడిపించండి
Follow us

|

Updated on: Jun 08, 2019 | 7:45 PM

ఢిల్లీ: ప్రపంచకప్‌లో ఐసీసీ ఆటగాళ్ల వ్యక్తిగత విషయాలపై కాకుండా ఆటపై పూర్తిస్థాయిలో దృష్టి సారించాలని ఇండియా మాజీ క్రికెటర్‌, బీజేపీ నేత గౌతం గంభీర్‌ సూచించాడు. దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌లో భారత వికెట్‌కీపర్‌ ధోనీ తన గ్లోవ్స్‌పై సైనిక అధికారిక చిహ్నాం ‘బలిదాన్‌’ ధరించడం పట్ల ఐసీసీ అభ్యంతరం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ధోనీకి మద్దతుగా బీసీసీఐని నిలిచినా.. నిబంధనల ప్రకారం ఇది విరుద్దమని రానున్న మ్యాచ్‌ల్లో ధోనీ బలిదాన్‌ గుర్తును వినియోగించరాదంటూ ఐసీసీ తేల్చి చెప్పింది. దీనిపై తాజాగా మాజీ క్రికెటర్‌ గంభీర్‌ స్పందించాడు.

‘క్రికెట్‌ను సరైన క్రమంలో ఆడించడమే ఐసీసీ పని. అంతేకానీ ఆటగాళ్లు తమ గ్లోవ్స్‌పై ఎలాంటివి ధరించారు. లోగోలు ఉన్నాయా? లేవా? అనే విషయాలు మాత్రం కాదు.’ అని గంభీర్‌ పేర్కొన్నాడు. అదేవిధంగా ప్రస్తుతం ప్రపంచకప్‌లో ఇంగ్లాండ్‌ పిచ్‌ల విషయంలో ఐసీసీ ప్రత్యేకంగా దృష్టి సారించాలని సూచించాడు. ‘300-400 పరుగులు వచ్చే పిచ్‌లు కాకుండా బౌలర్లకు అనుకూలమైన పిచ్‌లు రూపొందించాలి. బ్యాట్స్‌మెన్ విషయంలో పరిస్థితులకు అనుగుణంగా పిచ్‌లు తయారు చేయాలి. అంతేకానీ లోగోలు వంటి విషయాలకు అనవసరపు ప్రాధాన్యతనివ్వడం సరైన అంశం కాదు.’ అని గంభీర్‌ అభిప్రాయం వ్యక్తం చేశాడు.