Video: కెప్టెన్‌గా మిస్సైన చోటే.. కోచ్‌గా ఒడిసిపట్టేశాడు.. డ్రీమ్ ట్రోఫీతో ద్రవిడ్ రియాక్షన్ మాములుగా లేదుగా..
Rahul Dravid Reaction After Winning T20 World Cup 2024: రాహుల్ ద్రవిడ్ కోచింగ్‌లో భారత జట్టు T20 ప్రపంచ కప్ 2024 టైటిల్‌ను గెలుచుకుంది. ద్రవిడ్ తన కెరీర్‌లో ప్లేయర్‌గా ప్రపంచకప్ ట్రోఫీని గెలవలేకపోయాడు. కానీ, కోచ్‌గా సాధించాడు. ప్రపంచకప్ ట్రోఫీని సొంతం చేసుకున్న తర్వాత రాహుల్ ద్రవిడ్ స్పందన తప్పక చూడాల్సిందే. ఈ సెలబ్రేషన్ స్టైల్‌ను ఇంతకు ముందు ఎన్నడూ చూసి ఉండరు. రాహుల్ ద్రవిడ్ ఎంతో ఉత్సాహంగా కనిపించాడు. యువ ఆటగాడిలా సంబరాలు చేసుకున్నాడు. ట్రోఫీ చేతికందగానే పూనకాలు వచ్చినట్లే చెలరేగిపోయాడు.
Rahul Dravid Reaction After Winning T20 World Cup 2024: రాహుల్ ద్రవిడ్ కోచింగ్‌లో భారత జట్టు T20 ప్రపంచ కప్ 2024 టైటిల్‌ను గెలుచుకుంది. ద్రవిడ్ తన కెరీర్‌లో ప్లేయర్‌గా ప్రపంచకప్ ట్రోఫీని గెలవలేకపోయాడు. కానీ, కోచ్‌గా సాధించాడు. ప్రపంచకప్ ట్రోఫీని సొంతం చేసుకున్న తర్వాత రాహుల్ ద్రవిడ్ స్పందన తప్పక చూడాల్సిందే. ఈ సెలబ్రేషన్ స్టైల్‌ను ఇంతకు ముందు ఎన్నడూ చూసి ఉండరు. రాహుల్ ద్రవిడ్ ఎంతో ఉత్సాహంగా కనిపించాడు. యువ ఆటగాడిలా సంబరాలు చేసుకున్నాడు. ట్రోఫీ చేతికందగానే పూనకాలు వచ్చినట్లే చెలరేగిపోయాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది.
2007లోనే వెస్టిండీస్‌లో జరిగిన ప్రపంచకప్‌లో రాహుల్ ద్రవిడ్ కెప్టెన్సీలో బరిలోకి దిగిన భారత జట్టు తొలి రౌండ్‌లోనే నిష్క్రమించాల్సి వచ్చింది. అయితే 17 ఏళ్ల తర్వాత అదే గడ్డపై కోచ్‌గా ప్రపంచకప్ ట్రోఫీ గెలిచిన ఘనత సాధించాడు. సౌరవ్ గంగూలీ సారథ్యంలో 2003 ప్రపంచకప్‌లో ఫైనల్‌కు చేరిన భారత జట్టులో రాహుల్ ద్రవిడ్ కూడా సభ్యుడిగా ఉన్నాడు. ఆటగాడిగా రాహుల్ ద్రవిడ్ ప్రపంచకప్ ట్రోఫీని ఎప్పటికీ గెలవలేకపోయాడు. కానీ కోచ్‌గా అతను ఈ ఘనత సాధించాడు.
ట్రోఫీ గెలిచిన తర్వాత రాహుల్ ద్రవిడ్ సెలబ్రేషన్స్..
Rahul Dravid finally unleashed all his emotions.. this is a moment too! pic.twitter.com/52Pb3uHHDV
— Keh Ke Peheno (@coolfunnytshirt) June 29, 2024
రాహుల్ ద్రవిడ్ ట్రోఫీని తన చేతుల్లోకి తీసుకున్న వెంటనే, అతను విపరీతంగా అరుస్తూ సంబరాలు చేసుకున్నాడు. భారత అభిమానులు ఇలాంటి మోడ్‌లో రాహుల్ ద్రవిడ్‌ను మొదటిసారి చూశారు. ఈ విజయాన్ని ఎలా సెలబ్రేట్ చేసుకున్నాడో మీరూ లుక్కేయండి.
You would have never seen this avatar of Rahul Dravid.#T20WorldCupFinal #HardikPandya#RahulDavidpic.twitter.com/UapK7lyh36
— Manoj Tiwari (@ManojTiwariIND) June 30, 2024
ప్రధాన కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ పదవీకాలం ఇప్పుడు ముగిసింది. అతని ఒప్పందం 2024 టీ20 ప్రపంచకప్ వరకు మాత్రమే. T20 ప్రపంచ కప్ 2024 ఫైనల్ భారత జట్టుతో కోచ్‌గా అతని చివరి మ్యాచ్. ఈ విధంగా ముగ్గురు వెటరన్లు కలిసి టీ20 జట్టుకు వీడ్కోలు పలికారు. రాహుల్ ద్రవిడ్ కోచ్ పదవీకాలం ముగిసింది. టీ20 ఇంటర్నేషనల్‌కు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటించారు.
టీ20 ప్రపంచకప్ 2024 టైటిల్ గెలిచిన తర్వాత కోచ్ రాహుల్ ద్రవిడ్ పెద్ద రియాక్షన్ ఇచ్చాడు. ప్లేయర్‌గా ప్రపంచకప్ ట్రోఫీని గెలవలేకపోయానని, కోచ్‌గా చేశానని చెప్పుకొచ్చాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..