AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video: ఇది కదా ఆనందమంటే.. భాంగ్రా స్టెప్పులతో అదరగొట్టి కోహ్లీ, అర్షదీప్.. వైరల్ వీడియో

Virat Kohli and Arshdeep Singh Bhangra Dance: జూన్ 29, ఈ తేదీ భారత క్రికెట్ అభిమానులందరికీ చాలా ప్రత్యేకమైనదిగా నిలిచింది. శనివారం, T20 ప్రపంచ కప్ 2024 చివరి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా (IND vs SA)ని 7 పరుగుల తేడాతో ఓడించి భారత జట్టు టైటిల్‌ను గెలుచుకుంది. 11 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఎట్టకేలకు టీమ్ ఇండియా మళ్లీ ఐసీసీ ట్రోఫీని చేజిక్కించుకుంది. అర్ష్‌దీప్ సింగ్, రింకూ సింగ్ ఈ చారిత్రాత్మక విజయాన్ని విరాట్ కోహ్లీతో కలిసి తమదైన స్టైల్లో భాంగ్రా డ్యాన్స్‌తో సెలబ్రేట్ చేసుకున్నారు.

Video: ఇది కదా ఆనందమంటే.. భాంగ్రా స్టెప్పులతో అదరగొట్టి కోహ్లీ, అర్షదీప్.. వైరల్ వీడియో
Virat Kohli And Arshdeep Si
Venkata Chari
|

Updated on: Jun 30, 2024 | 10:57 AM

Share

Virat Kohli and Arshdeep Singh Bhangra Dance: జూన్ 29, ఈ తేదీ భారత క్రికెట్ అభిమానులందరికీ చాలా ప్రత్యేకమైనదిగా నిలిచింది. శనివారం, T20 ప్రపంచ కప్ 2024 చివరి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా (IND vs SA)ని 7 పరుగుల తేడాతో ఓడించి భారత జట్టు టైటిల్‌ను గెలుచుకుంది. 11 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఎట్టకేలకు టీమ్ ఇండియా మళ్లీ ఐసీసీ ట్రోఫీని చేజిక్కించుకుంది. అర్ష్‌దీప్ సింగ్, రింకూ సింగ్ ఈ చారిత్రాత్మక విజయాన్ని విరాట్ కోహ్లీతో కలిసి తమదైన స్టైల్లో భాంగ్రా డ్యాన్స్‌తో సెలబ్రేట్ చేసుకున్నారు.

భాంగ్రాతో దుమ్మురేపిన విరాట్ కోహ్లి, అర్ష్‌దీప్ సింగ్..

ఫైనల్‌లో గెలిచిన భారత జట్టు ఆటగాళ్లు తమ ఆనందాన్ని అదుపు చేసుకోలేకపోయారు. అర్ష్‌దీప్ సింగ్ ఫీల్డ్‌లో పంజాబ్ మ్యూజిక్ ట్యూన్ విన్న వెంటనే భాంగ్రా చేయడం ప్రారంభించాడు. ఇది చూసిన విరాట్ కోహ్లీ కూడా అతనికి తోడయ్యాడు. ఇదే సమయంలో మహ్మద్ సిరాజ్, అక్షర్ పటేల్, రింకూ సింగ్ కూడా డ్యాన్స్ చేస్తూ కనిపించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరలవుతోంది.

ఈ వీడియోను ఇక్కడ చూడండి..

View this post on Instagram

A post shared by ICC (@icc)

ఫైనల్లో విరాట్ కోహ్లీ మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్..

ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అయితే, తొలి 10 ఓవర్లలోపే జట్టులోని ముగ్గురు కీలక బ్యాట్స్‌మెన్‌ల వికెట్లు పడినప్పుడు, ఈ నిర్ణయం జట్టుకు తప్పని తేలింది.

అయితే, ఆ తర్వాత, విరాట్ కోహ్లి మరోసారి ముఖ్యమైన మ్యాచ్‌లో సత్తా చాటాడు. 59 బంతుల్లో 76 పరుగులతో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఈ కారణంగా భారత్ 7 వికెట్లు కోల్పోయి 176 లక్ష్యాన్ని నిర్దేశించింది. టోర్నీలో మిగిలిన మ్యాచ్‌లలో కోహ్లీ బ్యాట్ నిశ్శబ్దంగా ఉంది, కానీ ఈ మ్యాచ్‌లో అతని ఇన్నింగ్స్ కారణంగా, టీమ్ ఇండియా మ్యాచ్‌లో విజయం సాధించింది.

టీ20 అంతర్జాతీయ క్రికెట్‌కు విరాట్, రోహిత్ వీడ్కోలు..

ఫైనల్‌లో గెలిచిన ఆనందంతో పాటు భారత అభిమానులకు బ్యాడ్ న్యూస్ కూడా వచ్చింది. టీ20 అంతర్జాతీయ క్రికెట్‌కు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వీడ్కోలు పలికారు. మ్యాచ్ అనంతరం ఈ విషయాన్ని వారే స్వయంగా ప్రకటించారు. ఇప్పుడు ఈ ఫార్మాట్‌లో యువ ఆటగాళ్లు బాధ్యత వహించాల్సిన అవసరం ఉందని తెలిపారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..