ICC Rankings : వచ్చిన మూడేళ్లకే సీనియర్లకు చుక్కలు చూపించాడు.. ర్యాంకింగ్స్‌లో టాప్ ప్లేస్ కొట్టేశాడు
ఐసీసీ టెస్ట్ బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో సంచలనం చోటు చేసుకుంది. ఇంగ్లాండ్ యువ బ్యాట్స్‌మెన్ హ్యారీ బ్రూక్ నంబర్ వన్ స్థానానికి చేరుకుని జో రూట్‌ను అధిగమించాడు. అతని టెస్ట్ రికార్డులు, ఎడ్జ్‌బాస్టన్ ప్రదర్శన అద్భుతం. లార్డ్స్ టెస్ట్‌కు ముందు ఇది భారత్‌కు ఒక హెచ్చరికలా మారింది.

ICC Rankings : భారత్, ఇంగ్లాండ్ మధ్య ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ఉత్కంఠగా సాగుతోంది. రెండు మ్యాచ్‌ల తర్వాత సిరీస్ 1-1తో సమంగా ఉంది. ఈ సిరీస్‌లో భారత్, ఇంగ్లాండ్ జట్ల నుంచి భారీగా పరుగులు వస్తున్నాయి. భారత కెప్టెన్ శుభమన్ గిల్, రిషబ్ పంత్, కేఎల్ రాహుల్‌తో పాటు ఇంగ్లాండ్ యువ బ్యాట్స్‌మెన్ హ్యారీ బ్రూక్, జామీ స్మిత్ కూడా అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్నారు. ఈ సిరీస్‌లో ఇరు జట్ల నుంచి చాలా మంది ఆటగాళ్లు సెంచరీలు సాధించారు. ఐసీసీ టెస్ట్ బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో ఇంగ్లాండ్ దిగ్గజ బ్యాట్స్‌మెన్ జో రూట్ చాలా కాలంగా నంబర్ వన్ స్థానంలో కొనసాగుతున్నాడు. అయితే, ఇప్పుడు ఒక యంగ్ ప్లేయర్ ఎడ్జ్‌బాస్టన్ టెస్ట్‌లో భారీగా పరుగులు చేసి జో రూట్‌ను వెనక్కి నెట్టి అగ్రస్థానానికి చేరుకున్నాడు.
ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్ హ్యారీ బ్రూక్ ఐసీసీ తాజా టెస్ట్ ర్యాంకింగ్స్‌లో నంబర్ వన్ స్థానానికి చేరుకున్నాడు. అతను తన తోటి ఆటగాడు జో రూట్‌ను అధిగమించాడు. మొదటి టెస్ట్‌లో బ్రూక్ 99 పరుగుల వద్ద ఔట్ అయి సెంచరీ చేసే అవకాశం కోల్పోయాడు. అయితే, రెండో టెస్ట్‌లో బ్రూక్ 158 పరుగుల అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. హ్యారీ బ్రూక్ ఈ అద్భుతమైన ప్రదర్శన కారణంగానే అతను ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో నంబర్ వన్ బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు.
Harry Brook reclaims the 🔝 spot in the latest ICC Test batter rankings after his spirited knock against India 👏
More ➡️ https://t.co/Df4PDR7PNf pic.twitter.com/ZxZnEazGXR
— ICC (@ICC) July 9, 2025
హ్యారీ బ్రూక్ టెస్ట్ రికార్డు
హ్యారీ బ్రూక్ 2022 నుంచి టెస్ట్ క్రికెట్ ఆడుతున్నాడు. ఈ యువ ఆటగాడు తన కెరీర్ ప్రారంభించిన కేవలం మూడు సంవత్సరాలలోనే ఈ ఘనతను సాధించాడు. బ్రూక్ తన కెరీర్‌లో ఇప్పటివరకు 27 టెస్ట్ మ్యాచ్‌లు ఆడాడు. వాటిలోని 45 ఇన్నింగ్స్‌లలో 2619 పరుగులు సాధించాడు. బ్రూక్ టెస్ట్‌లో 59.5 సగటుతో పరుగులు చేస్తున్నాడు. తన మూడేళ్ల కెరీర్‌లో ఈ ఆటగాడు 317 పరుగుల అత్యుత్తమ వ్యక్తిగత స్కోర్‌ను కూడా నమోదు చేశాడు.
మరిన్ని క్రికెట్ న్యూస్ కోసం ఇక్కడ చేయండి..




