AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jofra Archer : 1596 రోజుల తర్వాత బరిలోకి దిగుతున్న ఇంగ్లాండ్ పేసర్.. భారత్ కు దబిడిదిబిడి తప్పదా

జోఫ్రా ఆర్చర్ 1596 రోజుల తర్వాత టెస్ట్ క్రికెట్‌లోకి తిరిగి రావడంతో ఇంగ్లాండ్ తమ లార్డ్స్ టెస్ట్ ప్లేయింగ్ ఎలెవన్‌ను ప్రకటించింది. ఈ మ్యాచ్ జూలై 10 నుంచి ప్రారంభం కానుంది. పేసర్‌లకు అనుకూలమైన పిచ్‌పై ఆర్చర్, బుమ్రా మధ్య పోరు ఉత్కంఠగా మారనుంది.

Jofra Archer : 1596 రోజుల తర్వాత బరిలోకి దిగుతున్న ఇంగ్లాండ్ పేసర్.. భారత్ కు దబిడిదిబిడి తప్పదా
Jofra Archer
Rakesh
|

Updated on: Jul 09, 2025 | 5:23 PM

Share

Jofra Archer : భారత్, ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో మూడో టెస్ట్ మ్యాచ్ జూలై 10 నుంచి లండన్‌లోని చారిత్రాత్మక లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్‌లో జరగనుంది. ఈ టెస్ట్ మ్యాచ్‌కు ఒక రోజు ముందే ఇంగ్లాండ్ తమ ప్లేయింగ్ ఎలెవన్‌ను ప్రకటించింది. ఇందులో చాలా కాలం తర్వాత స్టార్ పేసర్ జోఫ్రా ఆర్చర్ టెస్ట్ జట్టులోకి తిరిగి వచ్చాడు. ఆర్చర్ దాదాపు 1596 రోజుల తర్వాత టెస్ట్ క్రికెట్ ఆడుతున్నాడు.

గత కొన్నేళ్లుగా ఈ 30ఏళ్ల ప్లేయర్ అనేక గాయాలతో సతమతమయ్యాడు. దీంతో నాలుగేళ్లకు పైగా అతను టెస్ట్ జట్టుకు దూరమయ్యాడు. ప్రస్తుతం గాయాల నుంచి తను పూర్తిగా కోలుకోవడంతో ఇప్పుడు లార్డ్స్‌లో జరిగే మూడో టెస్ట్‌లో తిరిగి జట్టులోకి వచ్చాడు. ఆర్చర్‌ను జోష్ టంగ్ స్థానంలో తుది జట్టులోకి తీసుకున్నారు. మిగతా జట్టులో ఎటువంటి మార్పులు లేవు. రెండో టెస్ట్‌లో ఇంగ్లాండ్ బ్యాటింగ్ యూనిట్ నిరాశపరిచింది. దీని ఫలితంగా 336 పరుగులతో భారీ ఓటమి ఎదురైంది. అయినా కూడా, ఇంగ్లాండ్ తమ జట్టుపై కాన్ఫిడెన్స్ గా ఉంది. కెప్టెన్ బెన్ స్టోక్స్, జాక్ క్రాలీల ఫామ్ ప్రస్తుతానికి ప్రశ్నార్థకంగా ఉంది. వెటరన్ జో రూట్ కూడా మధ్యలో తనేంటో మరోసారి నిరూపించుకోవాలి.

గస్ అట్కిన్సన్ ను లార్డ్స్‌లో అద్భుతమైన రికార్డు ఉన్నప్పటికీ, అతన్ని జట్టు యాజమాన్యం పక్కన పెట్టింది. అతను నాలుగో టెస్ట్‌లో ఆడే అవకాశం ఉంది. ఆ మ్యాచ్ తర్వాత ఆర్చర్‌కు ఓవల్‌లో జరిగే ఐదో టెస్ట్‌కు విశ్రాంతి ఇవ్వొచ్చు. అయితే, ఇది లార్డ్స్ మ్యాచ్ ఫలితంపై ఆధారపడి ఉంటుంది.

ఎడ్జ్‌బాస్టన్‌లో భారత్ చేతిలో 336 పరుగుల భారీ ఓటమి తర్వాత, ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ పిచ్ స్వభావం గురించి అసంతృప్తి వ్యక్తం చేశాడు. లార్డ్స్‌లో పేసర్‌లకు అనుకూలమైన పిచ్ కావాలని పేర్కొన్నాడు. ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే, మూడో టెస్ట్‌లో పిచ్ ఎక్కువగా పేసర్‌లకే అనుకూలిస్తుంది. ఆర్చర్, జస్ ప్రీత్ బుమ్రా రీఎంట్రీ ఇవ్వడంతో రెండు జట్లకు కొత్త డైనమిక్స్ ఏర్పడతాయి. ఈ మ్యాచ్ గెలిచిన జట్టు ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 2-1 ఆధిక్యాన్ని సాధించగలదు.

లార్డ్స్ టెస్ట్‌కు ఇంగ్లాండ్ ప్లేయింగ్ ఎలెవన్

బెన్ డకెట్, జాక్ క్రాలీ, ఆలీ పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్(కెప్టెన్), జామీ స్మిత్(వికెట్ కీపర్), క్రిస్ వోక్స్, బ్రిడాన్ కార్సే, జోఫ్రా ఆర్చర్, షోయెబ్ బషీర్,

మరిన్ని క్రికెట్ న్యూస్ కోసం ఇక్కడ చేయండి..